iDreamPost
android-app
ios-app

Usman Khan: క్రికెట్ లో పెను విధ్వంసం.. కేవలం 27 బంతుల్లోనే

  • Published Jan 01, 2024 | 4:58 PM Updated Updated Jan 01, 2024 | 4:58 PM

ప్రపంచ క్రికెట్ లో కనీవినీ ఎరుగని విధ్వంసం నమోదు అయ్యింది. అతడి బ్యాటింగ్ ముందు బౌలర్లు, ఫీల్డర్లు ప్రేక్షకపాత్ర వహించకతప్పలేదు. కేవలం 27 బంతుల్లోనే..

ప్రపంచ క్రికెట్ లో కనీవినీ ఎరుగని విధ్వంసం నమోదు అయ్యింది. అతడి బ్యాటింగ్ ముందు బౌలర్లు, ఫీల్డర్లు ప్రేక్షకపాత్ర వహించకతప్పలేదు. కేవలం 27 బంతుల్లోనే..

Usman Khan: క్రికెట్ లో పెను విధ్వంసం.. కేవలం 27 బంతుల్లోనే

ప్రపంచ క్రికెట్ లోకి టీ20, టీ10 ఫార్మాట్స్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాయో.. అప్పటి నుంచి క్రికెట్ రూపురేఖలే మారిపోయాయి. బ్యాటర్లు ఎప్పుడు ఏ విధంగా చెలరేగుతాడో ఊహించలేకపోతున్నారు క్రికెట్ లవర్స్. తాజాగా ప్రపంచ క్రికెట్ లో పెను విధ్వంసం నమోదైంది. ఓ బ్యాటర్ చెలరేగిన విధానం చూస్తే.. మనం ముక్కున వేలు ఏసుకోవాల్సిందే. అతడు కేవలం 27 బంతుల్లోనే 98 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అబుదాబి వేదికగా జరుగుతున్న డి10 పేరుతో జరుగుతున్న క్రికెట్ లీగ్ లో ఈ సంచలన ఇన్నింగ్స్ నమోదు చేశాడు అజ్మాన్ టీమ్ ఆటగాడు ఉస్మాన్ ఖాన్. మరి అతడి థండర్ బ్యాటింగ్ ఏ విధంగా సాగిందో ఓ లుక్కేద్దాం పదండి.

అబుదాబి వేదికగా డి10 క్రికెట్ లీగ్ జరుగుతోంది. ఈ లీగ్ లో కనీవినీ ఎరుగని విధ్వంస నమోదు అయ్యింది. ఈ మ్యాచ్ లో అజ్మాన్ టీమ్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. కనికరం లేకుండా ఫోర్లు, సిక్సర్లతో దుమ్మురేపాడు. క్రీజ్ లోకి వచ్చీరాగానే చితక్కొట్టడం స్టార్ట్ చేశాడు. ఉస్మాన్ ఖాన్ తొలి 12 బంతుల్లో 12 బౌండరీలు బాదాడు. ఏడు బంతుల్లో 7 ఫోర్లు కొట్టిన అతడు ఆ తర్వాత 8వ బాల్ ను సిక్సర్ గా మలిచాడు. ఎలాంటి బాల్, బౌలర్ ఎవరు, అన్నది అతడికి అనవసరం.. సిక్సర్ కొట్టామా, లేదా అన్నట్లుగా చెలరేగాడు.

ఇక ఈ మ్యాచ్ లో ఉస్మాన్ ఖాన్ ఓవరాల్ గా మెుత్తం 27 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 98 పరుగులు చేసి.. కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఉస్మాన్ ఖాన్ భీకర బ్యాటింగ్ ధాటికి నిర్ణీత 10 ఓవర్లలో అజ్మాన్ జట్టు 183 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఉస్మాన్ థండర్ ఇన్నింగ్స్ కు తోడు సాగర్ కళ్యాణ్ కూడా అర్దశతకంతో చెలరేగాడు. అనంతరం ఎమిరైట్స్ బ్లూస్ 10 ఓవర్లకి 9 వికెట్లు కోల్పోయి 73 పరుగులు మాత్రమే చేసింది. 27 బంతుల్లోనే 98 రన్స్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఇలాంటి ఇన్నింగ్స్ చూసి ఉండరు అంటూ కితాబిస్తున్నారు క్రీడా పండితులు. మరి ఉస్మాన్ ఖాన్ థండర్ బ్యాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.