iDreamPost
android-app
ios-app

USA vs BAN: వరల్డ్ కప్ ముందు బంగ్లాకు షాక్.. సరికొత్త చరిత్ర సృష్టించిన అమెరికా!

  • Published May 22, 2024 | 10:44 AM Updated Updated May 22, 2024 | 10:52 AM

టీ20 ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇస్తున్న దేశాల్లో ఒకటైన అమెరికా.. టీ20 క్రికెట్ లో సంచలనాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్ కు షాకిస్తూ.. సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇస్తున్న దేశాల్లో ఒకటైన అమెరికా.. టీ20 క్రికెట్ లో సంచలనాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్ కు షాకిస్తూ.. సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ వివరాల్లోకి వెళితే..

USA vs BAN: వరల్డ్ కప్ ముందు బంగ్లాకు షాక్.. సరికొత్త చరిత్ర సృష్టించిన అమెరికా!

టీ20 వరల్డ్ కప్ 2024 కోసం 20 జట్లు సిద్ధం అవుతున్నాయి. ఇక ఈ మెగా టోర్నీ ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని రోజులే ఉంది. ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్ కు ఊహించని షాకిచ్చింది పసికూన అమెరికా. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తాజాగా జరిగిన తొలి మ్యాచ్ లో  5 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. దాంతో వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

టీ20 ప్రపంచ కప్ కు ఆతిథ్యం ఇస్తున్న దేశాల్లో ఒకటైన అమెరికా.. టీ20 క్రికెట్ లో సంచలనాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్ తో ప్రారంభం అయిన మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. జరిగిన తొలి మ్యాచ్ లో అమెరికా 5 వికెట్ల తేడాతో బంగ్లాను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ను భారీ స్కోర్ చేయకుండా అద్భుతంగా నిలవరించారు అమెరికా  బౌలర్లు. బంగ్లా ఓపెనర్లు లిట్టన్ దాస్(14), సౌమ్య సర్కార్(20)లను తక్కువ పరుగులకే పెవిలియన్ చేర్చి.. మ్యాచ్ పై పట్టు సాధించారు. ఆ తర్వాత కెప్టెన్ శాంటో(3)ను కూడా ఔట్ చేసిన అమెరికా.. తాము పసికూన కాదని చాటి చెప్పింది. అయితే బంగ్లా 153 పరుగులు సాధించింది అంటే అది తౌహిద్ హృదయ్ కారణంగానే.

ఈ మ్యాచ్ లో 51 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి దశలో బ్యాటింగ్ వచ్చాడు తౌహిత్ హృదయ్. ఒక వైపు వికెట్లు పడుతున్నా, ఒంటరి పోరాటం చేశాడు. 47 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 58 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టోయి బంగ్లా 153 రన్స్ చేసింది. అనంతరం 154 రన్స్ టార్గెట్ ను మరో 3 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోరే అండర్సన్(34*), హర్మిత్ సింగ్ కేవలం 13 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సులతో 33 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. హర్మిత్ భారత మూలాలున్న ఆటగాడే. రంజీల్లో ముంబైకి, ఐపీఎల్ లో రాజస్తాన్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ మ్యాచ్ లో ఒకదశలో అమెరికా సైతం 94 రన్స్ కే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా ఉంది. కానీ అండర్సన్-హర్మిత్ జోడీ కేవలం 28 బంతుల్లోనే 64 పరుగులు జోడించి అమెరికాకు చారిత్మాక విజయాన్ని కట్టబెట్టారు.  టెస్ట్ ఆడే దేశంపై గెలవడం అమెరికాకు ఇది రెండోసారి మాత్రమే. మరి బంగ్లాను చిత్తుచేసిన అమెరికాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.