Somesekhar
భారత్ తో మ్యాచ్ కు ముందు యూఎస్ఏ కెప్టెన్ మోనాంక్ పటేల్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఆ టీమిండియా క్రికెటర్ అంటే తనకు ఇష్టమని, అతడే నా ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు. మరి ఆ ఆటగాడు ఎవరు? తెలుసుకుందాం..
భారత్ తో మ్యాచ్ కు ముందు యూఎస్ఏ కెప్టెన్ మోనాంక్ పటేల్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఆ టీమిండియా క్రికెటర్ అంటే తనకు ఇష్టమని, అతడే నా ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు. మరి ఆ ఆటగాడు ఎవరు? తెలుసుకుందాం..
Somesekhar
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా వర్సెస్ అమెరికా జట్ల మధ్య జరగనుంది. ఈ కీలకమైన పోరు కోసం ఇప్పటికే ఇరు జట్లు సిద్ధమైయ్యాయి. నాసౌవ్ కౌంటీ క్రికెట్ స్టేడియం న్యూయార్క్ వేదికగా రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ కు ముందు యూఎస్ఏ కెప్టెన్ మోనాంక్ పటేల్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఆ టీమిండియా స్టార్ క్రికెటర్ అంటే తనకు ఇష్టమని, అతడే నా ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు. మరి ఆ స్టార్ ప్లేయర్ ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పొట్టి వరల్డ్ కప్ లో పసికూన అమెరికా అద్భుత ఆటతీరుతో అదరగొడుతోంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లో కూడా నెగ్గి.. ఔరా అనిపించింది. పాకిస్తాన్ ను ఓడించి ప్రపంచం చేత శభాష్ అనిపించుకుంది. క్రికెట్ లో ఇప్పుడిప్పుడే ఓనామాలు నేర్చుకుంటున్న యూఎస్ఏ.. తన తర్వాత మ్యాచ్ లో పటిష్టమైన భారత్ ను ఢీకొనబోతోంది. ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ మోనాంక్ పటేల్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ క్రికెట్ లో ఆ టీమిండియా ప్లేయర్ నా ఫేవరెట్ అంటూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరును చెప్పుకొచ్చాడు.
హిట్ మ్యాన్ ఆటంటే ఎంతో ఇష్టమని, అతడి కెప్టెన్సీ అద్భుతంగా ఉంటుందని మోనాంక్ ప్రశంసించాడు. ఇక యూఎస్ఏ జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లతో ఆడటం తమకు ఎంతో సంతోషంగా ఉందని తమ భావాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే అమెరికా జట్టు ఓపెనర్ ఆరోన్ జోన్స్ టీమిండియాకు చిన్నపాటి వార్నింగే ఇచ్చాడు. పాకిస్తాన్ ను ఓడించిన విధంగానే ఇండియాపై కూడా ఆడతామని, ఇందుకోసం తాము కఠోరంగా ప్రాక్టీస్ చేస్తున్నామని పేర్కొన్నాడు. మరి మ్యాచ్ కు ముందు యూఎస్ఏ కెప్టెన్ తన ఫేవరెట్ ప్లేయర్ రోహిత్ శర్మ అని చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
USA captain Monank Patel:
“Rohit Sharma is my favourite player”. (Sports Tak). pic.twitter.com/N0WAavlvXF
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 12, 2024