SNP
Rohit Sharma, Hardik Pandya: పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను చాలా మంది ఎంజాయ్ చేసి ఉంటారు. కానీ, మ్యాచ్ తర్వాత జరిగిన కొన్ని సీన్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలుస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Rohit Sharma, Hardik Pandya: పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను చాలా మంది ఎంజాయ్ చేసి ఉంటారు. కానీ, మ్యాచ్ తర్వాత జరిగిన కొన్ని సీన్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలుస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులు కావాల్సినంత వినోదాన్ని అందించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, మిస్టర్ 360 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ రాణించడంతో పాటు జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అదరగొట్టడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. పైగా మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్టార్టింగ్‌లో టపటపా వికెట్లు పడినా.. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ లాంటి యువ క్రికెటర్లు పోరాడిన తీరుకు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మొత్తంగా ఈ మ్యాచ్.. క్రికెట్ అభిమానులకు పైసా వసూల్ మ్యాచ్‌లా మారింది. అయితే.. ఈ మ్యాచ్ తర్వాత కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. వాటిని చాలా మంది క్రికెట్ అభిమానులు మిస్ అయి ఉంటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో హార్ధిక్ పాండ్యాను నియమించిన విషయం తెలిసిందే. అయితే.. పాండ్యా కెప్టెన్సీలో ఈ ఏడాది ఆడిన తొలి మూడు మ్యాచ్‌ల్లో కూడా ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. దీంతో పాండ్యాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే కెప్టెన్సీ పోవడంతో రోహిత్ శర్మ, హార్ధిక్‌పాండ్యా మధ్య గ్యాప్ కూడా వచ్చిందనే గుసగుసలు వినిపించాయి. కానీ, గురువారం పంజాబ్‌తో మ్యాచ్ తర్వాత వారిద్దరి మధ్య అలాంటి గ్యాప్ లేదు అనే చెప్పే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. మ్యాచ్ గెలిచిన తర్వాత.. రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా హగ్ చేసుకున్న దృష్ట్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మ్యాచ్ గెలిచిన తర్వాత.. ఇషాన్ కిషన్‌ను హగ్ చేసుకున్న పాండ్యా.. అటు నుంచి రోహిత్ శర్మ రావడం గమనించి.. వెంటనే అటుగా వెళ్లి రోహిత్‌తో విజయానందం పంచుకున్నాడు. ఈ సీన్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 రన్స్ చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 36 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 78 పరుగులు, తిలక్ వర్మ 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 34 పరుగులు చేసి రాణించారు. పంజాబ్ ముందు ముంబై 193 పరుగుల టఫ్ టార్గెట్ ఉంచింది. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, సామ్ కరన్2, రబాడ ఒక వికెట్ పడగొట్టారు. 193 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్.. ఆరంభంలో టపటపా వికెట్లు కోల్పోయింది. శశాంక్ 41, అశుతోష్ 61 పరుగులతో అదరిపోయే ఇన్నింగ్స్‌లు ఆడినా పంజాబ్‌ను గెలిపించలేకపోయారు. మొత్తంగా పంజాబ్ 19.1 ఓవర్లలో 183 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో కోయోట్జీ, బుమ్రా మూడేసి వికెట్లు పడగొట్టి రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాను రోహిత్ శర్మను హగ్ చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The chant for Captain Rohit Sharma after mumbai Indians win last night🔥💪
Craze about Captain Rohit Sharma is never end💪🔥
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) April 19, 2024