Unmukt Chand: ఉన్ముక్త్ చంద్ పని అయిపోయింది అనుకున్నారా? కోహ్లీ ఫ్రెండ్ ని కసిగా కొట్టాడు!

T20 వరల్డ్ కప్.. అమెరికా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు ఉన్ముక్ చంద్. దాంతో అందరూ అతడి పని అయిపోయింది అనుకున్నారు. కానీ మేజర్ లీగ్ క్రికెట్ 2024 టోర్నీలో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. క్లాసిక్ ఇన్నింగ్స్ తో అలరించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

T20 వరల్డ్ కప్.. అమెరికా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు ఉన్ముక్ చంద్. దాంతో అందరూ అతడి పని అయిపోయింది అనుకున్నారు. కానీ మేజర్ లీగ్ క్రికెట్ 2024 టోర్నీలో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. క్లాసిక్ ఇన్నింగ్స్ తో అలరించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ఉన్ముక్ చంద్.. టీమిండియాకు 2012 అండర్ 19 వరల్డ్ కప్ ను అందించాడు. ఇక ఆ తర్వాత దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించాడు ఈ యువ క్రికెటర్. దాంతో త్వరలోనే జాతీయ జట్టులోకి వస్తాడని అందరూ భావించారు. కానీ అప్పటికే టీమిండియాలో కుప్పలు తెప్పలుగా యంగ్ ప్లేయర్లు ఉన్నారు. దాంతో టీమ్ లో చోటు దక్కించుకోవడంలో విఫలం అయ్యాడు. ఆ తర్వాత ఇక్కడ ఉంటే అవకాశాలు రావని, అమెరికాకు పయణమైయ్యాడు. అక్కడ రాణించడంతో అమెరికా జట్టుకు నాయకత్వం వహించే ఛాన్స్ దక్కింది. అయితే అనూహ్యంగా తాజాగా ముగిసిన వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు ఉన్ముక్ చంద్. దాంతో అందరూ అతడి పని అయిపోయింది అనుకున్నారు. కానీ మేజర్ లీగ్ క్రికెట్ 2024 టోర్నీలో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.

అమెరికా వేదికగా మేజర్ లీగ్ క్రికెట్ 2024 టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో తాజాగా లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ వర్సెస్ టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లాస్ ఏంజెల్స్ టీమ్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు టీమిండియా మాజీ ప్లేయర్, ప్రస్తుత అమెరికా ప్లేయర్ ఉన్ముక్ చంద్. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ లో అమెరికా జట్టులో చోటు దక్కించుకోవడంలో విఫలం అయ్యాడు ఉన్ముక్. అయితే ఆ కసిని అంతా ఈ టోర్నీలో చూపిస్తున్నాడు.

లీగ్ లో భాగంగా టెక్సాస్ సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో తన జట్టు.. 5 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ టైమ్ లో బాధ్యతాయుత ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నా ఉన్ముక్ చంద్. చూడముచ్చటైన షాట్లతో అభిమానులను అలరించాడు. మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫ్రెండ్ నవీన్ ఉల్ హక్ బౌలింగ్ లో కసిగా కొట్టాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేయడానికి నవీన్ ఉల్ హక్ రాగా.. అతడి ఓవర్లో వరుసగా 4, 6, 4 బాది.. స్ట్రోక్ ప్లేతో ఆకట్టుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ.. సూపర్ నాక్ తో ఆకట్టుకున్నాడు. సహచర బ్యాటర్ల నుంచి సహకారం లభించనప్పటికీ.. తన పనితాను చేసుకుంటూ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు.

ఈ మ్యాచ్ లో ఉన్ముక్ చంద్ ఓవరాల్ గా 45 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 3 సిక్సులతో 68 పరుగులు చేసి.. చివరి ఓవర్లో వెనుదిరిగాడు. ఉన్ముక్ చంద్ బ్యాటింగ్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం 163 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టెక్సాస్ టీమ్ పూర్తి ఓవర్లు ఆడి 8 వికెట్లకు 150 పరుగుల వద్ద ఆగిపోయి.. 12 రన్స్ తేడాతో ఓడిపోయింది. డెవాన్ కాన్వే 53 పరుగులతో రాణించినప్పటికీ.. జట్టును గెలిపించలేకపోయాడు. ఇక తన పని అయిపోయింది అనుకుంటున్న టైమ్ లో చక్కటి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. మరి 5 రన్స్ కే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత క్లాసిక్ ఇన్నింగ్స్ తో అలరించిన  ఉన్ముక్ చంద్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments