Somesekhar
Suryakumar Yadav Controversy Catch: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ముగిసి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ.. సూర్యకుమార్ పట్టిన అద్బుతమైన క్యాచ్ గురించి ఎక్కడో ఒకచోట వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వివాదానికి తెరదింపుతూ.. ఓ కొత్త వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
Suryakumar Yadav Controversy Catch: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ముగిసి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ.. సూర్యకుమార్ పట్టిన అద్బుతమైన క్యాచ్ గురించి ఎక్కడో ఒకచోట వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వివాదానికి తెరదింపుతూ.. ఓ కొత్త వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
టీ20 వరల్డ్ కప్ 2024.. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ బౌండరీలైన్ దగ్గర అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దాంతో డేంజరస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ పెవిలియన్ చేరాడు. ఇదే జరగకపోయి ఉంటే.. ఫలితం వేరేలా ఉండేది అన్నది కాదనలేని సత్యం. అయితే ఈ క్యాచ్ పై పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. ఫైనల్ పోరు ముగిసి ఇన్ని రోజులు కావొస్తున్న ఎక్కడో ఒకచోట ఈ క్యాచ్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వివాదానికి తెర దించుతూ.. నెట్టింట ఓ కొత్త వీడియో వైరల్ అవుతోంది. దాంతో ఈ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయ్యింది.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ బౌండరీలైన్ దగ్గర పట్టిన స్టన్నింగ్ క్యాచ్ క్రికెట్ హిస్టరీలోనే బెస్ట్ క్యాచ్ గా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ క్యాచ్ ఎంత పాపులర్ అయ్యిందో.. అంతే వివాదాస్పదం అయ్యింది. క్యాచ్ పట్టే సమయంలో సూర్య కాలు బౌండరీలైన్ తాకిందని కొందరు కామెంట్ చేయగా, మరికొందరు మాత్రం అది ఫెయిర్ క్యాచ్ అంటూ సూర్యకు మద్ధతు పలికారు. సౌతాఫ్రికా లెజెండ్ షాన్ పొల్లాక్ సైతం ఆ క్యాచ్ సరైనదే అని పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ క్యాచ్ కు సంబంధించిన కొత్త వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వీడియోలో సూర్యకుమార్ క్లీన్ క్యాచ్ అందుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కాస్త వైరల్ కావడంతో.. ఈ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయ్యింది. ఇప్పటికైనా తప్పుడు క్యాచ్ అన్న వాళ్లు నోరు మూసుకుంటారా? అంటూ ఇండియన్ ఫ్యాన్స్ విమర్శించిన వారికి కౌంటర్లు ఇస్తున్నారు. కాగా.. ఈ క్యాచ్ పట్టిన తర్వాత సూర్య కూడా స్పందించాడు. ఇలాంటి క్యాచ్ లు పట్టడం వెనక ఎంతో ప్రాక్టీస్ ఉందని, వివిధ గ్రౌండ్స్ లో గాలికి తగ్గట్లుగా క్యాచ్ లు పట్టడం ప్రాక్టీస్ చేశానని సూర్య చెప్పుకొచ్చాడు. అలాగే రోహిత్ శర్మ దగ్గరలో ఉంటే.. బంతి అతడికే విసిరేద్దామనుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు మిస్టర్ 360 ప్లేయర్. మరి ఈ కాంట్రవర్సీ క్యాచ్ కు సంబంధించిన కొత్త వీడియోను మీరూ చూసేయండి.