Nidhan
కొందరు అన్‌లక్కీ ప్లేయర్లు ఉంటారు. ఎంతో టాలెంట్ ఉన్నా వాళ్లు పెద్దగా ఏదీ సాధించలేరు. దురదృష్టమో ఇంకేమో కానీ వాళ్ల కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన సాగుతుంది. అలాంటి ఓ క్రికెటర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..
కొందరు అన్‌లక్కీ ప్లేయర్లు ఉంటారు. ఎంతో టాలెంట్ ఉన్నా వాళ్లు పెద్దగా ఏదీ సాధించలేరు. దురదృష్టమో ఇంకేమో కానీ వాళ్ల కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన సాగుతుంది. అలాంటి ఓ క్రికెటర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..
Nidhan
కొందరు అన్‌లక్కీ ప్లేయర్లు ఉంటారు. ఎంతో టాలెంట్ ఉన్నా వాళ్లు పెద్దగా ఏదీ సాధించలేరు. దురదృష్టమో ఇంకేమో కానీ వాళ్ల కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన సాగుతుంది. కెరీర్లో ఎక్కడికో వెళ్తారు, అన్ని రికార్డులు బద్దలు కొడతారు అంటూ అందరూ వారి మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. కానీ అవేవీ వర్కౌట్ కావు. అలాంటి ఓ దురదృష్టవంతుడే ఉన్ముక్త్ చంద్. కెప్టెన్‌గా భారత జట్టుకు అండర్-19 వరల్డ్ కప్ అందించాడు. సూపర్బ్ బ్యాటింగ్‌తో టీమిండియా ఫ్యూచర్ స్టార్ తానేనని ఆశలు రేకెత్తించాడు. అందరూ అతడ్ని నెక్స్ట్ సచిన్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. కానీ ఎంత ప్రయత్నించినా టీమిండియాలో చోటు దక్కలేదు. ఐపీఎల్‌లోనూ ఐదారు సీజన్స్ ఆడినా అంతగా ఇంప్రెస్ చేయలేదు. వచ్చిన అరకొర ఛాన్సులను సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాడు.
డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చాటినా భారత సెలక్టర్లు ఉన్ముక్త్ చంద్‌ను కరుణించలేదు. దీంతో అతడు విసిగిపోయాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్‌లోనూ అవకాశాలు రాకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించి.. ఛాన్సులు వెతుక్కుంటూ అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లాడు. యూఎస్ఏ టీమ్‌కు ఆడి తన ఇంటర్నేషనల్ క్రికెట్ డ్రీమ్‌ను సాకారం చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. కసిగా అక్కడికి వెళ్లిన ఉన్ముక్త్.. మైనర్ క్రికెట్ లీగ్‌లో సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో జూన్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా టీమ్‌కు అతడ్నే కెప్టెన్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ మళ్లీ ఉన్ముక్త్‌ను బ్యాడ్ లక్ వెంటాడింది. కెనడాతో జరిగే టీ20 సిరీస్ కోసం ప్రకటించిన యూఎస్ స్క్వాడ్‌లో అతడికి ప్లేస్ దక్కలేదు.
కెనడా సిరీస్‌కు కివీస్ ఆల్‌రౌండర్ కోరె అండర్సన్‌తో పాటు గజానంద్ సింగ్, జెస్సీ సింగ్, మోనక్ పటేల్, నిస్గర్ పటేల్, స్టీవెన్ టేలర్, ఉస్మాన్ రఫీక్, నోష్టుష్ కెన్జిగ్ తదిరత ప్లేయర్లను సెలక్ట్ చేశారు. ఈ సిరీస్‌లో చోటు దక్కకపోవడంతో టీ20 వరల్డ్ కప్‌లో ఉన్ముక్త్ ఆడటం కష్టంగా మారింది. ఒకవేళ కెనడాతో సిరీస్‌లో ఆడితే అతడి ప్రపంచ కప్ ఆశలు సజీవంగా ఉండేవి. కానీ టీమ్‌లో స్థానం లభించకపోవడంతో వరల్డ్ కప్ ఆశలు దాదాపుగా అడుగంటినట్లే. ఎన్నో ఆశలతో దేశం దాటి వెళ్తే మళ్లీ దురదృష్టమే వెంటాడటంతో ఉన్ముక్త్ ఎమోషనల్ అయ్యాడు. తన బాధను వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టాడు. వ్యవస్థ బాగుండాలని చాలా మంది కోరుకుంటారని, కానీ పవర్లోకి వచ్చాక వాళ్లు కూడా అదే అన్యాయమైన మార్గంలో నడుస్తారని ఉన్ముక్త్ ఆ ట్వీట్లో రాసుకొచ్చాడు. మార్పు తీసుకురావాలంటే బలంగా నిలబడటం తప్ప ఏమీ చేయలేమని తెలిపాడు. మరి.. దేశం మారినా ఉన్ముక్త్ రాత మారకపోవడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: టీమిండియాలోకి మయాంక్ యాదవ్.. T20 వరల్డ్ కప్‌తో ఇంటర్నేషనల్ డెబ్యూ!
Irony of life- I keep hearing people cribbing about unfair systems in place and the need for healthy changes but when the same people come to power, they practice the same unjust means too. It’s high time we bring the change within ourselves and stand firm for what’s right 🙏🙏
— Unmukt Chand (@UnmuktChand9) March 29, 2024