క్రికెట్ లో ఆటగాళ్లకు ఫిట్ నెస్ ఎంతో ముఖ్యం అన్న సంగతి మనకు తెలియనిది కాదు. అదీకాక ఒక్కసారి గాయాల బారిన పడితే.. సదరు ఆటగాడు జట్టుకు కూడా దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆటగాళ్లు ఫిట్ నెస్ పై దృష్టిపెట్టి.. గాయాల బారిన పడకుండా శ్రమిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆటగాళ్లు మ్యాచ్ ల్లో, ప్రాక్టీస్ లో గాయపడుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే గాయం కారణంగా జట్టుకు దూరం అయిన పేసర్.. ఇంకా కోలుకోకపోవడంతో.. ఓ మెగా ఈవెంట్ కు దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. అయితే లక్కీగా ఛాన్స్ కొట్టేశాడు ఉమ్రాన్ మాలిక్.
ఆసియా క్రీడలు-2023 ప్రారంభానికి ముందే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత కొంత కాలంగా గాయం కారణంగా బాధపడుతున్న పేసర్ శివం మావి ఇంకా గాయం నుంచి కోలుకోలేదని తెలుస్తోంది. ఆసియా క్రీడల్లో భాగంగా టీమిండియా ద్వితీయ శ్రేణి క్రికెట్ జట్టులో శివం మావి కీలక బౌలర్ గా ఉన్నాడు. గాయం నుంచి మావి ఇంకా కోలుకోకపోవడంతో.. అతడి స్థానంలో స్టాండ్ బైగా ఉన్న యశ్ ఠాకూర్ ను తొలుత ప్రధాన టీమ్ లోకి ప్రమోట్ చేయాలని మేనేజ్ మెంట్ భావించినప్పటికీ.. అతడు ఫిట్ నెస్ సమస్యతో బాధపడుతున్నాడని పక్కనపెట్టారు.
ఇక ఇతడి స్థానంలో కశ్మీర్ ఎక్స్ ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ ని లేదా కర్ణాటక పేసర్ ప్రసిద్ద్ కృష్ణలో ఒకరిని చైనాకు పంపించే యోచనలో ఉందని తెలుస్తోంది. అయితే ఉమ్రాన్ మాలిక్ నే చైనాకు పంపే అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి. దీంతో లక్కీ ఛాన్స్ కొట్టేశాడు ఉమ్రాన్ మాలిక్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. చైనాలోని హాంగ్జూ వేదికగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే తొలిసారి ఈ క్రీడలకు టీమిండియా పురుషుల జట్టు, మహిళల జట్టు వెళ్లబోతోంది. ఇక ఆసియా గేమ్స్ విలేజ్ కు వెళ్లే ముందు టీమిండియా క్రికెటర్లకు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రెండు వారాలపాటు శిక్షణా శిబిరంలో పాల్గొననున్నారు. ఇక టీమిండియా జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించనున్నాడు.
🚨 BREAKING
Umran Malik replaces Shivam Mavi (injured) in the Asian Games squad
Time to cook under Ruturaj Gaikwad’s captaincy 🤝 pic.twitter.com/yIUGOB8EVO
— Yash (@CSKYash_) September 13, 2023