iDreamPost

సూపర్ క్యాచ్ కు బిత్తరపోయిన బ్యాటర్! వీడియో వైరల్..

  • Author Soma Sekhar Published - 03:09 PM, Wed - 13 September 23
  • Author Soma Sekhar Published - 03:09 PM, Wed - 13 September 23
సూపర్ క్యాచ్ కు బిత్తరపోయిన బ్యాటర్! వీడియో వైరల్..

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుతమైన క్యాచ్ లు నమోదు అవుతూ ఉంటాయి. అయితే వాటిని తలదన్నుతూ.. ఏదో ఒక మ్యాచ్ లో.. ప్రతి రోజు బ్రిలియంట్ క్యాచ్ లు నమోదు అవుతూనే ఉంటాయి. ఇటీవలే ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన వన్డేలో కివీస్ ఫీల్డర్లు పట్టిన రెండు సూపర్ క్యాచ్ లో సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్యాచ్ లను మరువకముందే ఆస్ట్రేలియా బౌలర్ పట్టిన క్యాచ్ ఇప్పుడు వైరల్ గా మారింది. బౌండరీ లైన్ వద్ద తనను తాను అదుపుచేసుకుని ఈ ఆసీస్ బౌలర్ పట్టిన క్యాచ్ చూసి బిత్తరపోవడం సౌతాఫ్రికా బ్యాటర్ వంతైంది.

ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డేలో 111 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ జట్టు టాపార్డర్ చెలరేగడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. జట్టులో డికాక్(82), బవుమా(57), హెండ్రిక్స్(39) పరుగులు చేయగా.. స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ 102 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివర్లో మార్కో జాన్సన్ 16 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్ తో 32 పరుగులతో చెలరేగుతుండగా.. అద్భుతమైన క్యాచ్ తో అతడిని పెవిలియన్ కు పంపించాడు ఆసీస్ స్టార్ బౌలర్ సీన్ అబ్బాట్.

నాథన్ ఎల్లిస్ వేసిన 47వ ఓవర్ లో విజృంభిస్తున్నాడు మార్కో జాన్సన్. ఈ ఓవర్ లో అప్పటికే 6,4,4తో మంచి జోరుమీదున్నాడు ఈ సఫారి ఆల్ రౌండర్. ఈ క్రమంలోనే 4వ బంతిని కూడా భారీ షాట్ ఆడాడు జాన్సన్. ఇక ఈ బాల్ కూడా బౌండరీలో పడుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా పరిగెత్తుకొచ్చిన సీన్ అబ్బాట్.. తనను తాను నియంత్రించుకుంటూ బౌండరీ లైన్ వద్ద డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దీంతో బిత్తరపోయి చూడటం బ్యాటర్ పనిగా మారింది. ఇలా ఎలా క్యాచ్ పట్టావ్ బ్రో అన్నట్లుగా ఫేస్ పెట్టాడు సఫారి బ్యాటర్. ఈ క్యాచ్ ను అతడు అస్సలు ఊహించలేదు. సీన్ అబ్బాట్ పట్టిన ఈ క్యాచ్ కు స్టేడియం మెుత్తం షాక్ కు గురైంది.

ఇక ఈ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. క్రికెట్ చరిత్రలో బెస్ట్ క్యాచ్ ఇది అంటూ కితాబిస్తున్నారు నెటిజన్లు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 34.3 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో వార్నర్(78), ట్రావిస్ హెడ్(38), మిచెల్ మార్ష(29) పరుగులు చేశారు. ప్రోటీస్ బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. మరి స్పైడర్ మ్యాన్ లా సీన్ అబ్బాట్ క్యాచ్ పట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి