iDreamPost
android-app
ios-app

Alzarri Joseph: వీడియో: క్లియర్‌ ఔట్‌ను నాటౌట్‌ ఇచ్చిన అంపైర్‌! రీజన్‌ తెలిస్తే షాకౌతారు!

  • Published Feb 12, 2024 | 1:24 PM Updated Updated Feb 12, 2024 | 1:24 PM

క్రికెట్‌లో జరిగే కొన్ని సంఘటనలు అస్సలు నమ్మశక్యంగా ఉండవ్‌. చాలా చిన్న లాజిక్‌తో కలలో కూడా ఊహించని రిజల్ట్‌ వస్తుంటాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒక మ్యాచ్‌లో జరిగింది. క్లియర్‌ ఔట్‌ను అంపైర్‌ నాటౌట్‌ఇచ్చాడు. అలా ఎందుకిచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం..

క్రికెట్‌లో జరిగే కొన్ని సంఘటనలు అస్సలు నమ్మశక్యంగా ఉండవ్‌. చాలా చిన్న లాజిక్‌తో కలలో కూడా ఊహించని రిజల్ట్‌ వస్తుంటాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒక మ్యాచ్‌లో జరిగింది. క్లియర్‌ ఔట్‌ను అంపైర్‌ నాటౌట్‌ఇచ్చాడు. అలా ఎందుకిచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Feb 12, 2024 | 1:24 PMUpdated Feb 12, 2024 | 1:24 PM
Alzarri Joseph: వీడియో: క్లియర్‌ ఔట్‌ను నాటౌట్‌ ఇచ్చిన అంపైర్‌!  రీజన్‌ తెలిస్తే షాకౌతారు!

క్రికెట్‌లో కొన్నిసార్లు చాలా విచిత్రకరమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అనేక సార్లు వాటికి ఆటగాళ్లు కారణమైతే.. చాలా అరుదుగా అంపైర్లు ఆ విచిత్ర ఘటనలకు కారణంగా నిలుస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన కూడా అంపైర్‌ వల్ల జరిగింది. చాలా క్లియర్‌గా రనౌట్‌ అయినా కూడా.. అంపైర్‌ దాన్ని చాలా సింపుల్‌గా నాటౌట్‌ ఇచ్చేశాడు. ఆ రనౌట్‌ వీడియో చూస్తే.. మినిమమ్‌ క్రికెట్‌ నాలెడ్జ్‌ ఉన్న వాళ్లు కూడా.. అది క్లియర్‌ అవుట్‌ అని తేల్చేస్తారు. కానీ, విచిత్రంగా ఫీల్డ్‌ అంపైర్‌ మాత్రం చాలా కన్ఫిడెంట్‌గా నాటౌట్‌ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అసలింతకీ ఈ సంఘటన ఏ మ్యాచ్‌లో జరిగింది? అంపైర్‌ నాటౌట్‌ ఇవ్వడం వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా మ్యాచ్‌లో క్యాచ్‌ అవుటైనా, లెగ్‌ బిఫోర్‌ అవుటైనా, మరే అవుటైనా.. అంపైర్‌కు అపీల్‌ చేయాల్సిందే. అప్పుడే అంపైర్‌ అది అవుటా? నాటౌటా? అనేది డిసైడ్‌ చేస్తాడు. ఈ సింపుల్‌ లాజిక్‌ను ఆస్ట్రేలియా మిస్‌ అవ్వడంతో అంపైర్‌ ఊహించని షాకిచ్చాడు. అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో విండీస్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో.. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ మూడో బంతిని విండీస్‌ బ్యాటర్‌ అల్జారీ జోసెఫ్‌ కవర్స్‌లోకి కొట్టి సింగిల్‌ కోసం ప్రయత్నించాడు. కానీ, కవర్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న ఫీల్డర్‌ వెంటనే బంతిని అందుకుని బౌలర్‌కు అందించడం.. అతను వికెట్లను గిరాటేయడం చకచకా జరిగిపోయాయి.

అయితే.. బౌలర్‌ వికెట్లను బాల్‌తో కొట్టిన తర్వాత అపీల్‌ చేయకుండా వెళ్లిపోవడంతో అంపైర్‌ అలాగే చూస్తూ నిలబడిపోయాడు. వెళ్లి వికెట్లు సర్దుకున్నాడు. కానీ, ఔట్‌ ఇవ్వలేదు, రివ్యూ కోసం థర్డ్‌ అంపైర్‌ను సంప్రదించలేదు. దీంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు షాక్‌ అయ్యారు. ఫీల్డ్‌ అంపైర్‌ వద్దకు వెళ్లి ఏంటి అవుట్‌ ఇవ్వ లేదు అంటే.. మరి అపీల్‌ చేయలేదుగా అంటూ చావు కబురు చల్లాగా చెప్పాడు. అంపైర్‌ ఇచ్చిన సమాధానంతో కంగుతిన్న ఆసీస్‌ ఆటగాళ్లు.. చేసేదేం లేక ఫీల్డింగ్‌కు వెళ్లిపోయారు. అప్పటికే దాదాపు మ్యాచ్‌ గెలిచేసిన ఆసీస్‌ దాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అంపైర్‌కు ఇంత ఇగో ఏంట్రా బాబు అంటూ కామెంట్‌ చేస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.