Nidhan
MS Dhoni, Anil Choudhary, DRS: క్రికెట్లో అంపైర్ నిర్ణయాలను సవాల్ చేస్తూ డీఆర్ఎస్లు తీసుకోవడం కామనే. కానీ డీఆర్ఎస్ కాల్స్‌లో సక్సెస్ రేట్ మాత్రం చాలా తక్కువ. అయితే ఒక టీమిండియా స్టార్ మాత్రం ఇందులో ఆరితేరాడు. అందుకే అతడ్ని అంపైరింగ్‌లో బెస్ట్ అని ప్రముఖ అంపైర్ మెచ్చుకుంటున్నాడు.
MS Dhoni, Anil Choudhary, DRS: క్రికెట్లో అంపైర్ నిర్ణయాలను సవాల్ చేస్తూ డీఆర్ఎస్లు తీసుకోవడం కామనే. కానీ డీఆర్ఎస్ కాల్స్‌లో సక్సెస్ రేట్ మాత్రం చాలా తక్కువ. అయితే ఒక టీమిండియా స్టార్ మాత్రం ఇందులో ఆరితేరాడు. అందుకే అతడ్ని అంపైరింగ్‌లో బెస్ట్ అని ప్రముఖ అంపైర్ మెచ్చుకుంటున్నాడు.
Nidhan
క్రికెట్లో అంపైర్ నిర్ణయాలను సవాల్ చేస్తూ డీఆర్ఎస్లు తీసుకోవడం కామనే. ఈ టెక్నాలజీ వినియోగంతో అంపైర్ డెసిషన్స్ మరింత బెటర్ అయ్యాయి. అయితే ఇప్పటికి కూడా అంపైర్ నిర్ణయాలు సరైనవి కాదనిపిస్తే వెంటనే డీఆర్ఎస్ తీసుకుంటున్నారు. అన్ని ఫార్మాట్లలోనూ దీని వాడకం పెరిగింది. అయితే డీఆర్ఎస్లు తీసుకుంటే సరిపోదు, అందులో సక్సెస్ అవ్వాలి. ఈ విషయంలో చాలా మంది తడబడుతుంటారు. కానీ ఓ టీమిండియా స్టార్ మాత్రం ఇందులో ఆరితేరాడు. ఏ ఔట్ విషయంలో డీఆర్ఎస్ తీసుకోవాలి, ఎప్పుడు అంపైర్‌ను ఛాలెంజ్ చేయాలనేది అతడికి బాగా తెలుసు. అందుకే అతడు అంపైరింగ్‌లో బెస్ట్ అని ప్రముఖ అంపైర్ అనిల్ చౌదరి మెచ్చుకుంటున్నాడు. అతడు ప్రశంసలు కురిపించింది మరెవరి మీదో కాదు.. లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని పైనే.
డీఆర్ఎస్ కాల్స్ తీసుకోవడంలో ధోని ఎంత తోపో తెలిసిందే. వికెట్ల వెనుక కాచుకొని ఉండే మాహీ.. ప్రతి బాల్‌ను, బౌలర్ బంతిని రిలీజ్ చేయడాన్ని, బ్యాటర్ కదలికలు.. ఇలా ప్రతిదీ తన ఎక్స్‌రే కళ్లతో పట్టేస్తాడు. అందుకే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినప్పుడు.. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ ఎగ్జాక్ట్‌గా ఏ ఔట్ విషయంలో డీఆర్ఎస్ తీసుకోవాలో క్షణాల్లో అంచనా కట్టి నిర్ణయం తీసుకుంటాడు. అతడు రివ్యూకు వెళ్తే అంపైర్ నిర్ణయం మార్చుకోవాల్సిందే. ఇది పదుల సార్లు జరిగింది. అందుకే అది డీఆర్ఎస్ కాదు.. ధోని రివ్యూ సిస్టమ్ అని ఫ్యాన్స్ అంటుంటారు. అలాంటి మాహీని మెచ్చుకున్నాడు అంపైర్ అనిల్ చౌదరి. అతడు చాలా యాక్యురేట్‌గా ఉంటాడని, అతడు దేన్నయినా సులువుగా పట్టేస్తాడని అన్నాడు. వికెట్ కీపర్లకు ఒక్కోసారి బౌలరే సరిగ్గా కనిపించడని.. కానీ ధోని మాత్రం ప్రతిదీ గమనించి, డీఆర్ఎస్కు వెళ్లాలా? వద్దా? అనేది సరిగ్గా అంచనా వేస్తాడని ప్రశంసించాడు అనిల్ చౌదరి.
‘ధోని చాలా యాక్యురేట్‌గా ఉంటాడు. అతడి నిర్ణయాలు చాలా కచ్చితత్వంతో ఉంటాయి. కీపర్ వికెట్ల వెనుక ఉంటాడు. కాబట్టి అతడికి అన్నీ కనిపించే వీలు లేదు. ఒక్కోసారి బౌలర్ పొజిషన్‌ను కూడా చూడలేరు. కానీ ధోని పూర్తిగా భిన్నం. అతడు దేన్నయినా ఠక్కున పసిగడతాడు’ అని అనిల్ చౌదరి చెప్పుకొచ్చాడు. ఇక, ఇంటి వద్దే ఉంటున్న ధోని ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేస్తున్నాడు. ఐపీఎల్ టైమ్ వరకు ఫుల్ ఫిట్‌గా ఉండాలని ప్రయత్నిస్తున్నాడు. ఫామ్‌హౌజ్‌లో వ్యవసాయ పనులు చూసుకుంటూనే.. ఫిట్నెస్ మెరుగుపర్చుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అలాగే తనను కలిసేందుకు రాంచీకి వచ్చిన స్టార్ ఆల్‌రౌండర్ జడేజాతో పత్తి చేనులో ఫొటోలు దిగాడు. మరి.. ధోని ఇంతగా డీఆర్ఎస్ కాల్స్‌లో సక్సెస్ అవడం వెనుక సీక్రెట్ ఏంటని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
Anil Choudhary said “MS Dhoni is very accurate, almost close to accurate – sometimes what happens is that the keeper stays behind, even he can’t see the position of the bowler – that’s a different thing but he is very reasonable”. [Talking about DRS on 2 Sloggers Podcast] pic.twitter.com/tP2qNO51bA
— Johns. (@CricCrazyJohns) August 28, 2024