ఫొటోలో కనిపిస్తున్న ఈమె ఓ వివాదస్పద క్రికెటర్‌ భార్య అని తెలుసా?

ఫొటో చూసి సినిమా హీరోయిన్‌ అనుకున్నారా.. కాదు. ఓ స్టార్‌ క్రికెటర్‌ భార్య.. పుట్టింది బంగ్లాదేశ్‌లో పెరిగింది అమెరికాలో. ఇప్పుడు ముగ్గురు పిల్లల తల్లి. మరి ఇంత అందమైన అమ్మాయి ఏ క్రికెటర్‌ను వరించిందో తెలుసుకుందాం.. రండీ..

ఫొటో చూసి సినిమా హీరోయిన్‌ అనుకున్నారా.. కాదు. ఓ స్టార్‌ క్రికెటర్‌ భార్య.. పుట్టింది బంగ్లాదేశ్‌లో పెరిగింది అమెరికాలో. ఇప్పుడు ముగ్గురు పిల్లల తల్లి. మరి ఇంత అందమైన అమ్మాయి ఏ క్రికెటర్‌ను వరించిందో తెలుసుకుందాం.. రండీ..

పైఫొటోలో కనిపిస్తున్న అమ్మాయిని చూసి బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుకుంటున్నారా? కాదులేండి. అలా అని ఆమె ప్రొఫైల్‌ అంత సాధారణమైంది కాదు. ఆమె బంగ్లాదేశ్‌ క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ సతీమణి. అదేంటి మరీ బొట్టుపెట్టుకుని ఉందని అనుకుంటున్నారా? అయితే పూర్తి స్టోరీ చదవండి. షకీబ్‌ కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు 2010లో ఇంగ్లండ్‌ వెళ్లాడు. అక్కడే ఓ లగ్జరీ హోటల్‌లో దిగాడు. అదే హోటల్‌లో ఓ అందమైన అమ్మాయిని చూశాడు. ఇంకేముందు.. మనోడి గుండెల్లో ప్రేమ గంటలు మోగాయి. ఆమె కూడా అదే హోటల్‌లో ఉంటుంది. మరోవైపు ఆ అమ్మాయికి కూడా షకీబ్‌ నచ్చేశాడు. ఇక ఇద్దరూ డేటింగ్‌ మొదలుపెట్టేశారు.

దాదాపు మూడేళ్ల డేటింగ్‌ తర్వాత.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్‌ అయ్యారు. 2012 డిసెంబర్‌ 12న వీరిద్దరూ వివాహంతో ఒక్కటయ్యారు. ఇంతకీ షకీబ్‌ భార్య పేరు చెప్పలేదు కదూ.. ఉమ్మె అహ్మద్ శిశిర్. ఆమె అమెరికాకు చెందిన అమ్మాయి. కానీ, ఆమె తల్లిదండ్రుల మూలాలు బంగ్లాదేశ్‌లోనే ఉన్నాయి. శిశిర్‌కు 10 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లిదండ్రులు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. శిశిర అమెరికాలోనే పెరిగింది. ఇక 2012లో షకీబ్‌తో వివాహం తర్వాత.. వీరికి ముగ్గురు సంతనం కలిగారు. అయితే.. శిశిర్‌ అన్ని సంప్రదాయాలను పాటిస్తారు. అప్పుడప్పుడు బొట్టు కూడా పెట్టుకుంటారు. శిశిర్‌ అమెరికాలోని మిన్నెసోటా విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీని పొందారు.

ఒక సారి ఓ ప్రముఖ వ్యాపార వేత్త కుమారుడు షకీబ్‌ భార్య శిశిర్‌ను ఏదో అన్నాడని షకీబ్‌ ఏకంగా అతనిపై చేయి చేసుకుని కొట్టాడు. అది అప్పట్లో సంచలనంగా మారింది. నిజానికి షకీబ్‌ కోపిష్టి. మైదానంలో కూడా పలు సందర్భాల్లో తన కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేక వివాదాలకు కేంద్రంగా మారాడు. తాజాగా వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు సీనియర్‌ ఆటగాడు ఏంజిలో మ్యాథ్యూస్‌.. ఆలస్యంగా బ్యాటింగ్‌కు వచ్చాడని టైమ్‌డ్‌ అవుట్‌ కోసం అపీల్‌ చేశాడు షకీబ్‌. దీంతో అంపైర్లు అతన్ని అవుట్‌గా ప్రకటించారు. అయితే.. షకీబ్‌ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని చాలా మంది విమర్శలు చేశారు. కానీ, షకీబ్‌ మాత్రం తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments