Nidhan
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్ఫూర్తితో ఓ కుర్రాడు చెలరేగి ఆడుతున్నాడు. అండర్-19 వరల్డ్ కప్‌లో దుమ్మురేపుతున్న ఆ యంగ్‌స్టర్ పేరు అర్షిన్ కులకర్ణి.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్ఫూర్తితో ఓ కుర్రాడు చెలరేగి ఆడుతున్నాడు. అండర్-19 వరల్డ్ కప్‌లో దుమ్మురేపుతున్న ఆ యంగ్‌స్టర్ పేరు అర్షిన్ కులకర్ణి.
Nidhan
టీమిండియాలో చోటు దక్కించుకోవడం ఇప్పుడు ఎంతో కష్టంగా మారింది. ప్రస్తుతం భారత జట్టులో దాదాపుగా అన్ని స్థానాలకు బ్యాకప్‌గా చాలా మంది ఉన్నారు. ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కోసం ఆశిస్తున్న వారి సంఖ్య కూడా పెద్దగానే ఉంది. అయితే పేస్ ఆల్రౌండర్స్కు మాత్రం టీమిండియాలో భారీ డిమాండ్ ఉంది. అందుకు కారణం స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తరచూ గాయాలపాలవడమే. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ దుమ్మురేపుతూ కీలకంగా మారిన పాండ్యా ఎప్పుడూ గాయాలతో సావాసం చేస్తుండటంతో అతడికి కరెక్ట్ రీప్లేస్మెంట్ కోసం శివమ్ దూబె లాంటి వారిని టీమ్ మేనేజ్మెంట్ పరీక్షిస్తోంది. దూబె తానేంటో ఆఫ్ఘానిస్థాన్‌తో టీ20 సిరీస్‌తో ప్రూవ్ చేశాడు. అయితే పాండ్యా ప్లేస్ కోసం తాను కూడా పోటీలో ఉన్నానని అంటున్నాడు ఓ యంగ్ ఆల్‌రౌండర్. అతడే అర్షిన్ కులకర్ణి.
అండర్-19 వరల్డ్ కప్‌లో అర్షిన్ కులకర్ణి అదరగొడుతున్నాడు. బ్యాట్‌తో పాటు బాల్‌తోనూ రాణిస్తూ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నాడు. మెగాటోర్నీలో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ (118 బంతుల్లో 108 రన్స్)తో ఆకట్టుకున్నాడు అర్షిన్. ఈ ఇన్నింగ్స్‌లో అతడి బ్యాట్ నుంచి 8 బౌండరీలతో పాటు 3 భారీ సిక్సులు వచ్చాయి. అతడి శతకం కారణంగా మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 రన్స్ చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన యూఎస్ఏ అన్ని ఓవర్లు ఆడి 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసి భారీ ఓటమిని మూటగట్టుకుంది. సెంచరీతో అలరించిన అర్షిన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్ తర్వాత అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హార్దిక్ పాండ్యానే తనకు స్ఫూర్తి అని తెలిపాడు.
లెగ్ స్పిన్నర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేశాడు అర్షిన్. అయితే అవకాశాలు రాకపోవడంతో స్పిన్ బౌలింగ్‌ను వదిలేసి పేస్ బౌలింగ్ మీద ఫోకస్ చేశాడు. అలాగే బ్యాటింగ్‌ను కూడా మరింతగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. దీని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. అండర్ 19 వరల్డ్ కప్‌లో యూఎస్ఏపై సెంచరీతో మెరిశాడు. దీని గురించి అతడు రియాక్ట్ అయ్యాడు. ‘లెగ్ స్పిన్నర్‌గా కెరీర్ మొదలుపెట్టా. కానీ అవకాశాలు రాలేదు. క్రికెట్లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్స్ సంఖ్య తక్కువగా ఉందని అర్థం చేసుకున్నా. అందుకే ఆ దిశగా ప్రయత్నించా. నా ఫేవరెట్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా. అందుకే అతడు ధరించే జెర్సీ నంబర్ 33నే నేను కూడా వేసుకుంటున్నా’ అని అర్షిన్ కులకర్ణి చెప్పుకొచ్చాడు. కాగా, ఇప్పటిదాకా 6 టీ20లు ఆడిన అర్షిన్ 4 వికెట్లు పడగొట్టాడు. అతడు బ్యాటింగ్, బౌలింగ్‌లో మరింత ఇంప్రూవ్ అయి.. ఇదే పెర్ఫార్మెన్స్ను కంటిన్యూ చేస్తే చేసుకుంటే త్వరలో భారత సీనియర్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అప్పుడు పాండ్యాను స్ఫూర్తిగా తీసుకున్నోడు అతడికే పోటీ అవుతాడని చెబుతున్నారు. మరి.. జూనియర్ హార్దిక్‌గా పిలుస్తున్న అర్షిన్ కులకర్ణి ఫ్యూచర్లో టీమిండియాకు ఆడగలడని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.
Arshin Kulkarni said “I was not getting chances as a leg spinner so I decided as there was very less pace bowling all-rounders, I just tried & I used to it – my favourite player is Hardik Pandya so I am wearing Jersey number 33”. [ICC] pic.twitter.com/cNl5sne09u
— Johns. (@CricCrazyJohns) January 29, 2024