U19 World Cup 2024: చేజారిన వరల్డ్ కప్.. గెలవాల్సిన మ్యాచ్​లో మనోడి వల్లే ఓటమి!

భారత జట్టు మరో వరల్డ్ కప్​ను చేజార్చుకుంది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్​లో మనోడి వల్లే టీమిండియా ఓటమిపాలైంది.

భారత జట్టు మరో వరల్డ్ కప్​ను చేజార్చుకుంది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్​లో మనోడి వల్లే టీమిండియా ఓటమిపాలైంది.

భారత్ మరో వరల్డ్ కప్​ను చేజార్చుకుంది. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్స్​లో ఆస్ట్రేలియా చేతిలో 79 పరుగుల తేడాతో ఓడింది టీమిండియా. మెగా టోర్నీ ఫైనల్స్​ వరకు ఒక్క ఓటమి కూడా లేకుండా దూసుకొచ్చిన మన కుర్రాళ్లు.. తుదిమెట్టుపై జారిపడ్డారు. ఈ ఒక్క మ్యాచ్​లో నెగ్గితే కప్పు సొంతమయ్యేది. కానీ భీకర ఆసీస్ పేస్ యూనిట్ ముందు మనోళ్లు నిలబడలేకపోయారు. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన కంగారూ టీమ్ 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన యంగ్ ఇండియా 43.5 ఓవర్లలో 174 పరుగులకు చాప చుట్టేసింది. అయితే ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్లో టీమిండియా ఓటమికి మనోడే కారణమయ్యాడు. భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా బ్యాటర్ హర్జాస్ సింగ్ మన టీమ్​ను దారుణంగా దెబ్బతీశాడు.

వరల్డ్ కప్​ ఫైనల్లో హర్జాస్ హయ్యెస్ట్ స్కోరర్​గా నిలిచాడు. ఆసీస్ జట్టులో ఓపెనర్లు హ్యారీ డిక్సాన్ (42), హగ్ వీబెన్ (48) రాణించారు. ఆఖర్లో ఓలీ పీక్ (46 నాటౌట్) మంచి నాక్​తో జట్టుకు భారీ స్కోరు అందించాడు. అయితే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్​లో హర్జాస్ సింగ్ బ్యాటింగ్ స్పెషల్ హైలైట్​గా నిలిచింది. ఓపెనర్లు ఇద్దరూ వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన అతడు కీలక ఇన్నింగ్స్​తో అలరించాడు. 3 బౌండరీలు, 3 సిక్సులు బాదిన హర్జాస్.. 64 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఆసీస్ భారీ స్కోరు చేయడంలో మిడిల్ ఓవర్లలో అతడు ఆడిన ఇన్నింగ్స్ కారణమని చెప్పాలి. హర్జాస్ కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగి ఉంటే కంగారూ టీమ్ మరింత కష్టాల్లో పడేది. అతడు బౌండరీలతో పాటు మూడు భారీ సిక్సర్లు బాది భారత్​ను డిఫెన్స్​లో పడేశాడు.

వన్డేల్లో మధ్య ఓవర్లు చాలా కీలకం అవుతాయి. ఆ టైమ్​లో వికెట్లు తీస్తే బౌలింగ్ టీమ్ విజయం ఈజీ అవుతుంది. అదే బ్యాటింగ్ జట్టు పరుగులు చేస్తే వాళ్లకు విజయావకాశాలు పెరుగుతాయి. అలాంటి మిడిల్ ఓవర్లలో వికెట్లు పడకుండా చూసుకున్న హర్జాస్.. అటాక్ చేస్తూ రన్స్ కూడా రాబట్టాడు. కీలక ఇన్నింగ్స్​తో అతడు కొట్టిన దెబ్బ వల్ల భారత్​కు ఓటమి తప్పలేదు. ఆసీస్ భారీ స్కోరు చేయడం.. దాన్ని ఛేజ్ చేయడంలో మన టీమ్ తడబడి ఓడటం తెలిసిందే. ఇక, ఫైనల్లో అదరగొట్టిన హర్జాస్ సింగ్​కు భారత మూలాలు ఉన్నాయి. అతడి తండ్రి ఇందర్​జిత్ సింగ్ పంజాబ్ బాక్సింగ్ మాజీ ఛాంపియన్ కాగా.. తల్లి లాంగ్ జంప్ అథ్లెట్ కావడం విశేషం. వీళ్లిద్దరూ 2000లో ఆస్ట్రేలియాకు వలస వెళ్లారు. 2005లో సిడ్నీలో హర్జాస్ జన్మించాడు. ఈ వరల్డ్ కప్​లో అతడు పెద్దగా రాణించకపోయినా.. ఫైనల్​లో మాత్రం కీలక ఇన్నింగ్స్​తో మెరిశాడు. మరి.. భారత జట్టు ఓటమికి మనోడే కారణమవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Virat Kohli: కోహ్లీ ఆడకపోతే భారత్​కు పోయేదేమీ లేదు.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

Show comments