U19 World Cup 2024: ఇంకో వరల్డ్ కప్ మిస్.. యువరాజ్​ను తలచుకుంటున్న ఫ్యాన్స్!

కోట్లాది మంది భారత అభిమానుల ఆశలు మళ్లీ అడియాశలు అయ్యాయి. టీమిండియా ఇంకో వరల్డ్ కప్​ను మిస్సయింది. దీంతో ఫ్యాన్స్ అందరూ లెజెండరీ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్​ను గుర్తుచేసుకుంటున్నారు.

కోట్లాది మంది భారత అభిమానుల ఆశలు మళ్లీ అడియాశలు అయ్యాయి. టీమిండియా ఇంకో వరల్డ్ కప్​ను మిస్సయింది. దీంతో ఫ్యాన్స్ అందరూ లెజెండరీ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్​ను గుర్తుచేసుకుంటున్నారు.

టీమిండియా కల చేజారింది. మన జట్టు ఇంకో వరల్డ్ కప్​ను మిస్సయింది. దీంతో భారత ఆటగాళ్లతో పాటు కోట్లాది మంది అభిమానులు నిరాశలో కూరుకుపోయారు. గతేడాది వన్డే వరల్డ్ కప్-2023ని చేజార్చుకున్న టీమిండియా.. తాజాగా అండర్-19 ప్రపంచ కప్​నూ కోల్పోయింది. సీనియర్లు ఓడిన చోట కుర్రాళ్లు అయినా సత్తా చాటి కప్పును తీసుకొస్తారనుకుంటే వాళ్లూ సత్తా చాటడంలో ఫెయిలయ్యారు. అండర్-19 వరల్డ్ కప్​లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్​లో ఆస్ట్రేలియా చేతిలో 79 పరుగుల తేడాతో ఓటమిపాలైంది భారత్. సులువుగా నెగ్గాల్సిన మ్యాచులో బ్యాటర్ల వైఫల్యంతో ఓటమి మూటగట్టుకుంది. దీంతో అభిమానులు లెజెండరీ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్​ను తలచుకుంటున్నారు. యువీ మళ్లీ రావాలని కోరుకుంటున్నారు.

అన్ని జట్లను ఆస్ట్రేలియా భయపెడుతుంది. కానీ ఆసీస్​నే వణికించాడు యువరాజ్. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో ఆ టీమ్​ను రెండుసార్లు చావుదెబ్బ తీశాడు యువీ. తొలిసారి 2007లో స్టార్ ఆల్​రౌండర్ కంగారూలను ఒక రేంజ్​లో పోయించాడు. ఆ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్​లో సెమీస్​లో భారత్​తో ఆసీస్ తలపడింది. ఆ మ్యాచ్​లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచిన యువీ.. కంగారూల ఓటమిని శాసించాడు. 30 బంతుల్లోనే ఏకంగా 70 పరుగులు చేశాడు. దీంతో 20 ఓవర్లలో భారత్ 188 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేజింగ్​లో ఆసీస్ 173 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఆ తర్వాత 2011లో మరోమారు కంగారూలను ఆల్​రౌండ్ పెర్ఫార్మెన్స్​తో దెబ్బతీశాడు యువీ. ఆ టోర్నీ క్వార్టర్ ఫైనల్స్​లో ఆసీస్​తో మ్యాచ్​లో 2 వికెట్లు తీయడమే గాక 57 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. విన్నింగ్ షాట్​తో మ్యాచ్​ను ఫినిష్ చేశాడు.

2007, 2011 వరల్డ్ కప్స్​లో ఆస్ట్రేలియాను ఫైనల్ చేరకుండా అడ్డుకున్నాడు యువరాజ్. అప్పుడు అతడు ఉన్న ఊపులో ఒకవేళ టైటిల్ ఫైట్​ ఆసీస్​తో జరిగినా చెలరేగి ఆడేవాడు. ఆ రెండు టోర్నీలనే కాదు.. క్వాలిటీ పేస్ అటాక్ కలిగిన కంగారూ టీమ్​ ఎప్పుడు ఎదురుపడినా యువరాజ్ సూపర్బ్​గా ఆడేవాడు. అందుకే సోషల్ మీడియాలో ఫ్యాన్స్, నెటిజన్స్ అతడ్ని తలచుకుంటున్నారు. ఫైనల్ ఫోబియా, ఆసీస్ ఫోబియా పోవాలంటే యువీ మళ్లీ రావాలని అంటున్నారు. రిటైర్ అయిన యువీ మళ్లీ రావడం కుదరదు కాబట్టి అతడి స్ఫూర్తిగా టీమ్​లో ఉన్న క్రికెటర్లు ఫియర్​లెస్ అప్రోచ్​తో చెలరేగి ఆడాలని చెబుతున్నారు. యువీలా ఆడే మరో యంగ్​స్టర్ అయినా ఎంట్రీ ఇస్తే ఈ కప్పు కష్టాలు పోతాయని కామెంట్స్ చేస్తున్నారు. ఆ యంగ్​స్టర్​ను యువీనే తయారు చేయాలని.. ద్రవిడ్ తర్వాత అతడు కోచింగ్ పగ్గాలు తీసుకోవాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక, క్రికెట్​లో ప్రస్తుతం ఆస్ట్రేలియా హవా నడుస్తోంది. ఫార్మాట్​తో సంబంధం లేకుండా, సీనియర్ లేదా జూనియర్ అనే తేడా లేకుండా జెంటిల్మన్ గేమ్​పై ఆ దేశం పెత్తనం చెలాయిస్తోంది. దీనికి వరుసగా సాధిస్తున్న ఐసీసీ ట్రోఫీలు సాక్ష్యమని చెప్పొచ్చు. ఒక్క ఏడాది కాలంలో మూడు ఐసీసీ టైటిల్స్​ను కొట్టేసింది ఆసీస్. గతేడాది ఆరంభంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్, అదే సంవత్సరం వన్డే వరల్డ్ కప్, తాజాగా అండర్-19 ప్రపంచ కప్​ను దక్కించుకున్నారు కంగారూలు. అయితే ఈ మూడు సందర్భాల్లోనూ ఆ టీమ్​ ఓడించింది భారత్​నే కావడం గమనార్హం. ద్వైపాక్షిక టోర్నీల్లో దుమ్మురేపుతున్న టీమిండియా.. ఐసీసీ టోర్నీల్లోనూ ఫైనల్స్ వరకు ఈజీగా వెళ్తోంది. కానీ ఫైనల్​లో ఆసీస్​ను ఓడించలేక కప్పులు చేజార్చుకుంటోంది. దీంతో ఆ టీమ్​ను ఓ రేంజ్​లో పోయించిన యువీని ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు. అతడు తిరిగి రావాలని అంటున్నారు. మరి.. భారత్ కప్పు కల నెరవేర్చే మరో యువీ వస్తాడని మీరు అనుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: U19 World Cup 2024: చేజారిన వరల్డ్ కప్.. గెలవాల్సిన మ్యాచ్​లో మనోడి వల్లే ఓటమి!

Show comments