iDreamPost
android-app
ios-app

U19 World Cup 2024: వీడియో: ఫైనల్లో భారత ప్లేయర్ల సందడి.. గ్రౌండ్​లో తెలుగులో మాట్లాడుతూ..!

  • Published Feb 12, 2024 | 1:22 PMUpdated Feb 12, 2024 | 2:45 PM

వరల్డ్ కప్​ ఫైనల్లో భారత ప్లేయర్లు గ్రౌండ్​లో తెలుగులో మాట్లాడుతూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్​చల్​ చేస్తోంది.

వరల్డ్ కప్​ ఫైనల్లో భారత ప్లేయర్లు గ్రౌండ్​లో తెలుగులో మాట్లాడుతూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్​చల్​ చేస్తోంది.

  • Published Feb 12, 2024 | 1:22 PMUpdated Feb 12, 2024 | 2:45 PM
U19 World Cup 2024: వీడియో: ఫైనల్లో భారత ప్లేయర్ల సందడి.. గ్రౌండ్​లో తెలుగులో మాట్లాడుతూ..!

కోట్లాది మంది భారతీయుల హృదయం ముక్కలైంది. మరో వరల్డ్ కప్​ను టీమిండియా మిస్ చేసుకుంది. ఈజీగా నెగ్గాల్సిన మ్యాచ్​లో ఘోర ఓటమితో కలతో పాటు కప్పు కూడా చేజారింది. సీనియర్ టీమ్ ఎలాగూ ఓడింది.. కనీసం కుర్రాళ్లు అయినా కప్పు కల నెరవేరుస్తారనుకుంటే వాళ్లూ చేతులెత్తేశారు. అండర్-19 ప్రపంచ కప్​లో భాగంగా పటిష్ట ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్​లో భారత్ ఓడిపోయింది. 79 పరుగుల తేడాతో ఓడి కప్​ను ఆసీస్​కు సమర్పించుకుంది. ఒక దశలో భారత్ విజయం సులువని అంతా భావించారు. కానీ కీలక సమయంలో వెనుకబడిన టీమిండియా.. మ్యాచ్​తో పాటు కప్పును కూడా కోల్పోయింది. అయితే ఈ మ్యాచ్​లో ఓ విషయం హైలైట్​గా నిలిచింది. గ్రౌండ్​లో ఇద్దరు క్రికెటర్లు ఎంచక్కా తెలుగులో మాట్లాడుతూ కనిపించారు.

ప్రతిష్టాత్మక ఫైనల్​లో ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో భారత ప్లేయర్లు తెలుగులో మాట్లాడారు. ఇన్నింగ్స్ 14వ ఓవర్ బౌలింగ్ వేసేందుకు వచ్చాడు మురుగన్ అభిషేక్. దీంతో కీపర్ ఆరవెల్లి అవినాష్ రావు అతడితో తెలుగులో మాట్లాడాడు. ఇద్దరూ తెలుగువాళ్లే కావడంతో బ్యాటర్​కు ఎటు వైపు ఫీల్డింగ్ సెట్ చేయాలి? ఎక్కడ బాల్ వేయాలి? ఎలా కవ్వించాలనేది తెలుగులోనే చర్చించుకున్నారు. బౌలర్​ మురుగన్​ను తంబీ అంటూ పిలిచిన అవినాష్​.. బ్యాటర్ స్వీప్ కొట్టినా ఏం కాదంటూ ఎంకరేజ్ చేశాడు. అతడు బాల్ వేశాక చాలా బాగుంది అంటూ మరింతగా ప్రోత్సహించాడు. వాళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. తెలుగువాళ్లు ఒక చోట ఉంటే ఆ సందడే వేరు అని అంటున్నారు.

ఇక, ఫైనల్ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన కంగారూ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. భారత సంతతి బ్యాటర్ హర్జాస్ సింగ్ (55) టాప్ స్కోరర్​గా నిలిచాడు. అతడితో పాటు హ్యారీ డిక్సాన్ (42), హగ్ వీగెన్ (48), ఒలీవర్ పీక్ (46) కూడా రాణించారు. కష్టసాధ్యం కాని లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఏ దశలోనూ టార్గెట్​ను అందుకునేలా కనిపించ లేదు. 43.5 ఓవర్లు బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 174 పరుగులకు ఆలౌట్ అయింది. ఆదర్శ్ సింగ్ (47), మురుగన్ అభిషేక్ (42) మాత్రమే రాణించారు. మిగిలిన బ్యాటర్లు అందరూ మూకుమ్మడిగా విఫలమవడంతో జట్టు 79 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే తెలుగులో మాట్లాడుతూ ఆకట్టుకున్న మురుగన్ అభిషేక్ మాత్రం తనవంతు ప్రయత్నం చేశాడు. మరో తెలుగుతేజం అవినాష్ మాత్రం గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మరి.. గ్రౌండ్​లో భారత క్రికెటర్లు తెలుగులో మాట్లాడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: మీడియాపై కోపంతో ఊగిపోయిన రవీంద్ర జడేజా భార్య!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి