Nidhan
క్రికెట్లో ఎన్నో అద్భుతమైన క్యాచులు చూసుంటారు. అయితే ఇది అలాంటి ఇలాంటి క్యాచ్ కాదు.. ఒళ్లు జలదరించే క్యాచ్.
క్రికెట్లో ఎన్నో అద్భుతమైన క్యాచులు చూసుంటారు. అయితే ఇది అలాంటి ఇలాంటి క్యాచ్ కాదు.. ఒళ్లు జలదరించే క్యాచ్.
Nidhan
ఒకప్పుడు క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్‌కు ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఫీల్డింగ్‌కు ఇచ్చేవారు కాదు. క్యాచులు మిస్సయినా, రన్స్ లీకైనా పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. బౌలింగ్, బ్యాటింగ్‌కు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో ఫీల్డింగ్‌కు అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ప్రతి జట్టు ప్రత్యేకంగా ఫీల్డింగ్ కోచ్‌లను అపాయింట్ చేసుకుంటున్నాయి. టీమ్‌లో ఉన్న ప్రతి ఆటగాడు గ్రౌండ్ ఫీల్డింగ్‌తో పాటు క్యాచింగ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టేలా చేస్తున్నాయి. బాగా పెర్ఫార్మ్ చేసిన వారికి మెడల్స్ ఇవ్వడం కూడా ఇటీవల వరల్డ్ కప్ టైమ్‌లో చూశాం. భారత జట్టు మెగా టోర్నీలో బాగా ఫీల్డింగ్ చేసిన వారికి మెడల్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసింది. ఇప్పుడు ఫీల్డింగ్ ప్రమాణాలు పెరగడంతో బెస్ట్ క్యాచ్‌లు ఎక్కువయ్యాయి. అయితే ఇది మాత్రం అలాంటి ఇలాంటి క్యాచ్ కాదు.. ఒళ్లు జలదరించే క్యాచ్.
సూపర్ స్మాష్-2024 టోర్నమెంట్లో భాగంగా వెల్లింగ్టన్, సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ జట్ల మధ్య జరిగిన ఓ మ్యాచ్ జరిగింది. ఇందులో ఇద్దరు ప్లేయర్లు అద్భుతమైన క్యాచ్‌తో అలరించారు. మీరు ఇప్పటిదాకా కళ్లు చెదిరే క్యాచులను మాత్రమే చూసుంటారు.. కానీ ఇది మాత్రం ఒళ్లు జలదరించే క్యాచ్. ఈ మ్యాచ్‌లో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ బ్యాటర్ విల్ యంగ్ కొట్టిన బాల్ బాగా పైకి లేచింది. అది ఈజీగా బౌండరీకి పోతుందని అనిపించింది. కానీ ట్రాయ్ జాన్సన్ అనే ఫీల్డర్ ఆ బాల్‌ను అందుకునేందుకు పరిగెత్తాడు. వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి సరిగ్గా బౌండరీ లైన్ దగ్గర దాన్ని అందుకున్నాడు. అయితే కిందపడిన జాన్సన్ ఫోర్ లైన్ దాటే లోపు గాల్లోకి ఎగిరి ఆ బాల్‌ను వెనక్కి విసిరాడు. వెనుక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన నిక్ కెల్లీ దాన్ని అందుకున్నాడు. దీంతో షాట్ కొట్టిన విల్ యంగ్ సహా గ్రౌండ్‌లోని ఆడియెన్స్ అంతా షాకయ్యారు. వెల్లింగ్టన్ ప్లేయర్లు కూడా నమ్మశక్యం కాని క్యాచ్‌ను చూసి నోరెళ్లబెట్టారు. అసలు ఇది నిజమేనా? అంటూ ఆశ్చర్యానికి లోనయ్యారు.
ట్రాయ్ జాన్సన్-నిక్ కెల్లీ పట్టిన క్యాచ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ఇదేం క్యాచ్ రా బాబు అంటూ షాకవుతున్నారు. జెంటిల్మన్ గేమ్‌లో ఇదే బెస్ట్ క్యాచ్ అని మెచ్చుకుంటున్నారు. వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్‌ను పట్టడమే గాక, బౌండరీ లైన్ క్రాస్ అయ్యే లోపు దాన్ని లోపలకు విసిరిన తీరు అద్భుతమంటూ ట్రాయ్ జాన్సన్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇలాంటి ఫీల్డర్లు టీమ్‌లో ఉంటే బౌలర్ల కాన్ఫిడెన్స్ మరింత పెరుగుతుందని.. షాట్స్ కొట్టేందుకు ప్రత్యర్థి బ్యాటర్లు వణుకుతారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెల్లింగ్టన్ 20 ఓవర్లలో 147/8 స్కోరు చేసింది. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ ఈ టార్గెట్‌ను 16.5 ఓవర్లలోనే ఛేజ్ చేసేసింది. మరి.. ట్రాయ్ జాన్సన్-నిక్ కెల్లీ ద్వయం పట్టిన క్యాచ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న యువరాజ్! టీమిండియాకు నెక్ట్స్ కోచ్?
THAT’S AN ILLEGAL CATCH…!!! 🤯pic.twitter.com/bWNWCzrJ2s
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 13, 2024