SNP
Trent Boult, MI vs RR, IPL 2024: ఐపీఎల్ 2024లో బౌల్ట్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ.. ప్రత్యర్థి బ్యాటర్లను భయపెడుతున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన సత్తా చాటడమే కాకుండా.. ముంబైపై పగ తీర్చుకున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Trent Boult, MI vs RR, IPL 2024: ఐపీఎల్ 2024లో బౌల్ట్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ.. ప్రత్యర్థి బ్యాటర్లను భయపెడుతున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన సత్తా చాటడమే కాకుండా.. ముంబైపై పగ తీర్చుకున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం వాంఖడే క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. రోహిత్ శర్మతో పాటు ముంబై టాపార్డర్ మొత్తం విఫలం అవ్వడంతో చాలా తక్కువ స్కోర్‌కే పరిమితం అయింది. ముంబై ఇచ్చిన చిన్న టార్గెట్‌ను రాజస్థాన్ బ్యాటర్లను ఊదిపారేశారు. అయితే.. పటిష్టమైన ముంబై ఇండియన్స్ ఇంత తక్కువ స్కోర్‌కు పరిమితం కావడం, రాజస్థాన్ బ్యాటర్ల ముందు ఈజీ టార్గెట్ ఉండేలా చేసింది మాత్రం ట్రెంట్ బౌల్ట్. ఈ స్టార్ బౌలర్.. రాజస్థాన్‌ను గెలిపించడంతో పాటు తన పర్సనల్ పగను కూడా తీర్చుకున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
న్యూజిలాండ్‌కు చెందిన ట్రెంట్ బౌల్ట్ 2018లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2018, 2019 సీజన్స్‌లో బౌల్ట్ ఢిల్లీ టీమ్‌కు ఆడాడు. కేవలం రూ.2.20 కోట్లకే బౌల్ట్‌ను డీసీ కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2020లో బౌల్ట్‌ను రూ.3.20 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. 2021 సీజన్ తర్వాత.. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను తీసుకోవడానికి బౌల్ట్‌ను వదిలేసింది. కేవలం రూ.3.20 కోట్లకే దక్కిన బౌల్ట్‌ను వదిలేసి.. భారీ ధర పెట్టి జోఫ్రా ఆర్డర్‌ను కొనుగోలు చేసినా.. అతను గాయంతో దూరం అయ్యాడు. అయితే.. కరెక్ట్ టైమ్‌కి 2022లో బౌల్ట్‌ను రాజస్థాన్ రాయల్స్ ఏకంగా రూ.8 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అప్పటి నుంచి రాజస్థాన్‌కు బౌల్ట్ మెయిన్ బౌలర్‌గా మారిపోయాడు.
తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన సత్తా ఏంటో చూపించిన బౌల్ట్.. ఏకంగా ముగ్గురు బ్యాటర్లను గోల్డెన్ డక్‌లుగా అవుట్ చేసి.. అదరొట్టాడు. కీలక బ్యాటర్లు.. రోహిత్ శర్మ, నమన్ ధీర్, డెవాల్డ్ బ్రెవిస్‌లను గోల్డెన్ డక్‌లుగా అవుట్ చేసి.. ముంబై ఓటమని శాసించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే రోహిత్ శర్మ, నమన్ ధీర్‌లను పెవిలియన్‌కు పంపి.. ముంబైకి కోలుకోలేని షాకిచ్చాడు. ఇలా తనను కాదని, జోఫ్రా ఆర్చర్‌ను తీసుకున్న ముంబై ఇండియన్స్‌కు బౌల్ట్ గట్టి బుద్ధి చెప్పాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోయిందంటే.. అందుకు ప్రధాన కారణం ట్రెంట్ బౌల్ట్. మరి అలాంటి బౌలర్‌ను ముంబై మిస్ చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Trent Boult 🔥 pic.twitter.com/hdwNducsxj
— RVCJ Media (@RVCJ_FB) April 1, 2024