Travis Head: స్కాట్లాండ్​పై ట్రావిస్ హెడ్ విధ్వంసం! ఇది ఊచకోత కాదు.. అంతకుమించి!

Travis Head, AUS vs SCO: బిగ్ టీమ్స్ మీదే చిచ్చరపిడుగులా చెలరేగుతాడు ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్. ఇంక స్కాట్లాండ్ లాంటి పసికూన దొరికితే వదులుతాడా? వాయించి వదులుతాడు. అదే జరిగింది. ఆ టీమ్​ను అతడు ఊచకోత కోశాడు.

బిగ్ టీమ్స్ మీదే వార్ డిక్లేర్ చేస్తాడు ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్. ఎంత పెద్ద టీమ్ అయినా పట్టించుకోడు. చిచ్చరపిడుగులా చెలరేగి విధ్వంసం సృష్టిస్తాడు. ఒంటిచేత్తో చూస్తుండగానే మ్యాచ్​ను లాక్కొని వెళ్లిపోతాడు. అతడు క్రీజులో సెటిలైతే టాప్ బౌలర్లు కూడా చేష్టలుడిగి చూస్తూ ఉండాల్సిందే. అలాంటిది స్కాట్లాండ్ లాంటి పసికూన జట్టు దొరికితే వదులుతాడా? వాయించి వదులుతాడు. అదే జరిగింది. ఆ టీమ్​ను అతడు ఊచకోత కోశాడు. 25 బంతుల్లోనే 80 పరుగుల సంచలన ఇన్నింగ్స్​తో చెలరేగాడు. దీంతో ఆసీస్ ఛేదించాల్సిన 156 పరుగుల టార్గెట్ కూడా చిన్నబోయింది.

Show comments