iDreamPost
android-app
ios-app

Top 10 Worst Cricketers List: క్రికెట్‌లో చరిత్రలోనే టాప్‌-10 అత్యంత చెత్త క్రికెటర్లు వీరే!

  • Author Soma Sekhar Updated - 01:56 PM, Sat - 9 December 23

వరల్డ్ క్రికెట్ హిస్టరీలో అత్యంత గొప్ప ఆటగాళ్లు ఉన్నట్లుగానే, అత్యంత చెత్త ప్లేయర్లు కూడా ఉన్నారు. ఆ లిస్ట్ లో ఉన్న టాప్ 10 వరస్ట్ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

వరల్డ్ క్రికెట్ హిస్టరీలో అత్యంత గొప్ప ఆటగాళ్లు ఉన్నట్లుగానే, అత్యంత చెత్త ప్లేయర్లు కూడా ఉన్నారు. ఆ లిస్ట్ లో ఉన్న టాప్ 10 వరస్ట్ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

  • Author Soma Sekhar Updated - 01:56 PM, Sat - 9 December 23
Top 10 Worst Cricketers List: క్రికెట్‌లో చరిత్రలోనే టాప్‌-10 అత్యంత చెత్త క్రికెటర్లు వీరే!

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎంతో మంది గొప్ప గొప్ప క్రికెటర్లు ఉన్నారు. తమ అద్భుత బ్యాటింగ్, బౌలింగ్ తో కొందరు ఆటగాళ్లు వరల్డ్ క్రికెట్ లో తమ పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. అయితే మంచి ఉన్న చోటే చెడు కూడా ఉన్నట్లు.. గొప్ప క్రికెటర్లు ఉన్న ఈ రంగంలో అత్యంత చెత్త క్రికెటర్లు కూడా ఉన్నారు. ఎన్నో అవకాశాలు వారిని వరించినప్పటికీ.. వాటిని సద్వినియోగం చేసుకోలేక చెత్త క్రికెటర్లుగా అపకీర్తిని మూటగట్టుకున్నారు. ఈ లిస్ట్ లో ఇద్దరు టీమిండియా మాజీ ఆటగాళ్లు ఉండటం గమనార్హం. వారు ఆడిన మ్యాచ్ లను బట్టి చేసిన పరుగులను బట్టి ఈ లిస్ట్ ను తయ్యారు చేసినట్లు తెలుస్తోంది. మరి క్రికెట్ చరిత్రలోనే టాప్-10లో నిలిచిన అత్యంత చెత్త క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

1. చాము చిబాబా

ప్రపంచంలోనే అత్యంత చెత్త క్రికెటర్ల లిస్ట్ లో జింబాబ్వే ఆల్ రౌండర్ చాము చిబాబా అగ్రస్థానంలో నిలిచాడు. 2005లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన ఈ బ్యాటర్ మెుత్తం 150 ఇంటర్నేషనల్ మ్యాచ్ ల్లో కేవలం 3,209 పరుగులు మాత్రమే చేశాడు.

2. నసీర్ జంషద్

పాకిస్థాన్ ఓపెనర్ నసీర్ జంషద్ ఈ లిస్ట్ లో రెండవ ప్లేస్ లో నిలిచాడు. తన స్వల్పకాలిక క్రికెట్ కెరీర్ లో అత్యంత చెత్త గణాంకాలను నమోదు చేసి.. చెత్త క్రికెటర్ల జాబితాలో నిలిచాడు. అతడు రెండు టెస్టుల్లో 51, 48 వన్డేల్లో 1418, 18 టీ20ల్లో 363 పరుగులు చేశాడు.

3. జేమ్స్ ఫ్రాంక్లిన్

న్యూజిలాండ్ బౌలింగ్ ఆల్ రౌండర్ అయిన జేమ్స్ ఫ్రాంక్లిన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అదరగొట్టాడు. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ కు వచ్చే సరికి 20 సగటుతో పరుగులు చేసి.. చెత్త క్రికెటర్ల లిస్ట్ లోకి చేరాడు. 150కి పైగా మ్యాచ్ లు ఆడిన ఈ కివీస్ ప్లేయర్ టెస్టుల్లో 808, వన్డేల్లో 1270, టీ20ల్లో 463 పరుగులు మాత్రమే చేశాడు.

4. ఆకాశ్ చోప్రా

ప్రస్తుతం కామెంటేటర్ గా అదరగొడుతున్న టీమిండియా మాజీ ప్లేయర్ క్రికెట్ లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో దుమ్మురేపాడని జాతీయ జట్టులోకి తీసుకుంటే.. పట్టుపని 10 టెస్టులు మాత్రమే ఆడి 437 రన్స్ చేసి చెత్త రికార్డులను మూటగట్టుకున్నాడు. 2003లో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ తో అరంగేట్రం ఇచ్చిన ఆకాశ్ చోప్రా.. సెలెక్టర్లు అతడి వైపు చూడకపోవడంతో తన కెరీర్ ను ముగించాడు. దీంతో చెత్త క్రికెటర్ల లిస్ట్ లో 4వ ప్లేస్ లో నిలిచాడు.

5. హమిష్ రూథర్ ఫోర్డ్

ఈ న్యూజిలాండ్ ఓపెనర్ దేశవాళీ క్రికెట్ లో దుమ్మురేపాడు. దాంతో జాతీయ జట్టులోకి రెడ్ కార్పెట్ వేసి పిలిచారు. అయితే ఇక్కడ మాత్రం రాణించలేక బొక్కబోర్లా పడ్డాడు. తన కెరీర్ లో 16 టెస్టుల్లో 755 రన్స్, 4 వన్డేల్లో 15, 8 టీ20ల్లో 151 పరుగులు మాత్రమే చేసి.. చెత్త క్రికెటర్ల లిస్ట్ లో చేరాడు.

6. చమర కపుగెదెర

శ్రీలంకకు చెందిన ఈ ఆటగాడిపై అందరికి మంచి అంచనాలు ఉండేవి. కానీ అనూహ్యంగా ఈ లిస్ట్ లోకి చేరాడు. లంక తరఫున 8 టెస్టులు, 102 వన్డేలు, 43 టీ20లు ఆడి వరుసగా 418, 1624, 703 పరుగులు సాధించాడు. అదృష్టం లేకపోవడంతో అతడు ఈ లిస్ట్ లో చేరాడు.

7. కీరన్ పావెల్

విధ్వంసకర ఆటకు పెట్టింది పేరు వెస్టిండీస్ ఆటగాళ్లు. అందులో ఒకడు కీరన్ పావెల్. దూకుడుగా ఆడటంలో పావెల్ సిద్దహస్తుడు. కానీ అదే ఆటను కొనసాగించలేకపోయి.. వరస్ట్ క్రికెటర్ల జాబితాలో చేరాడు. తన కెరీర్ లో 44 టెస్టులు, 46 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. వరుసగా 25.8, 22.8, 12.0 సగటుతో ఈ జాబితాలో ఏడవ స్థానంలో నిలిచి అపకీర్తి మూటగట్టుకున్నాడు.

8. మైక్ లెవిస్

ఇప్పటి వరకు పైన చెప్పుకున్న వారందరు బ్యాటర్లు కాగా.. మైక్ లెవిస్ బౌలర్. ఆస్ట్రేలియా తరఫున 2005లో జట్టులోకి వచ్చిన ఈ బౌలర్ కేవలం 9 మ్యాచ్ లకు మాత్రమే కంగారూ టీమ్ కు ప్రాతినిథ్యం వహించి తన కెరీర్ ముగించాడు. ఈ తొమ్మిది మ్యాచ్ ల్లో 11 వికెట్లు పడగొట్టాడు.

9. సూరజ్ రఘునాథ్

వెస్టిండీస్ కు చెందిన ఈ బ్యాటర్ ఈ లిస్ట్ లో చివరి నుంచి రెండో స్థానం దక్కించుకున్నాడు. కేవలం 2 టెస్టులు మాత్రమే ఆడి 13 రన్స్ చేశాడు. అయితే దేశవాళీ క్రికెట్ లో మాత్రం బాగానే రాణించాడు.

10. రోహన్ గవాస్కర్

ఆకాశ్ చోప్రా తర్వాత ఈ వరస్ట్ క్రికెటర్ల లిస్ట్ లో చివరి స్థానంలో నిలిచాడు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కొడుకు రోహన్ గవాస్కర్. డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుతంగా రాణించడం, పైగా సునీల్ గవాస్కర్ కొడుకు కావడంతో జాతీయ జట్టులోకి అరంగేట్రం చేశాడు. కానీ కేవలం 11 వన్డేలు మాత్రమే ఆడి 151 పరుగులు చేసి తన కెరీర్ ను ముగించాల్సి వచ్చింది. వరుసగా విఫలం అవుతుండటంతో.. సెలెక్టర్లు అతడివైపు చూడ్డం మానేశారు. మరి ఈ లిస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.