లంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ను టైమ్డ్ ఔట్‌గా ఇవ్వడంపై కాంట్రవర్సీ నడుస్తోంది. అయితే ఈ వివాదం నేపథ్యంలో భారత లెజెండ్ ఎంఎస్ ధోని చేసిన ఒక పనిని అందరూ గుర్తుచేసుకుంటున్నారు.
లంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ను టైమ్డ్ ఔట్‌గా ఇవ్వడంపై కాంట్రవర్సీ నడుస్తోంది. అయితే ఈ వివాదం నేపథ్యంలో భారత లెజెండ్ ఎంఎస్ ధోని చేసిన ఒక పనిని అందరూ గుర్తుచేసుకుంటున్నారు.
అన్ని గేమ్స్లోలాగే క్రికెట్లోనూ కాంట్రవర్సీలు కామనే. అయితే కొన్ని వివాదాలు గ్రౌండ్ లోపలే ముగిసిపోతాయి. కానీ మరికొన్ని మాత్రం స్టేడియం దాటినా కంటిన్యూ అవుతాయి. సోషల్ మీడియాలోనూ కాంట్రవర్సీలపై నెటిజన్స్ చర్చకు తెరలేపడం చూస్తూనే ఉన్నాం. వరల్డ్ కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో శ్రీలంక సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌ను ‘టైమ్డ్ ఔట్’గా ప్రకటించడం పెద్ద వివాదానికి దారితీసింది. బ్యాటింగ్‌కు రావాల్సిన మాథ్యూస్ నిర్ణీత గడువైన రెండు నిమిషాల్లోపు క్రీజులోకి చేరుకోలేదు. అతడ్ని ఔట్‌గా ఇవ్వాలంటూ బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ అప్పీల్ చేశాడు. దీంతో అంపైర్‌కు ఔట్‌గా ప్రకటించక తప్పలేదు.
టైమ్డ్ ఔట్‌గా ప్రకటించడంతో షకీబ్ దగ్గరకు వచ్చి అప్పీల్ వెనక్కి తీసుకోవాల్సిందిగా మాథ్యూస్ కోరాడు. కానీ అతడు వినకపోవడంతో నిరాశగా వెనుదిరిగాడు లంక సీనియర్ క్రికెటర్. ఆ తర్వాత బంగ్లా ఇన్నింగ్స్ టైమ్‌లో షకీబ్‌ను ఔట్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు మాథ్యూస్. ఈ కాంట్రవర్సీ కారణంగా మ్యాచ్ తర్వాత ఇరు టీమ్స్ ప్లేయర్లు ఒకరికొకరు హ్యాండ్ షేక్స్ ఇచ్చుకోలేదు. 15 ఏళ్ల కెరీర్లో ఇలాంటి టీమ్‌ను చూడలేదంటూ బంగ్లాపై విమర్శలకు దిగాడు మాథ్యూస్. అయితే బ్యాట్స్‌మన్ టైమ్‌కు రాకపోతే ఔట్ ఇవ్వొచ్చని రూల్స్‌లో ఉందంటూ షకీబ్ తన అప్పీల్‌ను సమర్థించుకున్నాడు.
ఈ వివాదంలో కొందరు మాథ్యూస్‌ను సమర్థిస్తుంటే.. మరికొందరు షకీబ్ చేసిన దాంట్లో తప్పు లేదని అంటున్నారు. మాథ్యూస్ కావాలని హెల్మెట్ స్ట్రిప్ లాగేయలేదని, అతడు రిక్వెస్ట్ చేశాకైనా షకీబ్ వెనక్కి తగ్గాల్సిందని అంటున్నారు. అయితే ఈ వివాదంలో మాథ్యూస్, షకీబ్‌లు ఇద్దరూ దోషులని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ అంటున్నారు. నిజానికి క్రికెట్ స్పిరిట్‌కు విరుద్ధంగా మాథ్యూస్ గతంలో ప్రవర్తించాడు. అదే ఇప్పుడు కర్మ రూపంలో రిటర్న్ అయిందని నెటిజన్స్ చెబుతున్నారు. షకీబ్ కూడా అంపైర్లతో గొడవ పడుతూ వికెట్లు విరగ్గొట్టడం లాంటివి చేసిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు కూడా క్రీడా స్ఫూర్తి గురించి పట్టించుకోకుండా కేవలం తన టీమ్ గెలవాలనే స్వార్థంతో కావాలనే అప్పీల్ చేశాడని అంటున్నారు.
మాథ్యూస్ రిటర్న్ తీసుకోమని చెప్పినా షకీబ్ అస్సలు వినలేదు. గెలుపు కోసం ఇంత స్వార్థంగా ఆలోచించడం, స్పోర్ట్స్ స్పిరిట్‌ను తుంగలో తొక్కడం, క్రికెట్ గౌరవానికి భంగం కలిగేలా బిహేవ్ చేయడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అదే టైమ్‌లో భారత లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీని చూసి నేర్చుకోవాలంటూ షకీబ్, మాథ్యూస్‌కు క్రికెట్ అనలిస్టులు సూచిస్తున్నారు. అందుకు ఓ ఘటనను ఎగ్జాంపుల్‌గా చెబుతున్నారు. 2011లో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య నాటింగ్‌హామ్‌లో టెస్ట్ జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ టీమ్ 3 వికెట్లకు 254 రన్స్‌తో ఉంది. లంచ్‌కు ముందు ఆఖరి బాల్‌ను ఎదుర్కొన్న ఇయాన్ బెల్ (137) మంచి షాట్ కొట్టాడు. అయితే ఆ బంతి బౌండరీకి వెళ్లిందనుకొని క్రీజు మధ్యలోకి వచ్చి ఆగిపోయాడు.
బెల్ కొట్టిన బాల్‌ను బౌండరీ వద్ద ప్రవీణ్ కుమార్ అద్భుతమైన డైవ్‌తో ఆపాడు. అయితే అతడు కూడా అది ఫోర్ అనుకొని బాల్‌ను మెళ్లిగా కీపర్ వైపు వేశాడు. ఇది గమనించని బెల్ బౌలింగ్ ఎండ్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు. కానీ నాన్‌స్ట్రయికర్ కూడా అక్కడే ఉన్నాడు. బాల్‌ను పట్టుకున్న ఫీల్డర్ వికెట్లను గిరాటేశాడు. భారత టీమ్ రనౌట్‌కు అప్పీల్ చేసింది. రివ్యూలో థర్డ్ అంపైర్ ఔట్‌గా ఇచ్చాడు. దీంతో బెల్ పెవిలియన్‌కు చేరుకున్నాడు. అయితే లంచ్ తర్వాత అనూహ్యంగా బెల్ మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. అతడు ఔట్ అయినప్పటికీ క్రీడా స్ఫూర్తితో తిరిగి బ్యాటింగ్‌కు రావాలని అప్పటి టీమిండియా కెప్టెన్ ధోని ఆహ్వానించాడు. తన అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు. ఈ ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. ధోనీని చూసి షకీబ్, మాథ్యూస్ నేర్చుకోవాలని ఇండియన్ ఫ్యాన్స్ సూచిస్తున్నారు. మరి.. మాథ్యూస్-షకీబ్ కాంట్రవర్సీ గురించి మీరేం అనుకుంటున్నారు? ధోని నుంచి వీళ్లు నేర్చుకోవాలా అనే దాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: శుబ్‌మన్ గిల్‌పై సారా అలీ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అది తాను కాదంటూ..!
🏆MS Dhoni won the spirit of cricket moment of the decade for once calling Ian Bell back after a bizarre run-out.pic.twitter.com/hB7eTP1MU4
— CricTracker (@Cricketracker) November 6, 2023
👉 India were 1-0 down in the series
👉 England were 254/3
👉 Ian Bell was run out bizarrely on 137In an incredible gesture, MS Dhoni withdrew his appeal and let Bell continue 🙌
🇮🇳 were applauded by Strauss and his side as they walked out after tea 👏#SpiritOfCricket pic.twitter.com/R8u6iNKhb5
— ICC (@ICC) December 29, 2020