చాన్నాళ్ల తర్వాత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (83) కీలక ఇన్నింగ్స్‌తో పాటు తిలక్ వర్మ (49 నాటౌట్), హార్దిక్ పాండ్యా (20 నాటౌట్) రాణించారు. దీంతో వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. గత కొన్ని నెలలుగా వరుసగా ఫెయిల్ అవుతూ వస్తున్న సూర్యకుమార్ తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. జట్టులో అతడు అవసరమా? సూర్య ప్లేసులో మరో యంగ్‌స్టర్‌కు ఛాన్స్ ఇవ్వొచ్చు కదా? అనే కామెంట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో వాటన్నింటికీ ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో సమాధానం ఇచ్చాడు మిస్టర్ 360.
యశస్వి జైస్వాల్ (1)తో పాటు మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (6) తక్కువ స్కోర్లకే వెనుదిరిగిన వేళ క్రీజులోకి వచ్చాడు సూర్యకుమార్. యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ అండగా ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. విండీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఫోర్లు, సిక్సులతో విజృంభించాడు. అతడి ధాటికి ప్రత్యర్థి బౌలర్లకు ఎలా బౌలింగ్ చేయాలో తోచలేదు. మరోవైపు తిలక్ వర్మ కూడా వచ్చీ రాగానే ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఆఖర్లో హార్దిక్ కూడా బ్యాట్ ఝళిపించడంతో భారత్ అలవోకగా విజయతీరాలకు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్, తిలక్‌లు పలు అరుదైన మైలురాళ్లను అందుకున్నారు.
టీ20 క్రికెట్లో ఎక్కువ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాలు అందుకున్న భారత ప్లేయర్ల లిస్టులో రోహిత్ శర్మ (11)ను సూర్య (12) అధిగమించాడు. అలాగే టీ20ల్లో 100 సిక్సుల మైలురాయిని తక్కువ మ్యాచ్‌ల్లో అందుకున్న ప్లేయర్‌గా రెండో ప్లేసులో సూర్యకుమార్ (49) నిలిచాడు. తిలక్ వర్మ కూడా టీమిండియా తరఫున టీ20ల్లో తొలి మూడు ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక రన్స్ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో గౌతం గంభీర్‌ను అధిగమించి.. సూర్యకుమార్‌తో కలసి సంయుక్తంగా రెండో ప్లేసులో నిలిచాడు.
మూడో టీ20 ముగిసిన తర్వాత సూర్య-తిలక్ జోడీ కలసి కెమెరా ముందుకు వచ్చారు. సరదా సంభాషణలో భాగంగా సూర్య చేతికి వేసుకున్న రిస్ట్ బ్యాండ్ సీక్రెట్ గురించి అడిగాడు తిలక్. ఆ రిస్ట్ బ్యాండ్ వేసుకుంటే.. మొదట్లో నెమ్మదిగా ఆడి ఆ తర్వాత హిట్టింగ్ చేస్తాడట సూర్య. కానీ ఈ మ్యాచ్‌లో మొదటి బాల్ నుంచే సూర్య షాట్స్ ఆడటం మొదలుపెట్టాడు. దీని గురించి మిస్టర్ 360 మాట్లాడుతూ.. ఒక్కోసారి మనకు మనం అబద్ధాలు చెప్పుకున్నా తప్పులేదని.. తనను తాను వెధవను చేసుకుంటూ ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ స్టార్ట్ చేశానన్నాడు సూర్య. మొత్తానికి రిస్ట్ బ్యాండ్ వెనుక ఇంత కథ ఉందన్నమాట.
Maturity with the bat ✨
Breathtaking shots 🔥
What’s the wrist band story 🤔Get to know it all in this special and hilarious chat from Guyana ft. @surya_14kumar & @TilakV9 😃👌 – By @ameyatilak
Full Interview 🎥🔽 #TeamIndia | #WIvIND https://t.co/7eeiwO8Qbf pic.twitter.com/TVVUvV3p7g
— BCCI (@BCCI) August 9, 2023