iDreamPost
android-app
ios-app

వీడియో: సూర్య వరల్డ్‌ కప్‌ క్యాచ్‌ తర్వాత.. స్టన్నింగ్‌ క్యాచ్‌ అంటే ఇదే!

  • Published Jul 21, 2024 | 1:39 PMUpdated Jul 21, 2024 | 1:39 PM

Thomas Bevan, Vitality Blast, Glamorgan, Somerset: టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో సూర్య పట్టిక క్యాచ్‌ ఎంత వైరల్‌ అయిందో చూశాం.. ఇప్పుడు ఆ సూపర్‌ క్యాచ్‌ తర్వాత క్రికెట్‌ ప్రపంచ మాట్లాడుకునేలా మరో క్యాచ్‌ నమోదు అయింది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Thomas Bevan, Vitality Blast, Glamorgan, Somerset: టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో సూర్య పట్టిక క్యాచ్‌ ఎంత వైరల్‌ అయిందో చూశాం.. ఇప్పుడు ఆ సూపర్‌ క్యాచ్‌ తర్వాత క్రికెట్‌ ప్రపంచ మాట్లాడుకునేలా మరో క్యాచ్‌ నమోదు అయింది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Jul 21, 2024 | 1:39 PMUpdated Jul 21, 2024 | 1:39 PM
వీడియో: సూర్య వరల్డ్‌ కప్‌ క్యాచ్‌ తర్వాత.. స్టన్నింగ్‌ క్యాచ్‌ అంటే ఇదే!

క్రికెట్‌లో కొన్ని సార్లు అద్భుతమైన క్యాచ్‌లు పడుతుంటారు ఆటగాళ్లు. కొన్ని క్యాచ్‌లు అయితే నమ్మశక్యంగా ఉండవు. మరికొన్ని ఏకంగా మ్యాచ్‌లనే మలుపుతిప్పేస్తాయి. అంతెందుకు ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ లాంగ్‌ ఆన్‌లో పట్టిన డేవిడ్‌ మిల్లర్‌ క్యాచ్‌ టీమిండియాకు ఏకంగా టీ20 వరల్డ్‌ కప్‌ను అందించింది. అందుకే క్యాచ్‌ల మ్యాచ్‌లు గెలిపిస్తాయని క్రికెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ అంటూ ఉంటారు. అయితే.. తాజాగా ఓ అద్భుతమైన క్యాచ్‌ చోటు చేసుకుంది. ఆ క్యాచ్‌ చూస్తూ.. సూపర్‌ డూపర్‌ క్యాచ్‌ అంటే ఇది కదా, ఏం పట్టాడు రా బాబు క్యాచ్‌ అనిపించకమానదు. ఆ క్యాచ్‌ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

శుక్రవారం కార్డిఫ్‌ వేదికగా గ్లామోర్గాన్ వర్సెస్‌ సోమర్‌సెట్ మ్యాచ్‌లో ఈ అద్భుతమైన క్యాచ్‌ నమోదు అయింది. ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ మార్నస్‌ లబుషేన్‌ బౌలింగ్‌లో ఇంగ్లండ్‌కు చెందిన థామస్ బెవన్ ఈ సూపర్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. గ్లామోర్గాన్‌ తరఫున ఆడుతున్న థామస్‌ బెవన్‌ పట్టిన ఈ అద్భుతమైన క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లబుషేన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌ చివరి బంతికి సోమర్‌సెట్‌ జట్టు కెప్టెన్‌ లూయిస్ గ్రెగొరీ మిడ్‌ వికెట్‌ దిశగా షాట్‌ ఆడాడు. ఆ షాట్‌ను బెవన్‌ పరిగెత్తుకుంటూ వచ్చి.. బాల్‌కు చేరడంతో కాస్త దూరం నుంచి గాల్లోకి పక్షిలా దూకుతూ.. బాల్‌ను అద్భుతంగా అందుకున్నాడు. కళ్లు చెదిరే ఈ క్యాచ్‌తో సోమర్‌సెట్‌ 6వ వికెట్‌ కోల్పోయింది.

థామస్‌ బెవన్‌ పట్టిన సూపర్‌ క్యాచ్‌తో గ్లామోర్గాన్‌ జట్టుతో పాటు మార్నస్‌ లబుషేన్‌లోనూ జోష్‌ కట్టులుతెంచుకుంది. ఎంతలా అంటే.. తర్వాత 4 వికెట్లను లబుషేన్‌ కేవలం 9 బంతుల వ్యవధిలోనే కుప్పకూల్చాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన గ్లామోర్గాన్‌ నిర్ణీత 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 243 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆ జట్టు కెప్టెన్‌ కమ్‌ ఓపెనర్‌ కిరన్‌ కార్ల్‌సన్‌ కేవలం 64 బంతుల్లోనే 14 ఫోర్లు, 8 సిక్సులతో విరుచుకుపడి 135 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. మరో ఓపెనర్‌ విలియమ్‌ స్మేల్‌ 34 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 59 పరుగులు చేసి రాణించాడు. సోమర్‌సెట్‌ బౌలర్లలో బెన్‌ గ్రీన్‌ 2 వికెట్లతో రాణించాడు. ఇక 244 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సోమర్‌సెట్‌ 13.3 ఓవర్లలో కేవలం 123 పరుగులకే కుప్పకూలింది. సోమర్‌సెట్‌ను మార్నస్‌ లబుషేన్‌ దారుణంగా దెబ్బతీశాడు. 2.3 ఓవర్లలో కేవలం 11 రన్స్‌ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. మరి ఈ మ్యాచ్‌లో థామస్‌ బెవన్‌ పట్టిన సూపర్‌ క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి