iDreamPost

IND vs AFG: టీమిండియాపై తొలి టీ20 తోనే చరిత్ర సృష్టించిన ఆఫ్గానిస్తాన్!

తొలి టీ20తోనే చరిత్ర సృష్టించింది ఆఫ్గాన్ టీమ్. మెుహాలి వేదికగా జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్ లోనే సరికొత్త రికార్డును నమోదు చేసింది. మరి ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?

తొలి టీ20తోనే చరిత్ర సృష్టించింది ఆఫ్గాన్ టీమ్. మెుహాలి వేదికగా జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్ లోనే సరికొత్త రికార్డును నమోదు చేసింది. మరి ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?

IND vs AFG: టీమిండియాపై తొలి టీ20 తోనే చరిత్ర సృష్టించిన ఆఫ్గానిస్తాన్!

తాము పసికూనలం కాదని వరల్డ్ కప్ 2023లోనే నిరూపించుకుంది ఆఫ్గానిస్తాన్. తమ కంటే పెద్ద పెద్ద జట్లను మట్టికరిపించి.. మెగాటోర్నీలో సంచలన ప్రదర్శన కనబర్చింది. ఇక వరల్డ్ కప్ తర్వాత టీమిండియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో సైతం అదే ప్రదర్శనను కొనసాగించాలని భావించింది. ఈ క్రమంలోనే తొలి టీ20తోనే చరిత్ర సృష్టించింది ఆఫ్గాన్ టీమ్. మెుహాలి వేదికగా జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్ లోనే సరికొత్త రికార్డును నమోదు చేసింది. మరి ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?

మెుహాలి వేదికగా ఇండియా-ఆఫ్గానిస్తాన్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ను ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ కు దిగిన ఆఫ్గాన్ జట్టు మంచి శుభారంభాన్నే అందుకుంది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్భాజ్(23), కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్(25) తొలి వికెట్ కు 50 పరుగులు జోడించారు. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ కు గట్టిపునాది వేశారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడగొట్టాడు స్టార్ స్పిన్నర్ అక్షర్ పటేల్. ఇన్నింగ్స్ 8వ ఓవర్ లో చివరి బంతికి గుర్బాజ్ స్టంపౌట్ గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియాకు ఆలస్యంగా బ్రేక్ త్రూ లభించింది.

ఇక ఈ మ్యాచ్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది ఆఫ్గాన్ జట్టు. భారత జట్టుపై ఆఫ్గానిస్తాన్ టీ20ల్లో తొలి వికెట్ కు 50 పరుగులు జోడించడం ఇదే మెుదటిసారి. ఇంతకు ముందెన్నడూ ఈ ఘనత సాధించలేదు. ఇది భారత బౌలింగ్ బలహీనతకు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 15 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది పర్యటక టీమ్. మరి టీమిండియాపై ఆఫ్గాన్ ఈ రికార్డు సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి