క్రికెట్ ప్లేయర్లకు తానేం తక్కువ కాదంటూ.. బ్యాట్ పట్టుకున్నాడు WWE సూపర్ స్టార్ ది గ్రేట్ ఖలీ. అతడు క్రికెట్ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి మీరూ ఓ లుక్కేయండి.
క్రికెట్ ప్లేయర్లకు తానేం తక్కువ కాదంటూ.. బ్యాట్ పట్టుకున్నాడు WWE సూపర్ స్టార్ ది గ్రేట్ ఖలీ. అతడు క్రికెట్ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి మీరూ ఓ లుక్కేయండి.
ప్రస్తుతం వరల్డ్ కప్ ఫీవర్ తో ఉర్రూతలూగిపోతోంది ప్రపంచం. ఇక అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని పంచుతూ.. ఈ మెగాటోర్నీ ముందుకు సాగుతోంది. అయితే క్రికెట్ ప్లేయర్లందరూ బ్యాట్ పడుతున్నారు నేనెందుకు పట్టకూడదు అని అనుకున్నాడేమో ఈ దిగ్గజ రెజ్లర్.. తానేం తక్కువ కాదంటూ బ్యాట్ పట్టుకుని రంగంలోకి దిగాడు WWE సూపర్ స్టార్ ది గ్రేట్ ఖలీ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే? అతడికి తగ్గ బాల్ తోనే క్రికెట్ ఆడి అందరిని ఆశ్చర్యపరిచాడు.
ది గ్రేట్ ఖలీ.. ఈ పేరు వినగానే ఓ భారీ కాయం అందరి మదిలో మెదులుతుంది. WWEలో సూపర్ స్టార్ గా జాన్ సీనా, కేన్ లాంటి ఎందరో హేమాహేమీలను ఓడించి.. రెజ్లింగ్ లో సంచలనం సృష్టించాడు ఖలీ. అయితే గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. తనకు సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకుంటూ వస్తున్నాడు. ఇటీవలే ఇటుకలతో స్టంట్ చేయడానికి రెడీ అయిన ఖలీ.. ఈ తర్వాత చేసింది చూసి అందరు కడుపుబ్బా నవ్వుకున్నారు. తాజాగా బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడి.. అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
తన భారీ కాయంతో.. క్రికెట్ బాల్ తో కాకుండా వాలీ బాల్ రేంజ్ లో ఉన్న పెద్ద బాల్ తో క్రికెట్ ఆడాడు ది గ్రేట్ ఖలీ. బాల్ ను ఎడాపెడా కొడుతూ.. గోడ అవతలకి పంపించడం ఈ వీడియోలో చూడొచ్చు. భారీ కాయంతో తెల్ల లుంగీపై ఖలీ క్రికెట్ ఆడతాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. క్రికెట్ ఆడిన తర్వాత మాట్లాడాడు ఖలీ. తనకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని, ఇలా ఆడటం తనకు సంతోషాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. ఖలీ 2000 సంవత్సరలో తన రెజ్లింగ్ కెరీర్ ను ప్రారంభించాడు. పలు కంపెనీల్లో రెజ్లర్ గా పనిచేసి ఎన్నో ఘనతలు సాధించాడు. 2007-08 మధ్య కాలంలో WWE వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ గా నిలిచాడు. డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్‌గా క్లాస్ ఆఫ్ 2021లో ఎంపికయ్యాడు. 2018లో తన రెజ్లింగ్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు ఈ భారీ కాయుడు.