Krishna Kowshik
భారత దిగ్గజ రెజ్లర్, డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటర్ గ్రేట్ ఖలీ.. ఇప్పుడు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఆయన క్రీడా జీవితం గురించి తెలుసు కానీ, ఖలీ పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. ప్రస్తుతం ఫైట్లకు దూరంగా ఉంటున్న ఆయన..
భారత దిగ్గజ రెజ్లర్, డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటర్ గ్రేట్ ఖలీ.. ఇప్పుడు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఆయన క్రీడా జీవితం గురించి తెలుసు కానీ, ఖలీ పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. ప్రస్తుతం ఫైట్లకు దూరంగా ఉంటున్న ఆయన..
Krishna Kowshik
ప్రపంచ ప్రఖ్యాత మల్ల యోధుడు, భారత దేశ దిగ్గజ రెజర్ల్ ది గ్రేట్ ఖలీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డబ్ల్యూడబ్ల్యూఈలో వరల్డ్ హెవీ వెయిట్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సభ్యుడైన ఖలీని నేషనల్ హీరోగా భావిస్తుంటారు. అతడి అసలు పేరు దలీప్ సింగ్ రాణా అని చాలా మందికి తెలియదు. ఏడు అడుగులు ఉంటూ అందరూ తలెత్తుకుని చూసేలా ఉంటే గ్రేట్ ఖలీ.. దేశం గర్వపడే రెజ్లర్. 2000వ ఏడాదిలో రెస్టింగ్ కెరీర్ మొదలు పెట్టిన ఆయన.. దాదాపు 20 ఏళ్ల పాటు డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లింగ్ రింగ్‌లో ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. 2015లో పంజాబ్ సొంత రెస్లింగ్ స్కూల్ ఏర్పాటు చేశారు.
అప్పటి నుండి ఆటకు దూరంగా ఉంటున్న.. ఈ రెజర్ల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఇప్పుడు ఆయన ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఎందుకంటే.. ? గ్రేట్ ఖలీ మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య హర్మీందర్ కౌర్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఖలీ క్రీడా జీవితం గురించి తెలుసుకుని కానీ వ్యక్తిగత లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. ఖలీది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. అయితే ఖలీ ఆశయాలు గురించి తెలిసి అతడితో కనెక్ట్ అయిన హర్మీందర్.. పలుమార్లు కలుసుకుని అభిప్రాయాలు పంచుకున్న తర్వాత వీరి మధ్య మరింత ప్రేమ ఏర్పడింది. ఫిబ్రవరి 27, 2002న వీరి వివాహం జరిగింది.
2014లో వీరికి ఓ పాప జన్మించింది. ఆ పాప పేరు అవ్లీన్. మళ్లీ తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈ దంపతులు.. మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. తాజాగా గ్రేట్ ఖలీ భార్య హర్మీందర్ ఇటీవల బేబీ బాయ్ ను ప్రసవించింది.ఈ విషయం తెలిసి సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి కంగ్రాట్స్ తెలుపుతున్నారు నెటిజన్లు. కాగా, గ్రేట్ ఖలీ.. హిందీ బిగ్ బాస్ షోలో కూడా సందడి చేశారు. బిగ్ బాస్ సీజన్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చిన ఆయన.. తన ఆటతో అలరించారు. చివరకి రన్నరప్ గా గెలుపొందారు. శ్వేతా తివారీ బిగ్ బాస్ 4 విన్నర్ గా నిలిచింది.