SNP
MS Dhoni, T20 World Cup 2024, Final, IND vs SA: టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ విజయాన్ని కూడా కొంతమంది ధోని ఖాతాలో వేసేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
MS Dhoni, T20 World Cup 2024, Final, IND vs SA: టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ విజయాన్ని కూడా కొంతమంది ధోని ఖాతాలో వేసేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
మాటల్లేవ్.. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్‌లో టీమిండియా సాధించిన విజయాన్ని వర్ణించడానికి మాటల్లేవ్. ఆల్‌మోస్ట్ ఓడిపోయిన మ్యాచ్.. ఇక ఓటమి ఖాయం అనుకుని భారత క్రికెట్ అభిమానులు బాధతో టీవీలు కట్టేస్తూ.. వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ సీన్ మళ్లీ రిపీట్ అవుతుంటే.. కళ్లలో నీళ్లు తిప్పుకుంటూ.. ఓటమిని ఒప్పుకుంటున్న తరుణంలో.. జస్ప్రీత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్.. భారత క్రికెట్ అభిమానుల కన్నీళ్లను ఆనందభాష్పాలుగా మార్చారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు ముగిసిన తర్వాత.. మ్యాచ్ వాళ్ల చేతుల్లోనే ఉంది. 30 బంతుల్లో 30 పరుగులు చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. క్రీజ్‌లో క్లాసెన్, మిల్లర్ లాంటి డేజంరస్ ప్లేయర్లు ఉన్నారు.. ఇలాంటి టైమ్‌లో టీమిండియా గెలుస్తుందని బహుషా ఎవరూ అనుకోని ఉండరు.
కానీ, టీమిండియా బౌలర్లు బుమ్రా, అర్షదీప్, పాండ్యా అద్భుతం చేశారు. 16వ ఓవర్‌లో బుమ్రా 4 పరుగులు, 17వ ఓవర్‌లో హార్ధిక్ పాండ్యా ఒక వికెట్‌తో పాటు 4 పరుగులు, 18వ ఓవర్‌లో బుమ్రా కేవలం 2 పరుగులు ఒక వికెట్, 19వ ఓవర్‌లో అర్షదీప్ సింగ్ కేవలం 4 రన్స్‌తో మ్యాచ్‌ను టీమిండియా వైపు తప్పేశారు. ఇక చివరి ఓవర్‌లో సౌతాఫ్రికాకు 16 పరుగులు అవసరమైన సమయంలో బంతి అందుకున్న హార్ధిక్ పాండ్యా.. తొలి బంతికే డేంజరస్ మిల్లర్‌ను అవుట్ చేశాడు. ఈ వికెట్‌లో పాండ్యా కంటే అద్భుతమైన క్యాచ్ అందుకున్న సూర్యకుమార్‌కు ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. లాంగ్ ఆఫ్‌లో సూపర్ క్యాచ్‌తో టీమిండియాను గెలిపించాడు సూర్య. అయితే.. టీమిండియా సాధించిన ఈ విజయంలో కూడా భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌కి కొంతమంది క్రెడిట్ ఇస్తున్నారు.
చాలా కాలంగా ‘తలా ఫర్ ఏ రీజన్’ అనే మాట చాలా పాపులర్ అయింది. ఏ విషయంలో అయినా ధోనికి క్రెడిట్ ఇస్తున్నారంటూ కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో చివరి బాల్‌కు సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించడంతో కప్పు ఒక్కడే గెలిపించాడని చాలా మంది అనుకుంటూ ఉంటారంటూ కొంతకొంది విమర్శిస్తారు. ఇప్పుడు కూడా టీ20 వరల్డ్ కప్ 2024ను గెలవడానికి ధోనినే కారణం అంటూ కొంత మంది సోషల్ మీడియాలో సరదాగా పోస్టు పెడుతున్నారు. ‘తలా ఫర్ ఏ రీజన్’ అంటూ పేర్కొంటున్నారు. అందుకు కారణం ఏంటంటే.. ఈ సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా సరిగ్గా 7 పరుగుల తేడాతో నెగ్గింది. 7 ధోని జెర్సీ నంబర్ కాబట్టి.. తలా ఫర్ ఏ రీజన్ అంటూ సరదాగా పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
thala for a reason #MSDhoni𓃵 #T20WorldCupFinal #T20WorldCup2024 #RohitSharma #viratkholi #INDvsSA2024 pic.twitter.com/n089L6AlNh
— Sayyad Nag Pasha (@nag_pasha) June 30, 2024