iDreamPost
android-app
ios-app

Temba Bavuma: కోహ్లీ కొట్టిన షాట్‌ ఆపే ప్రయత్నం! మ్యాచ్‌ నుంచి బయటికి..!

  • Published Dec 26, 2023 | 4:06 PM Updated Updated Dec 26, 2023 | 4:06 PM

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలే తగిలినా.. కోహ్లీ, అయ్యర్‌ జట్టును ఆదుకున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌లో ఆసక్తి కర సంఘటన చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలే తగిలినా.. కోహ్లీ, అయ్యర్‌ జట్టును ఆదుకున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌లో ఆసక్తి కర సంఘటన చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 26, 2023 | 4:06 PMUpdated Dec 26, 2023 | 4:06 PM
Temba Bavuma: కోహ్లీ కొట్టిన షాట్‌ ఆపే ప్రయత్నం! మ్యాచ్‌ నుంచి బయటికి..!

సెంచూరియన్‌ వేదికగా సౌతాఫ్రికాతో ప్రారంభమైన తొలి టెస్ట్‌లో టీమిండియా తడబడుతోంది. భారీ అంచనాల మధ్య మొదలైన ఈ టెస్ట్‌ సిరీస్‌లో ఇండియాకు మంచి స్టార్ట్‌ దక్కలేదనే చెప్పాలి. రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌ తక్కువ స్కోర్‌కే అవుట్‌ కావడం, కేవలం 24 పరుగులకే టీమిండియా మూడు వికెట్లు కోల్పోవడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక్కడి నుంచి టీమిండియాను విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌ ఓటమి తర్వాత తొలిసారి రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. దీంతో.. అందరి కళ్లు వీళ్లిద్దరిపైనే ఉన్నాయి.

అయితే.. రోహిత్‌ శర్మ కేవలం 5 పరుగులే చేసి నిరాశపర్చినా.. కష్టాల్లో టీమిండియాను ఆదుకుంటూ విరాట్‌ కోహ్లీ మంచి ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లీ కొట్టిన ఓ షాట్‌ను ఆపే ప్రయత్నం చేసి.. సౌతాఫ్రికా కెప్టెన్‌ టెంబ బవుమా ఏకంగా గ్రౌండ్‌ వీడి బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఇన్నింగ్స్‌ 20వ ఓవర్‌ నాలుగో బంతిని విరాట్‌ కోహ్లీ.. కవర్స్‌లోకి అద్భుతమైన షాట్‌ ఆడాడు. అది బౌండరీ లైన్‌ వైపు దూసుకెళ్తోంది. కానీ, అది ఫోర్‌ పోకుండా ఆపాలని గట్టిగా ఫిక్స్‌ అయిన బవుమా.. చిరుతపులి వేగంతో బాల్‌ వెనుక పరుగు తీశాడు. బవుమా ఉరుకుతుంటే.. వామ్మో ఇతనేంటి ఇంత పాస్ట్‌గా పరిగెడుతున్నాడని అంతా అనుకున్నారు. పాపం అదే అతనికి దిష్టి పెట్టినట్లు ఉంది. బాల్‌కు చేరువవుతున్న క్రమంలో బవుమా కాలు పట్టేసినట్లు ఉంది. పరుగు తీసేందుకు ఇబ్బంది పడ్డాడు.

మొత్తానికి బాల్‌ను బౌండరీకి వెళ్లకుండా ఆపిన బవుమా.. ఆ రేస్‌లో గెలిచినా.. గాయంతో గ్రౌండ్‌ వీడాల్సి వచ్చింది. కాలు పట్టేసి బవుమా బాధపడుతుంటే.. వెంటనే సౌతాఫ్రికా ఫిజియో గ్రౌండ్‌లోకి పరిగెత్తుకుంటూ వచ్చి.. బవుమాను బయటికి తీసుకెళ్లాడు. కోహ్లీ కొట్టిన సూపర్‌ షాట్‌ను బౌండరీకి వెళ్లకుండా శక్తికి మించి ప్రయత్నిస్తే.. ఇలాగే అవుతుందంటూ భారత క్రికెట్‌ అభిమానులు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఒక ఫీల్డర్‌గా బవుమా పెట్టిన ఎఫర్ట్‌ను కచ్చితంగా మెచ్చుకుని తీరాల్సిందే. ఎంతో అద్భుతంగా పరుగు తీసి.. రెండు పరుగులను సేవ్‌ చేశాడు. కానీ, గాయంతో బయటికి వెళ్లాడు. బవుమా తిరిగి గ్రౌండ్‌లోకి రాకుంటే సౌతాఫ్రికాకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. మరి బవుమా తిరిగి బరిలోకి దిగుతాడా? లేదా అనేది చూడాలి. మరి బవుమా ఫీల్డింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.