iDreamPost
android-app
ios-app

ఈ ఏడాది బాబర్‌ను తొక్కేసిన బవుమా! ఈ లెక్కలు చూడండి

  • Published Sep 08, 2023 | 9:44 AM Updated Updated Dec 09, 2023 | 12:28 PM

కొన్ని సార్లయితే ఏకంగా టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీతో బాబర్‌ను పంప్యార్‌ చేస్తూ అతి చేస్తున్నారు. కోహ్లీ రేంజ్‌కు చేరుకోవాలంటే బాబర్‌ ఇంకా చాలా సాధించాల్సింది ఉన్నా కూడా మాట మాట్లాడితే బాబర్‌ వర్సెస్‌ కోహ్లీ అంటూ రచ్చ రచ్చ చేస్తుంటారు.

కొన్ని సార్లయితే ఏకంగా టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీతో బాబర్‌ను పంప్యార్‌ చేస్తూ అతి చేస్తున్నారు. కోహ్లీ రేంజ్‌కు చేరుకోవాలంటే బాబర్‌ ఇంకా చాలా సాధించాల్సింది ఉన్నా కూడా మాట మాట్లాడితే బాబర్‌ వర్సెస్‌ కోహ్లీ అంటూ రచ్చ రచ్చ చేస్తుంటారు.

  • Published Sep 08, 2023 | 9:44 AMUpdated Dec 09, 2023 | 12:28 PM
ఈ ఏడాది బాబర్‌ను తొక్కేసిన బవుమా! ఈ లెక్కలు చూడండి

కొన్నేళ్లుగా పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ను కొంతమంది మోడ్రన్‌ గ్రేటెస్ట్‌గా ఆకాశానికి ఎత్తేస్తూ లేని కిరీటాన్ని తెచ్చిపెడుతున్నారు. కొన్ని సార్లయితే ఏకంగా టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీతో బాబర్‌ను పంప్యార్‌ చేస్తూ అతి చేస్తున్నారు. కోహ్లీ రేంజ్‌కు చేరుకోవాలంటే బాబర్‌ ఇంకా చాలా సాధించాల్సింది ఉన్నా కూడా మాట మాట్లాడితే బాబర్‌ వర్సెస్‌ కోహ్లీ అంటూ రచ్చ రచ్చ చేస్తుంటారు. అలాంటి వారి కోసమే అన్నట్లుగా సౌతాఫ్రికా కెప్టెన్‌ టెంబ బవుమా.. బాబర్‌ ఫ్యాన్స్‌ గుబగుయ్‌ మనేలా అదిరిపోయే లెక్కలతో ముందుకొచ్చాడు. కోహ్లీతో తర్వాత ముందు నాతో పోటీ పడమను అన్నట్లు.. ఈ ఏడాది బెస్ట్‌ కెప్టెన్‌ కమ్‌ బ్యాటర్‌గా దుమ్మురేపుతున్నాడు.

గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 114 పరుగులు నాటౌట్‌గా నిలిచిన బవుమా ఆస్ట్రేలియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఈ సెంచరీతో 2023లో బవుమా కెప్టెన్‌గా 3 వన్డే సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు కెప్టెన్‌గా అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ప్లేయర్‌గా బవుమానే టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. జింబాబర్‌గా పేరుతెచ్చుకున్న పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ రెండు సెంచరీలతో, విండీస్‌ కెప్టెన్‌ షై హోప్‌ రెండు సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. ఇలా లేని హైప్‌తో గొప్ప బ్యాటర్‌గా చెలామణి అవుతున్న బాబర్‌ అజమ్‌ను.. బవుమా ఈ లెక్కలతో చిత్తు చేశాడు.

పైగా బాబర్‌ అజమ్‌.. నేపాల్‌ లాంటి పసికూన జట్టుపై సెంచరీ చేసి, శ్రీలంక లాంటి జట్టుపై విఫలం అయితే.. బవుమా మాత్రం ఏకంగా ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా లాంటి భీకరమైన బౌలింగ్‌ ఎటాక్‌ ఉన్న దేశాలపై బాదాడు. బవుమా తన వన్డే కెరీర్‌లో చేసిన ఐదు సెంచరీల్లో ఒక్కటి మాత్రమే ఐర్లాండ్‌ లాంటి చిన్న దేశంపై చేశాడు. మిగతా నాలుగు ఇండియా, ఇంగ్లండ్‌, విండీస్‌, ఆసీస్‌లపై చేశాడు. పైగా ఈ ఏడాది 7 వన్డేలు ఆడి 105 స్ట్రైక్ రేట్‌తో 106 సగటుతో 534 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. అయినా కూడా అతన్ని వన్డే వరల్డ్‌ కప్‌ కోసం ఎంపిక చేయడంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. మరి బవుమా సెంచరీలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సౌతాఫ్రికా కొంపముంచిన లబుషేన్‌! కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ అంటే ఏంటి?