వీడియో: ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా.. తెలుగు కామెంటేటర్ల చేసిన రచ్చ చూశారా?

Telugu Commentators, IND vs SA, T20 World Cup 2024: సౌతాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో టీమిండియా విజయానికి చేరువ అవుతుంటే.. కామెంట్రీ చేస్తున్న తెలుగు కామెంటేటర్స్‌ ఎలా ఎంజాయ్‌ చేశారో ఇప్పుడు చూద్దాం..

Telugu Commentators, IND vs SA, T20 World Cup 2024: సౌతాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో టీమిండియా విజయానికి చేరువ అవుతుంటే.. కామెంట్రీ చేస్తున్న తెలుగు కామెంటేటర్స్‌ ఎలా ఎంజాయ్‌ చేశారో ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌ మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. దాదాపు సౌతాఫ్రికాదే విజయం అనుకుని.. భారత క్రికెట్‌ అభిమానులు కప్పుపై ఆశలు వదులుకున్నారు. చాలా మంది వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌లో ఎదురైన ఓటమి ఒక్కసారిగా కళ్ల ముందు తిరిగింది. దాంతో.. అందరి కళ్లు చెమ్మగిల్లాయి. కొంతమంది అయితే.. ఓటమిని ఒప్పులేమని.. టీవీలు కట్టేసి పడుకున్నారు కూడా.. కానీ, బుమ్రా అక్కడి నుంచి అద్భుతం చేశాడు. 30 బంతుల్లో 30 పరుగులు కావాలి.. క్రీజ్‌లో అరివీర భయంకరంగా ఆడుతున్న క్లాసెన్‌, బెస్ట్‌ ఫినిషన్‌ మిల్లర్‌ ఉన్నారు.. ఇక్కడి నుంచి టీమిండియా గెలవడం అంటే అదో అద్భుతమే. ఆ అద్భుతాన్నే చేసి చూపించారు టీమిండియా బౌలర్లు.. బుమ్రా, హర్ధిక్‌ పాండ్యా, అర్షదీప్‌ సింగ్‌.

క్రికెట్‌ అభిమానులు ఎలాగైతే నరాలు బిగబట్టి మ్యాచ్‌ చూశారో.. ఓటమి ఖాయం అనుకున్న మ్యాచ్‌లో విజయం చేరువ అవుతుంటే ఎలాగైతే గంతులేస్తూ ఎంజాయ్‌ చేశారో.. కామెంట్రీ బాక్స్‌లో మ్యాచ్‌కు కామెంట్రీ చెబుతున్న తెలుగు కామెంటేటర్లు.. కళ్యాణ్‌ కృష్ణ, వేణుగోపాల్‌ రావ్‌, సుమన్‌ కూడా కామెంట్రీ బాక్స్‌లో రచ్చ రచ్చ చేశారు. ఒక వైపు కామెంట్రీ చేస్తూనే తమ అభిమానాన్ని ప్రదర్శించారు. కామెంట్రీ బాక్స్‌లో వాళ్లు చేసిన రచ్చకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

చివరి 5 ఓవర్లలో సమయంలో అందరిలానే వాళ్లు కూడా మ్యాచ్‌ను ఫుల్‌గా ఎంజాయ్‌ చేశారు. సాధారణ ప్రేక్షకులు ఎలాగైతే వికెట్‌ పడాలి దేవుడా అంటూ ప్రార్థనలు చేశారో.. కామెంట్రీ చేస్తూనే మ్యాచ్‌లో టీమిండియా గెలవాలని, బుమ్రా వికెట్‌ తీయాలని కోరుకున్నారు. వాళ్లు కొరుకున్నట్లు వికెట్‌ పడిన సయమంలో సీట్ల నుంచి లేచి గంతులేస్తూ.. తమ సంతోషాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. అలాగే చివరి ఓవర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ లాంగ్‌ ఆఫ్‌లో క్యాచ్‌ అందుకున్న సమయంలో అయితే.. టీమిండియా మాజీ క్రికెటర్‌ వేణుగోపాల్‌ రావ్‌ అయితే.. సంతోషం పట్టలేక గోల చేశారు. వీరి సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో స్టార్‌ స్పోర్ట్స్‌ షేర్‌ చేసింది. మరి మన తెలుగు కామెంటేటర్లు కామెంట్రీ బాక్స్‌లో చేసిన రచ్చపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments