Somesekhar
రెండో టెస్ట్ కు ముందు టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్ ఇంగ్లాండ్ కు మాస్ వార్నింగ్ ఇచ్చాడు. తమకు భయమంటే ఏంటో కూడా తెలీదని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
రెండో టెస్ట్ కు ముందు టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్ ఇంగ్లాండ్ కు మాస్ వార్నింగ్ ఇచ్చాడు. తమకు భయమంటే ఏంటో కూడా తెలీదని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
Somesekhar
ఇండియా-ఇంగ్లాండ్ మధ్య విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2(శుక్రవారం) నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ తమ ప్రణాళికలతో బరిలోకి దిగబోతున్నాయి. తొలి మ్యాచ్ లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది టీమిండియా. అయితే తొలి ఇన్నింగ్స్ లో 190 పరుగుల ఆధిక్యం లభించినప్పటికీ.. భారత జట్టు ఓడిపోవడంతో.. అభిమానులతో పాటుగా మాజీ క్రికెటర్లు కూడా ఆశ్చర్యపోయారు. కాగా.. ఫస్ట్ మ్యాచ్ లో ఓటమి అనంతరం డ్రస్సింగ్ రూమ్ లో ఏ జరిగిందో చెప్పుకొచ్చాడు టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ కు మాస్ వార్నింగ్ సైతం ఇచ్చాడు.
ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ లో ఓటమి తర్వాత డ్రస్సింగ్ రూమ్ లో ఏర్పడిన పరిస్థితుల గురించి తాజాగా చెప్పుకొచ్చాడు టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్. “మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా డ్రస్సింగ్ రూమ్ చాలా ప్రశాంతంగా ఉంది. మేం ఎలాంటి ఆందోళనా చెందలేదు. ఎందుకంటే ఇది ఐదు టెస్ట్ ల సిరీస్.. ఇలాంటి ఎన్నో సిరీస్ ల్లో భారత్ సత్తాచాటింది. ఇక ఈ ఓటమిని చూసి భయపడొద్దని కోచ్ ద్రవిడ్ తో పాటుగా కెప్టెన్ రోహిత్ భాయ్ కూడా చెప్పాడు. స్వేఛ్చగా బ్యాటింగ్ చేయాలని సూచించారు వారు. తొలి టెస్ట్ లో చేసిన తప్పులను సరిదిద్దుకుని రెండో మ్యాచ్ లో పుంజుకుంటాం” అని తెలిపాడు ఈ తెలుగు క్రికెటర్.
ఇదిలా ఉండగా.. తొలి మ్యాచ్ లో ఓడిపోయిన మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారని, తాము భయపడుతున్నట్లుగా కొందరు పేర్కొంటున్నారని.. మాకు భయమన్నదే లేదని చెప్పుకొచ్చాడు భరత్. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కు భయమంటే ఏంటో చూపిస్తామని ఈ సందర్భంగా మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక క్రికెట్ లో అనుభవం ఉన్న క్రికెటర్, లేని క్రికెటర్ అంటూ ఉండరని, బాగా ఆడినప్పుడు మెచ్చుకోవాని అన్నాడు. 30 ఏళ్ల కేఎస్ భరత్ వైజాగ్ కు చెందిన వాడే కావడం విశేషం. హోం గ్రౌండ్ లో భరత్ రెచ్చిపోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.