iDreamPost
android-app
ios-app

కోహ్లీ బాధ్యతల్ని వాళ్లకు ఇచ్చేయండి.. మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!

  • Published Mar 11, 2024 | 6:22 PM Updated Updated Mar 12, 2024 | 5:41 PM

టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఓ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. విరాట్ బాధ్యతల్ని వాళ్లకు ఇచ్చేయాలని అన్నాడు.

టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఓ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. విరాట్ బాధ్యతల్ని వాళ్లకు ఇచ్చేయాలని అన్నాడు.

  • Published Mar 11, 2024 | 6:22 PMUpdated Mar 12, 2024 | 5:41 PM
కోహ్లీ బాధ్యతల్ని వాళ్లకు ఇచ్చేయండి.. మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!

ఒకే ఒక్క సిరీస్.. సమాధానాలు దొరకని ఎన్నో చిక్కు ప్రశ్నల లెక్క తేల్చింది. భవిష్యత్తు గురించి ఆందోళన వద్దంటూ భరోసాను ఇచ్చింది. అన్ని క్వశ్చన్స్​కు ఆన్సర్స్ ఉన్నాయని.. ఇక టీమ్​కు ఢోకా లేదనే నమ్మకాన్ని పెంచింది. అదే ఇంగ్లండ్ సిరీస్. ఆ జట్టుతో జరిగిన 5 టెస్టుల సిరీస్​ను 4-1తో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమి లేకపోయినా టీమ్ సిరీస్​ను ఆల్​మోస్ట్ క్లీన్ స్వీప్ చేసింది. అజింక్యా రహానె, ఛటేశ్వర్ పుజారా దూరంగా ఉన్నా యంగ్​స్టర్స్ అదరగొట్టడంతో బజ్​బాల్ బెండు తీసింది. యశస్వి జైస్వాల్, శుబ్​మన్ గిల్​ లాంటి టీమ్​లో సెటిలైన యువకులతో పాటు సర్ఫరాజ్ ఖాన్, ఆకాశ్​దీప్, ధృవ్ జురెల్, దేవ్​దత్ పడిక్కల్ లాంటి అరంగేట్ర కుర్రాళ్లు అద్భుతంగా ఆడుతూ ఫ్యూచర్​ సేఫ్ అనే భరోసాను ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నుంచి బాధ్యతలను యంగ్ బ్యాటర్స్​కు అప్పజెప్పాలని సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. కోహ్లీ నుంచి బ్యాటన్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపాడు. ‘ఇంగ్లండ్​తో సిరీస్​లో బౌలింగ్​తో పాటు బ్యాటింగ్​ విషయంలోనూ చాలా సానుకూల అంశాలు భారత్​కు ఉన్నాయి. బౌలింగ్​లో కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కుల్దీప్ సిరీస్ ఆసాంతం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చూస్తే కుల్దీప్, ఆకాశ్ లాంటి వాళ్లు రాణించడం టీమ్​కు ఎంతో ముఖ్యం. బుమ్రా, అశ్విన్, జడేజా, సిరాజ్​లు మంచి ఫామ్​లో ఉన్నారు. బ్యాటింగ్​లో సర్ఫరాజ్, జురెల్ లాంటి కుర్రాళ్లకు మంచి పునాది లభించింది. వీళ్లను ఆస్ట్రేలియా, ఇంగ్లండ్​తో పాటు ఇతర విదేశీ సిరీస్​ల్లోనూ ఆడించాలి. కోహ్లీ, రోహిత్, పుజారా, రహానె నుంచి భారత జట్టు బ్యాటింగ్​ను నడిపించే బాధ్యతలను కుర్రాళ్లకు అప్పగించాలి’ అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

Kohli work take to youngsters

ఇంగ్లండ్​​ సిరీస్​లో సర్ఫరాజ్, జురెల్, పడిక్కల్ బ్యాటింగ్​లో చూపించిన ఇంటెంట్ తనకు నచ్చిందన్నాడు మంజ్రేకర్. పరుగులు చేయాలి, రాణించాలనే కసి, తపన వారిలో క్లియర్​గా కనిపించిందన్నాడు. ఇదే ఇంటెంట్​తో ఫ్యూచర్ సిరీస్​ల్లోనూ వాళ్లు బ్యాటింగ్ చేయాలని సూచించాడు. బౌలింగ్​లో కుల్దీప్, ఆకాశ్​దీప్ కూడా ఇదే తరహాలో ఆడారని ప్రశంసించాడు. ఈ యువకులే భారత జట్టు భవిష్యత్తు అని చెప్పుకొచ్చాడు మంజ్రేకర్. ఇక, ఇంగ్లండ్ సిరీస్ ముగియడంతో దొరికిన కాస్త రెస్ట్​ను భారత క్రికెటర్లు ఎంజాయ్ చేస్తున్నారు. ట్రిప్స్​కు వెళ్తూ సేదతీరుతున్నారు. మరో 10 రోజుల్లో ఐపీఎల్-2024 ఉండటంతో రీఫ్రెష్ అవుతున్నారు. తిరిగొచ్చి తమ ఫ్రాంచైజీలతో కలసి ప్రాక్టీస్​లో మునిగిపోతారు. మరి.. కోహ్లీ నుంచి బాధ్యతల్ని యంగ్​స్టర్స్​కు ఇచ్చేయాలంటూ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: వీడియో: ఇది క్రికెట్​ కాదు.. అంతకుమించి! ఈ బుడ్డోళ్ల ఆటకు ఫిదా అవ్వాల్సిందే!