టీ20 వరల్డ్ కప్ లో రింకూ సింగ్! ఎవరి స్థానంలో అంటే?

  • Author Soma Sekhar Published - 06:41 PM, Mon - 27 November 23

రింకూ సింగ్ సంచలన ఆటతో చెలరేగిపోతున్నాడు. బెస్ట్ ఫినిషర్ గా కితాబందుకుంటున్న రింకూ రాబోయే పొట్టి వరల్డ్ కప్ జట్టులోకి వస్తాడన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఎవరి ప్లేస్ లో అతడు ఆడతాడా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

రింకూ సింగ్ సంచలన ఆటతో చెలరేగిపోతున్నాడు. బెస్ట్ ఫినిషర్ గా కితాబందుకుంటున్న రింకూ రాబోయే పొట్టి వరల్డ్ కప్ జట్టులోకి వస్తాడన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఎవరి ప్లేస్ లో అతడు ఆడతాడా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

  • Author Soma Sekhar Published - 06:41 PM, Mon - 27 November 23

టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీమిండియా ఇప్పటి నుంచే తన వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగానే తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం టోటల్ గా యంగ్ ప్లేయర్లనే బరిలోకి దింపింది. వారి సత్తాను పరీక్షిస్తూ.. పొట్టి ఫార్మాట్ కు రెడీ చేస్తోంది. ఇక తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అద్భుతంగా రాణిస్తున్నారు ఈ యువ ఆటగాళ్లు. జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ లతో పాటుగా ఫినిషర్ గా పేరు తెచ్చుకుంటున్న రింకూ సింగ్ సంచలన ఆటతో చెలరేగిపోతున్నారు. వీరికి తోడు సీనియర్ ప్లేయర్ సూర్యకుమార్ సైతం తనదైన రీతిలో దంచికొడుతున్నాడు. ఇదిలా ఉండగా.. బెస్ట్ ఫినిషర్ గా కితాబందుకుంటున్న రింకూ సింగ్ రాబోయే పొట్టి వరల్డ్ కప్ జట్టులోకి వస్తాడన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

రింకూ సింగ్.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో మారుమ్రోగుతున్న పేరు. ఐపీఎల్ ద్వారా బెస్ట్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న ఈ చిచ్చర పిడుగు అదే జోరును ఆసీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో కూడా కొనసాగిస్తున్నాడు. తొలి మ్యాచ్ లో 14 బంతుల్లో 22 రన్స్, రెండో మ్యాచ్ లో కేవలం 9 బంతుల్లోనే 2 సిక్స్ లు, 4 ఫోర్లతో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రింకూ ఫామ్ చూస్తే.. వచ్చే ఏడాది జూన్ లో జరిగే టీ20 ప్రపంచ కప్ జట్టులోకి రావడం పెద్ద కష్టమైన విషయం కాదు.

ఈ నేపథ్యంలో టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో బ్యాటింగ్ కు దిగితే.. ఫినిషర్ రోల్ లో రింకూ సింగ్ ను పొట్టి వరల్డ్ కప్ లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఫినిషర్ గా రింకూ అద్బుతమైన ఆటతీరుతో రెచ్చిపోతున్నాడు. చివర్లో తక్కువ బంతుల్లో ఎక్కువ రన్స్ చేస్తూ.. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ప్రస్తుతం మిడిలార్డర్ లో సూర్య 4వ ప్లేస్ లో ఆడుతున్నాడు. దీంతో సూర్య తర్వాత ఫినిషర్ గా రింకూ సింగ్ ను జట్టులోకి తీసుకోవడం పక్కా అని క్రీడా పండితులు చెప్పుకొస్తున్నారు. మరి టీ20 వరల్డ్ కప్ లోకి రింకూ సింగ్ వస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments