SNP
IND vs USA, T20 World Cup 2024, Shivam Dube: యూఎస్‌ఏతో కీలక మ్యాచ్‌లో టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆ మార్పుతో ఓ స్టార్ ప్లేయర్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అతనెవరో ఇప్పుడు తెలుసుకుందాం..
IND vs USA, T20 World Cup 2024, Shivam Dube: యూఎస్‌ఏతో కీలక మ్యాచ్‌లో టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆ మార్పుతో ఓ స్టార్ ప్లేయర్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అతనెవరో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా టీమిండియా నేడు(బుధవారం) యూఎస్‌ఏతో మ్యాచ్ ఆడనుంది. న్యూయార్క్‌లోని నసావు స్టేడియంలో భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి చాలా ఉత్సాహంగా భారత్ మూడో మ్యాచ్ కోసం బరిలోకి దిగుతుంది. యూఎస్‌ఏపై గెలిస్తే.. రోహిత్ సేన సూపర్ 8కు క్వాలిఫై అయిపోతుంది. 15న కెనడాతో నామమాత్రపు గ్రూప్ మ్యాచ్ ఉంటుంది. ఒక వేళ ఓడితే మాత్రం కెనడాపై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంత దుస్థితి రాకపోవచ్చు. అయితే.. అమెరికాపై టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఐర్లాండ్, పాకిస్థాన్‌పై టీమిండియా ఒకే విధమైన ప్లేయింగ్ ఎలెవన్‌తో ఆడింది. ఆ రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా.. జట్టులో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. సూపర్ 8కి ముందు వాటిని షాట్ అవుట్ చేసుకోవాలని రోహిత్ శర్మ భావిస్తున్నాడు. అందుకోసం జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఓపెనింగ్ సమస్య టీమిండియాను బాగా ఇబ్బంది పెడుతుంది. రోహిత్ శర్మతో రెగ్యులర్ ఓపెనర్‌గా ఉన్న యశస్వి జైస్వాల్ ఫామ్‌లో లేకపోవడం టీమిండియాను చాలా ఇబ్బంది పెడుతుంది. జైస్వాల్ స్థానంలో ఓపెనర్‌గా సంజు శాంసన్‌ను ఆడిద్దాం అనుకుని వరల్డ్ కప్ టోర్నీకి ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో అతన్ని ఓపెనర్‌గా ఆడిస్తే.. విఫలం అయ్యాడు.
వేరే దారిలేక వన్‌డౌన్‌లో పాతుకుపోయిన విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా దింపారు. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా అదరగొడుతున్న కోహ్లీ.. రోహిత్‌తో కలిసి ఓపెనర్‌గా రెండు మ్యాచ్‌ల్లో ఆడినా ఫెయిల్ అయ్యాడు. దీంతో కోహ్లీని వన్‌డౌన్‌కే పరిమితం చేసి.. జైస్వాల్‌ను ఆడించాలని రోహిత్ భావిస్తున్నట్లు సమాచారం. జైస్వాల్‌ను టీమ్‌లోకి తీసుకోవడానికి ఆల్‌రౌండర్ శివమ్ దూబేను పక్కనపెట్టే ఛాన్స్ ఉంది. దూబేతో పాటు జట్టులో మరో ముగ్గురు ఆల్‌రౌండర్లు ఉన్నారు. హార్ధిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్ బాగా రాణిస్తున్నారు. వీరితో పాటు ముగ్గురు పేసర్లతో టీమిండియా ఆడుతుండటంతో దూబేకు బౌలింగ్ రావడం లేదు. బ్యాటింగ్‌లో కూడా దూబే రాణించడం లేదు. దీంతో అతన్ని పక్కనపెట్టి జైస్వాల్‌ను టీమ్‌లోకి తీసుకుంటే బాగుంటుందని టీమ్ మేనేజ్‌మెంట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీంతో.. యూఎస్‌ఏతో మ్యాచ్‌లో భారత్ దూబేను పక్కనపెట్టి, జైస్వాల్ లేదా సంజు శాంసన్‌ను టీమ్‌లోకి తీసుకునే అవకావం ఉంది. మరి ఈ మార్పుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shivam Dube Bc can’t bat, can’t bowl and Can’t field.
We are already carrying Ravindra Jadeja through the CSK quota and now we need to carry Dube also in the T20 World Cup. pic.twitter.com/GbskeziTjJ
— Sujeet Suman (@sujeetsuman1991) June 9, 2024