SNP
Sunil Gavaskar, Hardik Pandya: టీమిండియా మరింత అజేయంగా దూసుకెళ్లాలంటే ఆ ఒక్కడ్ని ఎలాగైనా ఒప్పించి టెస్ట్ క్రికెట్ ఆడించాలని సునీల్ గవాస్కర్ అంటున్నారు. మరి ఆ ఒక్కడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
Sunil Gavaskar, Hardik Pandya: టీమిండియా మరింత అజేయంగా దూసుకెళ్లాలంటే ఆ ఒక్కడ్ని ఎలాగైనా ఒప్పించి టెస్ట్ క్రికెట్ ఆడించాలని సునీల్ గవాస్కర్ అంటున్నారు. మరి ఆ ఒక్కడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచి మంచి జోష్‌లో ఉన్న టీమిండియా.. ఇక టెస్టుల్లో కూడా అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్లాలంటే చేయాల్సిన పని ఏంటో భారత దిగ్గజ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వెల్లడించాడు. స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాను ఎలాగైన ఒప్పించి టెస్టు క్రికెట్ ఆడించాలని గవాస్కర్ పేర్కొన్నాడు. టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన పాండ్యాను టెస్టుల్లో కూడా సరిగ్గా వాడుకుంటే.. భారత్‌కు తిరుగు ఉండదంటూ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంకా గవాస్కర్ మాట్లాడుతూ.. పాండ్యా టెస్టు క్రికెట్‌కు దూరమై దాదాపు ఆరు సంవత్సరాల పైనే అవుతుంది. తన కెరీర్‌లో హార్ధిక్ పాండ్యా కేవలం 11 టెస్టులు మాత్రమే ఆడాడు. కానీ, ప్రస్తుతం అతను ఉన్న ఫామ్‌ను దృష్ట్యా అతన్ని ఎలాగైనా ఒప్పించి.. టెస్టు టీమ్‌లోకి తీసుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయన్నాడు. ఆల్‌రౌండర్‌గా పాండ్యా బౌలింగ్ చేస్తూ.. 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్‌కి వస్తే.. టీమిండియా ఏ దేశంలో ఆడినా, ఎలాంటి పిచ్‌పైన ఆడిన ఇంప్యాక్ట్ చూపిస్తుందని అన్నాడు.
ఈ ఏడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు, ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌లో నాలుగు టెస్టులు ఆడనుంది టీమిండియా. వచ్చే ఏడాది జూన్‌లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ ఆడాలంటే.. టీమిండియాకు ఈ రెండు సిరీస్‌లు ఎంతో కీలకం కానున్నాయి. మరి వాటిలో విజయం సాధించాలంటే హార్ధిక్ పాండ్యా టీమ్‌లో ఉండటం ఎంతో మేలు చేస్తోందనేది గవాస్కర్ సూచన. కానీ, హార్ధిక్ పాండ్యా మాత్రం టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. కేవలం వైట్ బాల్ క్రికెట్‌పైనే ఫోకస్ పెట్టి.. రెడ్ బాల్ క్రికెట్‌ను పూర్తిగా వదిలేశాడు. మరి గవాస్కర్ చెప్పినట్లు పాండ్యాను టెస్టు టీమ్‌లోకి తీసుకుంటే.. ఎలాంటి ఇంప్యాక్ట్ చూపిస్తాడని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Legendary India batter Sunil Gavaskar has stated that the key to India becoming “invincible” in Test cricket lies on how Hardik Pandya is utilised.#HardikPandya #SunilGavaskar pic.twitter.com/ZTH0HsBx2m
— Sayyad Nag Pasha (@nag_pasha) July 11, 2024