Nidhan
Ravi Shastri: టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా గెలుచుకోవడంతో సంబురాలు మిన్నంటాయి. రోహిత్ సేన విజయాన్ని దేశంలోని క్రికెట్ లవర్స్ అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Ravi Shastri: టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా గెలుచుకోవడంతో సంబురాలు మిన్నంటాయి. రోహిత్ సేన విజయాన్ని దేశంలోని క్రికెట్ లవర్స్ అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Nidhan
టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా గెలుచుకోవడంతో సంబురాలు మిన్నంటాయి. రోహిత్ సేన విజయాన్ని దేశంలోని క్రికెట్ అభిమానులంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గెలుపు సంబురాలు ఇంకా కొనసాగుతున్నాయి. ట్రోఫీతో స్వదేశానికి తిరిగొచ్చిన భారత ఆటగాళ్లు ఫుల్ బిజీ అయిపోయారు. మొదట ప్రధాని నరేంద్ర మోడీని కలసి ఆయనతో కలసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. ఆ తర్వాత ముంబైలోని వాంఖడే స్టేడియానికి వచ్చి అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. విక్టరీ పరేడ్ ద్వారా లక్షలాది మంది ఫ్యాన్స్‌ను కలసి భారత జట్టుకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆటగాళ్లు ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. విక్టరీ పరేడ్ ముగిసినా రోహిత్, హార్దిక్ లాంటి వాళ్లు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు.
వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టును అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. టీమిండియా సూపర్బ్‌గా ఆడిందని మెచ్చుకుంటున్నారు. అయితే మెన్ ఇన్ బ్లూపై ఎప్పుడూ విద్వేషం చూపించే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మరోమారు తన బుద్ధి చూపించాడు. ప్రపంచ కప్ మ్యాచ్‌ల నిర్వహణలో భారత జట్టుకు ఐసీసీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని.. ఆ టీమ్‌కు అనుగుణంగా షెడ్యూల్‌ను ప్లాన్ చేసిందని వాన్ విమర్శించాడు. గ్రూప్ మ్యాచ్‌ల నుంచి ఫైనల్ వరకు టీమిండియాకు అనుకూలంగా షెడ్యూల్ ఉందని, అదే సెమీస్‌కు చేరిన ఆఫ్ఘానిస్థాన్ టీమ్‌కు అన్యాయం జరిగిందన్నాడు వాన్. ఆ టీమ్‌కు ప్రాక్టీస్ చేసేందుకు తగిన టైమ్ కూడా దొరకలేదన్నాడు. బీసీసీఐ ఏం చెబితే అదే నడుస్తోందని ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశాడు. దీనిపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సీరియస్ అయ్యాడు. భారత క్రికెట్ గురించి ఒక్క మాట అన్నా ఊరుకోబోమన్నాడు.
టీమిండియాను తిట్టేందుకు వాన్‌కు అర్హత లేదని.. అతడి మాటల్ని ఇక్కడ ఎవరూ పట్టించుకోరంటూ కౌంటర్ ఇచ్చాడు రవిశాస్త్రి. ‘తనకు నచ్చినట్లు మాట్లాడేందుకు వాన్‌కు అర్హత ఉంది. కానీ ఇండియాలో అతడ్ని ఎవరూ లెక్కచేయరు. మా మీద పడి ఏడ్చే బదులు అతడు ఇంగ్లండ్ టీమ్ గురించి ఆలోచించడం బెటర్. భారత్ ఇప్పటిదాకా నాలుగు వరల్డ్ కప్స్ గెలుచుకుంది. అదే ఇంగ్లీష్ టీమ్ కిందా మీద పడి రెండే నెగ్గింది. వాన్ ఒక్క ట్రోఫీ కూడా చేతబట్టింది లేదు. కాబట్టి ముందు అతడు తన పరిస్థితి గురించి, తన జట్టు గురించి ఆలోచించుకోవాలి. అతడి ఆరోపణల్ని నేను ఖండిస్తున్నా. సెమీస్‌లో భారత్ చేతిలో ఇంగ్లండ్ అంత దారుణంగా ఎలా ఓడిందో ఆలోచించి అందుకు తగ్గట్లు ఆ జట్టుకు సూచనలు చేయాలి’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. మరి.. వాన్-రవిశాస్త్రి వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Ravi Shastri hit back Michael Vaughan
“Nobody in India cares about him.Let him sort out the England team first.He should give advice on what happened to the England team in the semifinal. India is used to lifting Cups.I don’t think Michael’s lifted a Cup ever. So think twice.” pic.twitter.com/ngqXaDf9Yk
— Sujeet Suman (@sujeetsuman1991) July 6, 2024