Team India Victory Parade: వీడియో: స్తంభించిన ముంబై మహానగరం! 2007కు మించిన క్రేజ్‌..

Team India, Victory Parade, T20 World Cup 2024, Mumbai: టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన సంతోషాన్ని అభిమానులతో పంచుకోవాలని బీసీసీఐ విక్టరీ పరేడ్‌ను ఏర్పాటు చేసింది. అయితే.. ఈ పరేడ్‌ కారణంగా ముంబై మహానగరం స్తంభించి పోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Team India, Victory Parade, T20 World Cup 2024, Mumbai: టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన సంతోషాన్ని అభిమానులతో పంచుకోవాలని బీసీసీఐ విక్టరీ పరేడ్‌ను ఏర్పాటు చేసింది. అయితే.. ఈ పరేడ్‌ కారణంగా ముంబై మహానగరం స్తంభించి పోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ముంబై మహానగరం స్తంభించిపోయింది. ప్రపంచంలోనే అంత్యంత ప్రత్యేకమైన ప్లేస్‌గా ఉన్న మెరైన్‌ డ్రైవ్‌ జనసంద్రంతో కిక్కిరిసిపోయింది. ముంబైలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ రోడ్డు క్రికెట్‌ అభిమానులతో పొటెత్తింది. టీ20 వరల్డ్‌ కప్‌ 2024ను సాధించిన భారత క్రికెట్‌ జట్టు.. నేడు స్వదేశానికి తిరిగి రావడంతో.. టీమిండియాకు వాంఖడే క్రికెట్‌ స్డేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతకంటే ముందు.. మెరైన్‌ డ్రైవ్‌ నుంచి ప్రఖ్యాత వాంఖడే క్రికెట్‌ స్డేడియం వరకు విక్టరీ పరేడ్‌ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు.

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ట్రోఫీతో రోహిత్‌ శర్మ ఇంకా టీమ్‌ సభ్యులు ఓపెన్‌ టాప్‌ బస్‌పై అభిమానులకు అభివాదం చేసుకుంటూ.. మెరైన్‌ డ్రైవ్‌ నుంచి వాంఖడే వరకు రోడ్‌ షోగా వెళ్లనున్నారు. అయితే.. ఈ రోడ్‌ కోసం ఏర్పాటు చేసిన ఓపెన్‌ టాప్‌ బస్సు ఆటగాళ్లను ఎక్కించుకునే ముందే ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం గమనార్హం. టీమిండియా విక్టరీ పరేడ్‌లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో క్రికెట్‌ అభిమానులు మెరైన్‌ డ్రైవ్‌ వద్దకు చేరుకున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

వేల సంఖ్యలో క్రికెట్‌ అభిమానులు మధ్యాహ్నం నుంచే మెరైన్‌ డ్రైవ్‌కు చేరుకున్నారు. టీమిండియా ఆటగాళ్ల కోసం స్పెషల్‌గా డిజైన్‌ చేయించన బస్సులు ఆటగాళ్లను ఎక్కించుకునేందుకు హోటల్‌కు వెళ్తున్న క్రమంలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ఆటగాళ్ల పరేడ్‌ కోసం వేల సంఖ్యలో క్రికెట్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు. రోడ్లపైనే కాకుండా.. సన్మానం జరగనున్న వాంఖడే స్టేడియం కూడా అభిమానులతో నిండిపోయింది. మొత్తంగా టీమిండియా వరల్డ్‌ కప్‌ సాధించడంతో.. ముంబై మహానగరం స్తంభించి పోయింది. 2007లో ధోని సారథ్య​ంలో టీమిండియా మొట్టమొదటి టీ20 వరల్డ్‌ కప్‌ సాధించిన సమయంలో కూడా ఇలానే విక్టరీ పరేడ్‌ నిర్వహించారు. అప్పుడు కూడా ఇలాగే భారీగా క్రికెట్‌ అభిమానులు రోడ్లపైకి వచ్చారు. అప్పటి ఫొటోలు కూడా ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ సారి అంతకు మించి అనేలా విక్టరీ పరేడ్‌ జరగనుంది. మరి ఈ విక్టరీ పరేడ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments