iDreamPost
android-app
ios-app

వీడియో: వరల్డ్ కప్ విజయం.. అందరూ ఫ్యామిలీస్ తో సెలబ్రేషన్స్! ఆ ఒక్కడు ఒంటరిగా..

  • Published Jul 04, 2024 | 10:14 AM Updated Updated Jul 04, 2024 | 10:14 AM

13 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ గెలవడంతో.. టీమిండియా ఆటగాళ్లు ఆ సంతోషాన్ని తమ కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. కానీ ఒకే ఒక్క ప్లేయర్ మాత్రం ఒంటరిగా తన ఉన్నాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ ప్లేయర్ ఎవరు? ఆ వివరాల్లోకి వెళితే..

13 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ గెలవడంతో.. టీమిండియా ఆటగాళ్లు ఆ సంతోషాన్ని తమ కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. కానీ ఒకే ఒక్క ప్లేయర్ మాత్రం ఒంటరిగా తన ఉన్నాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ ప్లేయర్ ఎవరు? ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 04, 2024 | 10:14 AMUpdated Jul 04, 2024 | 10:14 AM
వీడియో: వరల్డ్ కప్ విజయం.. అందరూ ఫ్యామిలీస్ తో సెలబ్రేషన్స్! ఆ ఒక్కడు ఒంటరిగా..

13 ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియా తన వరల్డ్ కప్ కలను సాకారం చేసుకుంది. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై విజయం సాధించి.. ప్రపంచ కప్ ను ముద్దాడింది. ఈ చిరస్మరణీయ విజయంతో ఆటగాళ్లు అందరూ గ్రౌండ్ లోనే భావోద్వేగానికి గురైయ్యారు. ఇక ఈ విజయాన్ని తమ కుటుంబ సభ్యులతో కలిసి పంచుకున్నారు. దాదాపు అందరు ప్లేయర్లు తమ ఫ్యామిలీస్ తో ఎమోషనల్ సెలబ్రేషన్స్ జరుపుకొన్నారు. కానీ ఒకే ఒక్క ప్లేయర్ మాత్రం ఒంటరిగా తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ ప్లేయర్ ఎవరంటే?

టీమిండియా వరల్డ్ కప్ సాధించిన తర్వాత ఆటగాళ్లు తమ సంతోషాన్ని కుటుంబంతో కలిసి పంచుకున్నారు. రోహిత్ శర్మ తన భార్య రితికాతో విజయాన్ని పంచుకోగా.. జడేజా, బుమ్రా, విరాట్ కోహ్లీతో పాటుగా మరికొంత మంది ప్లేయర్లు తమ ఫ్యామిలీస్ తో సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఓ విషయం మీరు గమనించారా? అదేంటంటే? భారత ప్లేయర్లు అందరూ తమ కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటుంటే.. ఓ ప్లేయర్ మాత్రం ఒంటరిగానే తన సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. అతడు ఎవరో కాదు.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.

టీమిండియా వరల్డ్ కప్ సాధించిన తర్వాత హార్దిక్ పాండ్యా తన సంతోషాన్ని ఒంటిరిగానే సెలబ్రేట్ చేసుకున్నాడు. మిగతా ప్లేయర్లు తమ ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేశారు. కానీ పాండ్యా ఒక్కడే త్రివర్ణ పతాకంతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. హార్దిక్ భార్య నటాషా స్టాంకోవిచ్ ఫైనల్ మ్యాచ్ కు హాజరుకాకపోవడానికి కారణాలు తెలియరాలేదు. అయితే కొన్ని రోజుల క్రితం వీరిద్దరు విడిపోతున్నారన్న వార్తలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఆ న్యూస్ పై ఇద్దరూ స్పందించలేదు. కానీ పాండ్యా-నటాషా విడిపోవడం లేదని తర్వాత కొన్ని వార్తలు వైరల్ గా మారాయి. పాండ్యా భార్య నటాషా ఎందుకు రాలేదు? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మిగతా ఆటగాళ్లు ఫ్యామిలీస్ తో సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే.. హార్దిక్ ఒంటరిగా ఉండటం మరో చర్చకు దారితీసింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet