iDreamPost
android-app
ios-app

IND vs PAK: భారత టాపార్డర్‌కు అఫ్రిదీ ఫోబియా పట్టుకుందా?

  • Published Sep 02, 2023 | 5:09 PM Updated Updated Sep 02, 2023 | 5:09 PM
  • Published Sep 02, 2023 | 5:09 PMUpdated Sep 02, 2023 | 5:09 PM
IND vs PAK: భారత టాపార్డర్‌కు అఫ్రిదీ ఫోబియా పట్టుకుందా?

క్రికెట్‌ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ మొదలైపోయింది. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసేందుకు నిర్ణయించాడు. కానీ, మొదటి నుంచి క్రికెట్‌ అభిమానులు వ్యక్తం చేస్తున్న భయమే నిజమైంది. పాకిస్థాన్‌ టాప్‌ బౌలర్‌ షాహీన్‌ షా అఫ్రిదీ మరోసారి రెచ్చిపోయాడు. టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజాలైన రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలను తక్కువ స్కోర్లకే ఔట్‌ చేసి పెవిలియన్‌కు పంపించాడు. రోహిత్‌ శర్మ 22 బంతుల్లో 11 పరుగులు చేసి.. ఇన్నింగ్స్‌ 5వ ఓవర్‌ చివరి బంతికి క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ సూపర్‌ కవర్‌ డ్రైవ్‌తో అద్భుత టచ్‌లో కనిపించాడు. కానీ, ఆ వెంటనే బాల్‌ను వికెట్లపైకి ఆడేశాడు. 7 బంతుల్లో కేవలం 4 పరుగులు చేసి వికెట్‌ సమర్పించుకున్నాడు.

అఫ్రిదీ ఫోబియా..
రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ చాలా మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికీ.. ఈ మ్యాచ్‌లో త్వరగా అవుట్‌ అవ్వడం గురించి కాస్త ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఈ అవుట్ల వెనుక అఫ్రిదీ ఫోబియా ఉన్నట్లు క్రికెట్‌ అభిమానులు పేర్కొంటున్నారు. పాకిస్థాన్‌ ప్రధాన బలం పేస్‌ బౌలింగ్‌ అని అందులోనూ షాహీన్‌ షా అఫ్రిదీని ఎదుర్కొవడం పెద్ద సవాల్‌ అనే విషయంపైనే మ్యాచ్‌ కంటే చాలా రోజుల ముందుగానే చర్చ జరుగుతోంది. 2021 టీ20 వరల్డ్‌ కప్‌ సందర్భంగా కూడా అఫ్రిదీ టీమిండియా టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. ఇప్పుడు ఈ మ్యాచ్‌ కంటే ముందు కూడా అఫ్రిదీని టీమిండియా టాపార్డర్‌ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనే దానిపై తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి.

టీమిండియా టాపార్డర్‌లో రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ ముగ్గురూ రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్లే, పైగా రోహిత్‌, కోహ్లీకి లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్ల వీక్‌నెస్‌ ఉంది. ఎడమచేతి వాటం పేసర్లను ఎదుర్కొవడానికి కాస్త ఇబ్బంది పడుతుంటారు. ఇది చాలా కాలంగా ఉన్న సమస్య. అయినా కూడా వీరిద్దరూ దాన్ని అదిగమించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని క్రికెట్‌ అభిమానులు విమర్శిస్తున్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడిన ప్రతిసారీ.. షాహీన్‌ అఫ్రిదీ బౌలింగ్‌ను ఏదో బ్రహ్మపదార్థంలా భావించడం కూడా టీమిండియా టాపార్డర్‌ వైఫల్యానికి కారణంగా మారుతోంది. అఫ్రిదీ బౌలింగ్‌ అంటే భయపడుతున్నారా? అనే అనుమానం కూడా క్రికెట్‌ అభిమానుల నుంచి వ్యక్తం అవుతుంది. లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలర్‌ను సమర్థవంతంగా ఎదుర్కొడానికి మన టాపార్డర్‌ బ్యాటర్లు మైండ్‌ సెట్‌ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. భయపడుతూ డిఫెన్సివ్‌ మూడ్‌లో కాకుండా ఎటాకింగ్‌ క్రికెట్‌ ఆడాలని క్రికెట్‌ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రోహిత్ ​శర్మవి మతి లేని మాటలు.. మండిపడ్డ వరల్డ్ కప్ హీరో!