Nidhan
టీమిండియా స్టార్ క్రికెటర్లు షమి, సూర్యకుమార్, పంత్ గాయాలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. వారి రికవరీ, కమ్‌బ్యాక్‌పై తాజా అప్డేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా స్టార్ క్రికెటర్లు షమి, సూర్యకుమార్, పంత్ గాయాలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. వారి రికవరీ, కమ్‌బ్యాక్‌పై తాజా అప్డేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
Nidhan
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు రెడీ అవుతున్న టీమిండియాను గాయాల సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. తొలి రెండు టెస్టులకు జట్టును ఎంపిక చేసినప్పటికీ అందులో కొందరు స్టార్లు మిస్సయ్యారు. ఇంజ్యురీల వల్ల వెటరన్ పేసర్ మహ్మద్ షమి, పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్, సూర్యకుమార్ యాదవ్ సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో అసలు వీళ్లు ఎప్పటికి కోలుకుంటారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంజ్యురీ వల్ల సౌతాఫ్రికా టూర్లో షమి ఆడలేదు. సఫారీ పర్యటనకు వెళ్లిన సూర్యకుమార్ గాయం వల్ల మధ్యలోనే నుంచి వచ్చేశాడు. వీళ్లిద్దరూ ఆఫ్ఘానిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో ఆడలేదు. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకూ అందుబాటులో లేకుండా పోయారు. ఆఖరి మూడు టెస్టులు ఆడటమూ డౌట్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఈ స్టార్ల ఇంజ్యురీ అప్డేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వన్డే వరల్డ్ కప్-2023లో అద్భుతంగా రాణించిన షమి.. మెగాటోర్నీ టైమ్‌లోనే గాయపడ్డాడు. వెన్ను నొప్పితో బాధపడుతూనే ఇంజక్షన్లు తీసుకొని గేమ్‌ను కంటిన్యూ చేశాడు. టోర్నీ ముగిసిన తర్వాత ముంబైలో సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న షమి.. డాక్టర్ల పర్యవేక్షణలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. కానీ అతడి గాయానికి సంబంధించి లండన్‌లో ఉన్న ఓ ఎక్స్‌పర్ట్‌ను కలవాలని డాక్టర్లు సూచించారట. దీంతో త్వరలో లండన్‌కు షమి పయనం కానున్నాడని తెలుస్తోంది. సౌతాఫ్రికా టూర్లో గాయపడిన సూర్యకుమార్ యాదవ్ దాని నుంచి కోలుకొని ఈ మధ్య ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. కానీ గ్రోయిన్ సర్జరీ కోసం అతడ్ని జర్మనీకి పంపుతోంది బీసీసీఐ. గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్ కోలుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలోనూ అతడు పాల్గొన్నాడు.
జోరుగా వర్కవుట్స్ చేస్తూ, ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు పంత్. అయితే ఎందుకైనా మంచిదని లండన్‌లో ఉన్న ఎక్స్‌పర్ట్‌ను కలవమని అతడికి బీసీసీఐ ఆదేశించింది. దీంతో షమి, సూర్య, పంత్ ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌తో పాటు ఐపీఎల్-2024 సీజన్లో పలు మ్యాచులకు దూరమవడం పక్కా అని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. అయితే విదేశాలకు వెళ్లొచ్చాకే వాళ్ల ఫిట్నెస్, ఇంజ్యురీపై పూర్తి స్పష్టత వస్తుంది. ఇక, ఇంగ్లండ్‌లో లీగ్స్ ఆడుతూ గాయపడ్డ పృథ్వీ షా, మోకాలు సంబంధింత సమస్యలతో బాధపడుతున్న శార్దూల్ ఠాకూర్లు కూడా ఐపీఎల్లో ప్రారంభ మ్యాచులకు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. షా కోలుకోవడానికి మరో నెల పడుతుందని తెలుస్తోంది. వీళ్లతో పాటు గాయాలతో ఇబ్బంది పడుతున్న రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్ కూడా ఎన్సీఏలోనే ఉన్నారు. అయితే వీళ్ల విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని.. వీళ్లు ఫిట్‌గా ఉన్నారని సమాచారం. మరి.. భారత స్టార్ క్రికెటర్లు ఇంకా గాయాల నుంచి కోలుకోకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Indian Players Injury Update:- (Cricbuzz)
▶️ Prithvi Shaw – 1 more month needed for IPL comeback after fitness
▶️ Shardul Thakur – Knee issues
▶️ Mohammed Shami – Consult expert in London
▶️ Suryakumar Yadav – Groin Surgery done in Germany
▶️ Rishabh Pant – Consult expert in… pic.twitter.com/5EtdU3VyCp— CricketGully (@thecricketgully) January 19, 2024