Sarfaraz Khan Reaction On Bangladesh Series: నాకు నమ్మకం లేదు.. ఆశలు వదిలేశా! సర్ఫరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sarfaraz Khan: నాకు నమ్మకం లేదు.. ఆశలు వదిలేశా! సర్ఫరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ డెబ్యూ సిరీస్​లోనే అదరగొట్టాడు. తన బ్యాట్ సత్తా ఏంటో అందరికీ చూపించాడు. అలాంటోడు ఇప్పుడు మరో సవాల్​కు సిద్ధమవుతున్నాడు.

టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ డెబ్యూ సిరీస్​లోనే అదరగొట్టాడు. తన బ్యాట్ సత్తా ఏంటో అందరికీ చూపించాడు. అలాంటోడు ఇప్పుడు మరో సవాల్​కు సిద్ధమవుతున్నాడు.

భారత క్రికెట్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం అంత ఈజీ కాదు. ఒక్కో స్పాట్ కోసం టీమ్​లో టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. డొమెస్టిక్ లెవల్​తో పాటు ఐపీఎల్​లో రాణించినా కూడా జట్టులో చోటు దక్కుతుందని గ్యారెంటీ లేదు. అందునా టెస్టుల్లో బెర్త్ సంపాదించడం అంటే తలకు మించిన పని అనే చెప్పాలి. యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్​ ఇలాగే ఎంతో ప్రయత్నించి ఆఖరికి తన కలను నెరవేర్చుకున్నాడు. ఏళ్ల పాటు దేశవాళీ క్రికెట్​లో పరుగుల వరద పారించినా అతడికి ఛాన్స్ దక్కలేదు. బరువు అధికంగా ఉన్నాడనే కారణంతో సర్ఫరాజ్​ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. ఎట్టకేలకు ఇంగ్లండ్​ సిరీస్​తో అతడికి ఛాన్స్ వచ్చింది. దాన్ని అతడు రెండు చేతులా ఉపయోగించుకున్నాడు. మూడు టెస్టుల్లో 200 పరుగులతో సత్తా చాటాడు. అలాంటోడు తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

వచ్చే నెలలో బంగ్లాదేశ్​తో టెస్ట్ సిరీస్​లో తలపడనుంది భారత్. దీనికి సెలెక్ట్ అవ్వాలంటే బుచ్చిబాబు టోర్నీ, దులీప్ ట్రోఫీ లాంటి దేశవాళీ టోర్నీల్లో తప్పక రాణించాల్సిన పరిస్థితి. టీమిండియా స్టార్లంతా ఇందులో ఆడుతున్నారు. బాగా ఆడితే టీమ్​లోకి ఛాన్స్ పక్కాగా కనిపిస్తోంది. కానీ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం తనకు ఆశల్లేవని, భారత తుది జట్టులో చోటు కష్టమేనని అంటున్నాడు. గతంలోనూ డొమెస్టిక్ క్రికెట్​లో అదరగొట్టినా అవకాశాలు పెద్దగా రాలేదన్నాడు. ఈసారి దేశవాళీ టోర్నీల్లో ఎలాంటి ఎక్స్​పెక్టేషన్స్ లేకుండా బరిలోకి దిగుతున్నానని అన్నాడు. ప్రతి ఛాన్స్​ను సద్వినియోగం చేసుకునేందుకు తన వంతుగా ప్రయత్నిస్తానని చెప్పాడు. ఇప్పటివరకు చేసినదే ఇక మీదటా కంటిన్యూ చేస్తానని సర్ఫరాజ్ పేర్కొన్నాడు.

‘నా కెరీర్​లో తప్పకుండా బ్రేక్ వస్తుందని భావిస్తున్నా. అయితే అందుకు వేచి చూడాల్సి ఉంటుంది. ఒకరకంగా ఇది నాకు కలిసొచ్చే అంశమనే చెప్పాలి. అప్పుడే నేను డొమెస్టిక్ క్రికెట్​ ఎక్కువగా ఆడతా. ఇక్కడ ఎక్కువ టైమ్ గడిపితే అత్యుత్తమ బ్యాటర్​గా మారేందుకు ఛాన్స్ ఉంటుంది’ అని సర్ఫరాజ్ చెప్పుకొచ్చాడు. ఇక, బుచ్చిబాబు టోర్నమెంట్​లో ఇషాన్ కిషన్​తో పాటు మరో టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నాడు. దులీప్ ట్రోఫీలోనైతే దాదాపుగా అందరు భారత ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్​ప్రీత్ బుమ్రా తప్ప అందరు స్టార్లు ఆడనున్నారు. శుబ్​మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ దగ్గర నుంచి మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ వరకు దులీప్ ట్రోఫీలో సత్తా చాటేందుకు అంతా సిద్ధమవుతున్నారు. మరి.. బంగ్లా సిరీస్​కు సర్ఫరాజ్ సెలెక్ట్ అవుతాడని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

Show comments