iDreamPost
android-app
ios-app

వీడియో: ఈ క్రికెటర్ ఎవరో గుర్తుపట్టారా? సింగిల్ హ్యాండ్​తో గెలిపిస్తాడు!

  • Published Jul 17, 2024 | 9:47 AMUpdated Jul 17, 2024 | 9:47 AM

Team India: అతడు అలాంటి ఇలాంటి ప్లేయర్ కాదు. ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే సత్తా ఉన్నోడు. ఆ టీమిండియా స్టార్​కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అతడు ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..

Team India: అతడు అలాంటి ఇలాంటి ప్లేయర్ కాదు. ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే సత్తా ఉన్నోడు. ఆ టీమిండియా స్టార్​కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అతడు ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..

  • Published Jul 17, 2024 | 9:47 AMUpdated Jul 17, 2024 | 9:47 AM
వీడియో: ఈ క్రికెటర్ ఎవరో గుర్తుపట్టారా? సింగిల్ హ్యాండ్​తో గెలిపిస్తాడు!

క్రికెటర్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం చూస్తూనే ఉంటాం. అలాగే ఇప్పుడో టీమిండియా స్టార్ ప్లేయర్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. వెనుక నుంచి చూస్తే అచ్చం కెప్టెన్ రోహిత్ శర్మలాగే ఉన్నాడా ప్లేయర్. కానీ అతడు ఎవరో గుర్తుపట్టడం అంత ఈజీ కాదు. ఆ క్రికెటర్ మామూలోడు కాదు. సింగిల్ హ్యాండ్​తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉన్నోడు. దశాబ్ద కాలానికి పైగా టీమిండియాతో జర్నీ చేస్తున్నాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్-2023లో భారత్ ఫైనల్ వరకు వెళ్లడంలో అతడిది బిగ్ రోల్. వెన్ను గాయం ఇబ్బంది పెడుతున్నా దేశం కోసం ఇంజక్షన్లు తీసుకొని మరీ పోరాడిన యోధుడు.

ఆ స్టార్ మరెవరో కాదు.. సీనియర్ పేసర్ మహ్మద్ షమి. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్​లో అద్భుతంగా బౌలింగ్ చేసి అందరి మనసులు దోచుకున్నాడు షమి. టీమిండియా కప్పు గెలవకపోయినా అతడి పెర్ఫార్మెన్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే గాయంతో బాధపడుతూనే మెగాటోర్నీలో ఆడటంతో ఆ తర్వాత క్రికెట్​కు దూరమయ్యాడు షమి. వెన్ను నొప్పి తిరగబెట్టడంతో సర్జరీ చేయించుకున్నాడు. దీంతో అమెరికా-వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచ కప్​-2024కూ దూరమయ్యాడీ వెటరన్ పేసర్. ఇంజ్యురీ నుంచి కోలుకున్న షమి తాజాగా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ నెట్టింట అవుతోంది.

సాధారణంగా భీకరమైన వేగంతో బంతులు వేస్తుంటాడు షమి. చిరుత పులిలా పరిగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ చేస్తుంటాడు. అయితే ప్రాక్టీస్​లో మాత్రం స్లో రనప్​తో బంతులు వేస్తూ కనిపించాడు. ఇప్పుడిప్పుడే ఇంజ్యురీ నుంచి రికవర్ అవుతుండటంతో రిస్క్ ఎందుకని ఇలా చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఒక్కసారి శరీరంపై పట్టు లభించాక, కంప్లీట్ ఫిట్​గా మారాక మునుపటి రిథమ్​తో బౌలింగ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తన ప్రాక్టీస్ వీడియోను సోషల్ మీడియాలో ఫ్యాన్స్​తో పంచుకున్నాడు షమి. బాలీవుడ్ లేటెస్ట్ హిట్ సాంగ్ ‘తౌబా తౌబా’ మ్యూజిక్​ను దీనికి జత చేశాడు. తాను బౌలింగ్​ మొదలుపెట్టేశానని.. త్వరలో స్ట్రాంగ్​గా కమ్​బ్యాక్ ఇస్తానంటూ ఈ పోస్ట్​తో చెప్పకనే చెప్పేశాడు. అయితే ఈ వీడియో చూసిన అభిమానులు షమిని వెనుక నుంచి చూసి హిట్​మ్యాన్ పేస్ బౌలింగ్ చేయడం ఏంటని అనుకున్నారు. అయితే రోహిత్ కాదు.. షమి అని తెలియడంతో నవ్వుకున్నారు. మరి.. టీమిండియాలోకి షమి రాక కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@mdshami.11)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి