iDreamPost
android-app
ios-app

IPL 2024కు ముందు రాహుల్ షాకింగ్ డిసిషన్.. ఎవరూ ఊహించని విధంగా..!

  • Published Jan 20, 2024 | 6:47 PM Updated Updated Jan 20, 2024 | 6:47 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్​కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ షాకింగ్ డిసిషన్ తీసుకున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్​కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ షాకింగ్ డిసిషన్ తీసుకున్నాడు.

  • Published Jan 20, 2024 | 6:47 PMUpdated Jan 20, 2024 | 6:47 PM
IPL 2024కు ముందు రాహుల్ షాకింగ్ డిసిషన్.. ఎవరూ ఊహించని విధంగా..!

మన దేశంలో ఐపీఎల్ ఫీవర్ మొదలవుతోంది. క్యాష్ రిచ్ లీగ్ స్టార్ట్ అయ్యేందుకు మరో నెలన్నరకు పైగా సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే అంతా దీని గురించి చర్చించుకుంటున్నారు. ఆఫ్ఘానిస్థాన్​తో టీ20 సిరీస్ ముగించుకొని ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​కు రెడీ అయింది టీమిండియా. అది పూర్తయ్యాక ఐపీఎల్ మొదలుకానుంది. దీంతో భారత ప్లేయర్లు పొట్టి ఫార్మాట్​ లీగ్​లో ఎప్పుడెప్పుడు ఆడతారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి మాత్రం లీగ్​ను చాలా మంది స్టార్స్ సీరియస్​గా తీసుకోనున్నారు. ఈ ఏడాది జూన్​లో టీ20 వరల్డ్ కప్ జరగనుండటమే దీనికి కారణం. ఆ టోర్నీకి వెళ్లే భారత జట్టులో చోటు సంపాదించాలంటే ఐపీఎల్​లో రాణించక తప్పదు. అందుకే స్టార్ క్రికెటర్స్ దీనిపై ఫోకస్ పెడుతున్నారు. టీమిండియా ఆటగాళ్లతో పాటు విదేశీ క్రికెటర్లు కూడా క్యాష్ రిచ్​ లీగ్​లో బాగా ఆడి తమ నేషనల్ టీమ్స్​లో ప్లేస్ ఫిక్స్ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ తరుణంలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ షాకింగ్ డిసిషన్ తీసుకున్నాడు.

ఐపీఎల్​లో లక్నో సూపర్ జెయింట్స్​కు కెప్టెన్​గా రాహుల్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి రాహుల్ ఈసారి లక్నోకు బ్యాటర్​గానే గాక కీపర్​గానూ సేవలు అందించాలని ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకోవాలని డిసైడ్ అయిన రాహుల్.. మిడిలార్డర్​లో బ్యాటింగ్​కు దిగాలని అనుకుంటున్నాడట. ఈ మేరకు లక్నో మేనేజ్​మెంట్​తో అతడు చర్చలు కూడా జరిపాడని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. కొత్త కోచ్​ జస్టిన్ లాంగర్​ కూడా రాహుల్ నిర్ణయానికి మద్దతు తెలిపాడని సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈసారి కీపర్​గా, మిడిలార్డర్ బ్యాటర్​గా రాహుల్ దిగడం ఖాయమైందని సోషల్ మీడియాలోనూ రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే లక్నో జట్టుకు బిగ్ ప్లస్ అనే చెప్పాలి. బ్యాటర్​గా, కీపర్​గా రాహుల్ బాధ్యతలు చేపడితే అదనంగా మరో బ్యాటర్​ను తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. అందుకే అతడి డిసిషన్​కు మేనేజ్​మెంట్ ఓకే చెప్పిందని వినికిడి.

Rahul in a new role in IPL 2024

కేఎల్ రాహుల్ కొత్త రోల్​లో కనిపించనున్నాడనే వార్తలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు దీన్ని సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఆఫ్ఘానిస్థాన్​తో రీసెంట్​​గా జరిగిన టీ20 సిరీస్​లో రాహుల్​ను సెలక్ట్ చేయలేదు. దీంతో వచ్చే వరల్డ్ కప్​లోనూ ఆడించేది డౌట్​గా మారింది. అందుకే బ్యాటింగ్, కీపింగ్​లో తన సత్తా నిరూపించుకునే ఉద్దేశంతోనే రాహుల్ కొత్త అవతారం ఎత్తనున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే టీ20 క్రికెట్​లో రాహుల్ రికార్డు ఏమాత్రం బాగోలేదని.. కీపింగ్​కు బదులు అతడు బ్యాటింగ్ మీద ఫుల్ కాన్​సంట్రేషన్ పెడితే మంచిదని సూచిస్తున్నారు. అటాకింగ్ గేమ్ ఆడితే అతడికి ప్రపంచ కప్ బెర్త్ పక్కా అని చెబుతున్నారు. వన్డేల్లాగే స్లోగా ఆడితే మాత్రం కష్టమేనని అంటున్నారు. మరి.. ఐపీఎల్​లో కీపర్​గా కొత్త రోల్​లో రాహుల్ కనిపించనున్నాడనే వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.