BCCI Claims Biju's Defaulted Payment: Team India: బీసీసీఐని నిలువునా ముంచిన ప్రముఖ సంస్థ.. ఏకంగా రూ.కోట్లలో ఎగవేత!

Team India: బీసీసీఐని నిలువునా ముంచిన ప్రముఖ సంస్థ.. ఏకంగా రూ.కోట్లలో ఎగవేత!

  • Author singhj Published - 08:09 AM, Tue - 5 December 23

భారత క్రికెట్ బోర్డును ఒక ప్రముఖ సంస్థ నిలువునా ముంచింది. ఏకంగా రూ.కోట్లలో డబ్బులు చెల్లించలేదని తెలుస్తోంది.

భారత క్రికెట్ బోర్డును ఒక ప్రముఖ సంస్థ నిలువునా ముంచింది. ఏకంగా రూ.కోట్లలో డబ్బులు చెల్లించలేదని తెలుస్తోంది.

  • Author singhj Published - 08:09 AM, Tue - 5 December 23

ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్ ముగిసిపోవడంతో ఇప్పుడు సౌతాఫ్రికా సిరీస్ మీద భారత్ కన్నేసింది. ఆసీస్ సిరీస్ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకుంది టీమిండియా. ఈ సిరీస్​ మన టీమ్​కు పెద్ద ప్లస్ అనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్​లో యంగ్​స్టర్స్ అదరగొట్టారు. మరో ఏడు నెలల్లో పొట్టి ఫార్మాట్​లో ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో త్వరలో తుదిజట్టుపై ఓ క్లారిటీ రావాల్సి ఉంటుంది. అందుకే కంగారూలతో సిరీస్​ను ప్రతిష్టాత్మకంగా భావించింది టీమిండియా మేనేజ్​మెంట్. అందుకు తగ్గట్లే యువకులకు అవకాశాలు ఇస్తూ ప్రోత్సహించింది. ఏయే ప్లేసెస్​కు ఎవరు సెట్ అవుతారనేది పరీక్షించింది. ఒకవేళ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్లు టీ20 టీమ్​లోకి కమ్​బ్యాక్ ఇస్తే ఎవరెవర్ని తీసేయాల్సి ఉంటుందనేది దాని మీదా ఐడియాకు వచ్చింది.

ఆసీస్​తో సిరీస్ ద్వారా భారత జట్టుకు సుదీర్ఘ కాలం సేవలు అందించగల సత్తా ఉన్న యంగ్​స్టర్స్​ ఎవరో తెలుసుకోవడంలో టీమ్ మేనేజ్​మెంట్ చాలా మటుకు సక్సెస్ అయింది. ఓపెనింగ్​లో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టారు. ముఖ్యంగా జైస్వాల్ ఎలాంటి బెరుకు లేకుండా ధనాధన్ ఇన్నింగ్స్​లు ఆడాడు. క్విక్ స్టార్ట్స్ అందించాడు. అయితే పవర్​ప్లేలోనే ఔట్ అవ్వకుండా ఇన్నింగ్స్​ను పొడిగించుకోగలిగితే ఫ్యూచర్ స్టార్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో ఓపెనర్ రుతురాజ్ తన క్లాస్ బ్యాటింగ్​తో అలరించాడు. కావాల్సినప్పుడు షాట్లు కొడుతూ, అవసరమైనప్పుడు స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఓ సీనియర్ ప్లేయర్ మాదిరిగా ఆడాడు.

కొత్త కుర్రాడు, వికెట్ కీపర్ జితేష్ శర్మ కూడా ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్​లో​ పించ్ హిట్టింగ్​తో ప్రత్యర్థులను భయపెట్టిన జితేష్.. కీపింగ్​లోనూ తన మార్క్ చూపించాడు. తిలక్ వర్మ మొదట్లో కాస్త తడబడ్డా తర్వాతి మ్యాచుల్లో పుంజుకొని రాణించాడు. ఇషాన్ కిషన్ అయితే వరుసగా మెరుపు ఇన్నింగ్స్​లు ఆడి టీమ్​లో తానెంత విలువైన ప్లేయరో మరోమారు ప్రూవ్ చేసుకున్నాడు. ఆఖర్లో బ్యాటింగ్​కు వచ్చే రింకూ సింగ్ అయితే మహేంద్ర సింగ్ ధోని తరహాలో కూల్​గా మ్యాచులను ఫినిష్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించాడు. అతడే మరో ధోని అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. బౌలింగ్​లో ముకేశ్ కుమార్, అర్ష్​దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్​లు రన్స్ ఇచ్చుకున్నా కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ తమలోని సత్తాను చాటుకున్నారు. ఈ సిరీస్ హీరోల్లో మరో ఇద్దరు ఉన్నారు. వాళ్లే అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్. ఇప్పటికే ఎన్నో మ్యాచుల్లో భారత్​ను గెలిపించిన అక్షర్ అదే ఫామ్​ను కంటిన్యూ చేశాడు.

బిష్ణోయ్ అయితే ఫ్యూచర్ స్పిన్నర్ తానేనని నిరూపించుకున్నాడు. ఇలా ఎన్నో పాజిటివ్ అంశాలను భారత్​కు మిగిల్చిన ఈ సిరీస్ ముగియడంతో నెక్స్ట్ సఫారీ టూర్​పై అంతా ఫోకస్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)ని ఒక ప్రముఖ సంస్థ రూ.కోట్లలో ఎగవేయడం చర్చనీయాంశంగా మారింది. 2019లో టీమిండియాకు స్పాన్సర్​కు వచ్చిన బైజుస్ సంస్థ బీసీసీఐకి రూ.158 కోట్లు ఇవ్వాల్సి ఉందట. ఎన్ని రోజులు గడుస్తున్నా స్పాన్సర్​షిప్ డబ్బులు చెల్లించకపోవడంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్​సీఎల్​టీ) ఆశ్రయించింది బీసీసీఐ. బైజుస్​కు మాతృ సంస్థ అయిన థింక్ అండ్ లర్న్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మీద కేసు వేసింది. దీంతో బైజుస్​కు నోటీసులు పంపిన ఎన్​సీఎల్​టీ.. దీనిపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేసింది ట్రిబ్యునల్. మరి.. బైజుస్ సంస్థ బీసీసీఐని డబ్బులు ఇవ్వకుండా ముంచడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IPL 2024 Auction: అందరి టార్గెట్ అతడే! రూ. 20 కోట్లైనా తగ్గేదేలే..

Show comments