Nidhan
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి తెలిసిందే. అద్భుతమైన స్పిన్ బౌలింగ్‌తో పాటు తనకు మాత్రమే సాధ్యమైన క్రికెటింగ్ టాక్టిక్స్తోనూ పేరు తెచ్చుకున్నాడు అశ్విన్.
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి తెలిసిందే. అద్భుతమైన స్పిన్ బౌలింగ్‌తో పాటు తనకు మాత్రమే సాధ్యమైన క్రికెటింగ్ టాక్టిక్స్తోనూ పేరు తెచ్చుకున్నాడు అశ్విన్.
Nidhan
టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి తెలిసిందే. క్రికెట్‌కు భారత్ అందించిన అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడు అశ్విన్. క్యారమ్ బాల్స్, దూస్రాలతో ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తుంటాడతను. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ఓ చేయి వేసి వందల మ్యాచుల్లో టీమిండియాకు విజయాలు అందించాడు అశ్విన్. ఒకప్పుడు మూడు ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్‌గా మారిన ఈ స్పిన్ దిగ్గజం.. ఇప్పుడు టెస్టుల్లో మాత్రమే కనిపిస్తున్నాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్‌లో మెరిశాడు. కానీ కుర్ర స్పిన్నర్లు దూసుకురావడంతో అతడు మళ్లీ లాంగ్ ఫార్మాట్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. అలాంటి అశ్విన్ కూతుళ్లకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
అశ్విన్‌కు ఇతర స్పిన్నర్లకు ఓ స్పష్టమైన తేడా ఉంది. అదే తెలివి. అమేజింగ్ క్రికెట్ బ్రెయిన్స్‌లో ఒకటిగా అశ్విన్‌ను చెబుతుంటారు. గేమ్‌ను అర్థం చేసుకోవడం, మ్యాచ్ సిచ్యువేషన్స్‌కు తగ్గట్లు నిర్ణయాలు తీసుకోవడం, బ్యాటర్ల ఆటతీరును బట్టి వ్యూహాలు మార్చుకొని బంతులేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఎంతటి బ్యాటర్‌ను అయినా తన తెలివైన వ్యూహాలతో కంగుతినిపిస్తుంటాడు అశ్విన్. అతడి టాక్టిక్స్‌కు తోపు ఆటగాళ్లు కూడా కన్ఫ్యూజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటోడి కూతుళ్లు కూడా మామూలుగా లేరు. అశ్విన్ డాటర్స్ అఖిరా, ఆద్యలు తండ్రిని మించిపోయారు. వాళ్లకు ఉన్న క్రికెట్ నాలెడ్జ్ గురించి తెలిస్తే ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. అఖిరా, ఆద్యతో కలసి తాజాగా ఓ వీడియో చేశాడు అశ్విన్.
ఇప్పుడు టీ20 వరల్డ్ కప్-2024 జరుగుతుండటంతో తన కూతుళ్లకు ఓ క్విజ్ పెట్టాడు అశ్విన్. ఇందులో మెగా టోర్నీలో పాల్గొంటున్న జట్లు, వేదికలు, ప్లేయర్లకు సంబంధించి పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు. వాటికి అఖిరా, ఆద్యలు సులువుగా జవాబులు చెప్పేశారు. ప్రపంచ కప్ ఎక్కడ జరగబోతోంది? అని అడిగితే అమెరికా-కరీబియన్ ద్వీపాలు అని జవాబిచ్చారు. వెస్టిండీస్ టీమ్ కెప్టెన్ ఎవరు? అనే దానికి రొమాన్ పావెల్ అని ఆన్సర్ ఇచ్చారు. టీమిండియా కోచ్ ఎవరు? అనే ప్రశ్నకు రాహుల్ ద్రవిక్ అని చకచకా సమాధానాలు చెప్పేశారా బుడతలు. ఇప్పటిదాకా ఎన్ని వరల్డ్ కప్‌లు జరిగాయని అడగ్గా.. 8 అని జవాబిచ్చారు అశ్విన్ కూతుళ్లు. కఠిన ప్రశ్నలకు కూడా వెంటనే సమాధానం చెప్పడంతో వీళ్ల క్రికెట్ నాలెడ్జ్‌కు అంతా ఫిదా అవుతున్నారు. మరి.. అశ్విన్ కూతుళ్ల టాలెంట్ గురించి మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.