Nidhan
అద్భుతమైన బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానుల మనసులు దోచుకున్న ఓ టీమిండియా స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఉన్నపళంగా ఆటకు గుడ్‌బై చెప్పడంతో అంతా షాకవుతున్నారు.
అద్భుతమైన బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానుల మనసులు దోచుకున్న ఓ టీమిండియా స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఉన్నపళంగా ఆటకు గుడ్‌బై చెప్పడంతో అంతా షాకవుతున్నారు.
Nidhan
అద్భుతమైన బ్యాటింగ్‌తో అభిమానుల మనసులు దోచుకున్న టీమిండియా సీనియర్ బ్యాటర్ కేదార్ జాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. పదేళ్ల కెరీర్‌కు అతడు గుడ్‌బై చెప్పేశాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. టీమిండియా తరఫున 73 వన్డేలు ఆడిన జాదవ్ 1389 పరుగులు చేశాడు. అలాగే 9 టీ20ల్లో 122 పరుగులు చేశాడు. స్పిన్నర్ కూడా అయిన జాదవ్.. 50 ఓవర్ల ఫార్మాట్లో 27 వికెట్లు పడగొట్టాడు. 39 ఏళ్ల జాదవ్‌లో ఇంకా ఆడే సత్తా ఉన్నా ఉన్నపళంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో అతడి ఫ్యాన్స్ బాధపడుతున్నారు. అతడి బ్యాటింగ్ స్టైల్ సూపర్బ్‌గా ఉంటుందని గుర్తుచేసుకుంటున్నారు.
భారత జట్టు తరఫున 2014లో ఫస్ట్ మ్యాచ్ ఆడాడు జాదవ్. ఆ ఏడాది నవంబర్‌లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌తో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరుసటి సంవత్సరం పొట్టి క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఒక్కో రన్‌తో స్కోరు బోర్డును కదిలిస్తూ అవసరమైనప్పుడు భారీ షాట్లు కూడా బాదే జాదవ్.. కెరీర్లో మరింత ఉన్నత స్థానానికి వెళ్తాడని అంతా భావించారు. కానీ గాయాలు వెంటాడటం, ఫామ్ కోల్పోవడం, అవకాశాలను సరిగ్గా వినియోగించుకోకపోవడంతో రేసులో అతడు వెనుకబడిపోయాడు. మధ్యలో టీమ్‌లో వస్తూ పోయినా ప్లేస్‌ను ఫిక్స్ చేసుకోలేకపోయాడు. ఐపీఎల్లో సీఎస్కే, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతూ మంచి క్రేజ్ సంపాదించాడు. మరి.. కేదార్ జాదవ్ రిటైర్మెంట్ మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Kedar Jadhav has announced his retirement from all forms of cricket. ⭐ pic.twitter.com/NqxkfkdKCJ
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 3, 2024