iDreamPost

10 ఏళ్ల కెరీర్​కు గుడ్​బై చెప్పిన భారత స్టార్.. ఇంకా ఆడే సత్తా ఉన్నా..!

  • Published Jun 03, 2024 | 3:27 PMUpdated Jun 03, 2024 | 3:36 PM

అద్భుతమైన బ్యాటింగ్​తో క్రికెట్ అభిమానుల మనసులు దోచుకున్న ఓ టీమిండియా స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఉన్నపళంగా ఆటకు గుడ్​బై చెప్పడంతో అంతా షాకవుతున్నారు.

అద్భుతమైన బ్యాటింగ్​తో అభిమానుల మనసులు దోచుకున్న టీమిండియా సీనియర్ బ్యాటర్ కేదార్ జాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. పదేళ్ల కెరీర్​కు అతడు గుడ్​బై చెప్పేశాడు. క్రికెట్​ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. టీమిండియా తరఫున 73 వన్డేలు ఆడిన జాదవ్ 1389 పరుగులు చేశాడు. అలాగే 9 టీ20ల్లో 122 పరుగులు చేశాడు. స్పిన్నర్ కూడా అయిన జాదవ్.. 50 ఓవర్ల ఫార్మాట్​లో 27 వికెట్లు పడగొట్టాడు. 39 ఏళ్ల జాదవ్​లో ఇంకా ఆడే సత్తా ఉన్నా ఉన్నపళంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో అతడి ఫ్యాన్స్ బాధపడుతున్నారు. అతడి బ్యాటింగ్ స్టైల్ సూపర్బ్​గా ఉంటుందని గుర్తుచేసుకుంటున్నారు.

భారత జట్టు తరఫున 2014లో ఫస్ట్ మ్యాచ్ ఆడాడు జాదవ్. ఆ ఏడాది నవంబర్​లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్​తో ఇంటర్నేషనల్ క్రికెట్​లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరుసటి సంవత్సరం పొట్టి క్రికెట్​లో అరంగేట్రం చేశాడు. ఒక్కో రన్​తో స్కోరు బోర్డును కదిలిస్తూ అవసరమైనప్పుడు భారీ షాట్లు కూడా బాదే జాదవ్.. కెరీర్​లో మరింత ఉన్నత స్థానానికి వెళ్తాడని అంతా భావించారు. కానీ గాయాలు వెంటాడటం, ఫామ్ కోల్పోవడం, అవకాశాలను సరిగ్గా వినియోగించుకోకపోవడంతో రేసులో అతడు వెనుకబడిపోయాడు. మధ్యలో టీమ్​లో వస్తూ పోయినా ప్లేస్​ను ఫిక్స్ చేసుకోలేకపోయాడు. ఐపీఎల్​లో సీఎస్​కే, సన్​రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతూ మంచి క్రేజ్ సంపాదించాడు. మరి.. కేదార్ జాదవ్ రిటైర్మెంట్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి