iDreamPost
android-app
ios-app

IND vs ZIM: జింబాబ్వేతో సిరీస్‌.. యంగ్‌ టీమిండియాకు పాత జెర్సీలు ఇచ్చిన BCCI?

  • Published Jul 06, 2024 | 7:10 PM Updated Updated Jul 06, 2024 | 7:10 PM

IND vs ZIM, BCCI: జింబాబ్వేతో ఐదు టీ20 సిరీస్‌ శనివారంతో ప్రారంభమైంది. అయితే.. ఈ సిరీస్‌లో భారత జట్టు పాత జెర్సీలతో ఆడుతోంది. మరి అలా ఆడటానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

IND vs ZIM, BCCI: జింబాబ్వేతో ఐదు టీ20 సిరీస్‌ శనివారంతో ప్రారంభమైంది. అయితే.. ఈ సిరీస్‌లో భారత జట్టు పాత జెర్సీలతో ఆడుతోంది. మరి అలా ఆడటానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jul 06, 2024 | 7:10 PMUpdated Jul 06, 2024 | 7:10 PM
IND vs ZIM: జింబాబ్వేతో సిరీస్‌.. యంగ్‌ టీమిండియాకు పాత జెర్సీలు ఇచ్చిన BCCI?

భారత క్రికెట్‌ అభిమానులు ఇంకా టీ20 వరల్డ్‌ కప్‌ 2024 మూడ్‌ నుంచి బయటికి రాకముందే.. యంగ్‌ టీమిండియా జింబాబ్వేతో సిరీస్‌ మొదలుపెట్టేసింది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు ఇటీవల టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో సౌతాఫ్రికాపై విజయం నుంచి మొదలైన సెలబ్రేషన్స్‌ మూడ్‌.. ఇప్పటికీ కొనసాగుతోంది. భారత జట్టు టీ20 వరల్డ్‌ కప్‌లో ఉండగానే జింబాబ్వేతో సిరీస్‌కి యంగ్‌ టీమ్‌ను ఎంపిక చేశారు భారత సెలెక్టర్లు. నేటి(జూలై 6 శనివారం) నుంచి భారత్‌-జింబాబ్వే మధ్య ఐదు టీ20ల సిరీస్‌ ప్రారంభం అయింది.

అయితే.. ఈ సిరీస్‌ కోసం టీమిండియా కుర్రాళ్లకు బీసీసీఐ పాత జెర్సీలనే పంపినట్లు విమర్శలు వస్తున్నాయి. టీ20 వరల్డ్‌ కప్‌ కంటే ముందు ప్రింట్‌ చేయించిన జెర్సీలను జింబాబ్వేకు పంపినట్లు సమాచారం. భారత జట్టు ఆడే టీ20 మ్యాచ్‌ల్లో బీసీసీఐ లోగోపై ఒక స్టార్‌తో ఉన్న జెర్సీలు ధరించి ఆడుతుంది. ఆ స్టార్‌.. 2007లో గెలిచిన టీ20 వరల్డ్‌ కప్‌కు సూచిక. కానీ, ఇప్పుడు టీమిండియా ఖాతాలో రెండు టీ20 వరల్డ్‌ కప్‌లు ఉన్నాయి. అయినా కూడా టీమిండియా ఆటగాళ్లు జింబాబ్వేతో ఒక స్టార్‌ ఉన్న జెర్సీతోనే బరిలోకి దిగారు.

ఈ విషయంపై కొంతమంది భారత క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2007లో గెలిచిన టీ20 వరల్డ్‌ కప్‌, తాజాగా గెలిచిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024కు సూచికగా టీమిండియా టీ20ల్లో రెండు స్టార్లు ఉన్న జెర్సీలతోనే ఆడాలని, వెస్టిండీస్‌ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత.. ప్రధాని మోదీతో భేటీకి, అలాగే ముంబైలో నిర్వహించే విక్టరీ పరేడ్‌ కోసం స్పెషల్‌గా డిజైన్‌ చేయించిన జెర్సీపై రెండు స్టార్లు ఉన్నాయని, కానీ, జింబాబ్వేతో ఆడే జట్టు జెర్సీపై ఒక్క స్టార్‌ మాత్రమే ఉండటం గమనార్హం. దీంతో.. యంగ్‌ టీమిండియా పాత జెర్సీలతోనే ఆడుతుందని క్రికెట్‌ ఫ్యాన్స్‌ విమర్శిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.