IND vs SL: శ్రీలంకతో మూడో వన్డేనే 2024లో టీమిండియాకు చివరి వన్డే మ్యాచ్‌!

IND vs SL, Team India: భారత క్రికెట్‌ జట్టు 2024లో తమ చివరి మ్యాచ్‌కు సిద్ధం అయింది. ఈ ఏడాది పూర్తి కావడానికి ఇంకా నాలుగు నెలల పైనే ఉన్నా.. అప్పుడే చివరి మ్యాచ్‌ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్‌ పూర్తిగా చదవండి..

IND vs SL, Team India: భారత క్రికెట్‌ జట్టు 2024లో తమ చివరి మ్యాచ్‌కు సిద్ధం అయింది. ఈ ఏడాది పూర్తి కావడానికి ఇంకా నాలుగు నెలల పైనే ఉన్నా.. అప్పుడే చివరి మ్యాచ్‌ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్‌ పూర్తిగా చదవండి..

భారత్‌లో క్రికెట్‌ను ఒక మతంలా భావిస్తారనే విషయం తెలిసిందే. ఒక పక్కా ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతకాలు సాధిస్తూ.. చరిత్ర సృష్టిస్తున్నా.. ఇండియా-శ్రీలంక ద్వైపాక్షిక సిరీస్‌ మ్యాచ్‌లపైనే చాలా మంది ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. ఎందుకంటే.. ఇండియాలో క్రికెట్‌కు భారీ ఆదరణ ఉంటుంది. అది మిగతా క్రీడలపై ఉండదు. అందుకే మన దేశంలో క్రికెటర్లను కోట్ల మంది ఆరాధిస్తుంటారు. అలా క్రికెట్‌ను, క్రికెటర్లను విపరీతంగా ఆరాధించే వారికి ఒక బిగ్‌ అలర్ట్‌ అదేంటంటే.. ఈ ఏడాది టీమిండియాకు ఇదే చివరి వన్డే మ్యాచ్‌.

అదేంటి.. వచ్చే ఏడాది ఆరంభంలోనే ప్రతిష్టాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఉంది.. అలాంటి మెగా టోర్నీకి ముందు టీమిండియా మరో 4 నెలల పాటు ఒక్క వన్డే లేకుండా ఉంటే.. ఎలా అంటూ క్రికెట్‌ అభిమానులు కంగారు పడొచ్చు. కానీ, టీమిండియా షెడ్యూల్‌ అలానే ఉంది మరి. శ్రీలంకతో మూడో వన్డేలో భాగంగా బుధవారం చివరిదైన మూడో వన్డే ఆడనుంది టీమిండియా. ఈ వన్డే మ్యాచ్‌ తర్వాత.. తిరిగి 2025 ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస​్‌ ఆడనుంది. ఈ గ్యాప్‌లో ఒక్కటంటే ఒక్క వన్డే కూడా భారత జట్టు ఆడదు.

శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ ముగిసిన తర్వాత.. సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 12 వరకు బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. ఆ వెంటనే అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 5 వరకు న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌, నవంబర్‌ 8 నుంచి నవంబర్‌ 15 వరకు సౌతాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్‌, నవంబర్‌ 22 నుంచి 2025 జనవరి 7 వరకు ఆస్ట్రేలియాతో 5 టెస్టుల బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ, జవనరి 22 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌, మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది భారత జట్టు. ఈ షెడ్యూల్‌ ప్రకారం.. 2024లో ఇండియాకు శ్రీలంకతో ఆడే మూడో వన్డేనే చివరి వన్డే. మరి వన్డే క్రికెట్‌ను ఇష్టపడేవారు.. ఈ మ్యాచ్‌ను మిస్‌ కాకుండా చూడండి. అలాగే టీమిండియా షెడ్యూల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments