iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్ ముందు టీమిండియాకి కొత్త జెర్సీ! ఎక్కడో కొడుతోంది!

  • Published Oct 05, 2023 | 1:46 PM Updated Updated Oct 05, 2023 | 1:46 PM
  • Published Oct 05, 2023 | 1:46 PMUpdated Oct 05, 2023 | 1:46 PM
వరల్డ్ కప్ ముందు టీమిండియాకి కొత్త జెర్సీ! ఎక్కడో కొడుతోంది!

వన్డే వరల్డ్‌ కప్‌ కోసం అన్ని జట్లు సంసిద్ధంగా ఉన్నాయి. నేటి నుంచి వరల్డ్‌ కప్‌ మహా సంగ్రామం సైతం మొదలైంది. అహ్మాదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌తో మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే.. ఈ టోర్నీ కోసం అన్ని క్రికెట్‌ బోర్డులు ఎప్పుడో తమ స్క్వౌడ్‌లను ప్రకటించి, వరల్డ్‌ కప్‌ కోసం సరికొత్త జెర్సీలను విడుదల చేశాయి. అలాగే టీమిండియా సైతం తమ వరల్డ్‌ కప్‌ జెర్సీని రివీల్‌ చేసింది. కిట్‌ స్పాన్సర్‌ అడిడాస్‌ స్ట్రిప్స్‌లను మూడు రంగులుగా మారుస్తూ.. కొత్త జెర్సీని రిలీజ్‌ చేసింది. ఈ జెర్సీపై క్రికెట్‌ అభిమానులు సైతం సంతృప్తి వ్యక్తం చేశాడు.

జెర్సీ బాగుందంటూ మెచ్చుకున్నారు. అయితే.. తాజాగా వరల్డ్‌ కప్‌ ప్రారంభం రోజు బీసీసీఐ క్రికెట్‌ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తూ.. టీమిండియా సరికొత్త ప్రాక్టీస్‌ జెర్సీని రిలీజ్‌ చేసింది. అయితే.. ఈ ప్రాక్టీస్‌ జెర్సీ మొత్తం ఆరెంజ్‌ కలర్‌లోనే ఉండటంతో వైరల్‌గా మారింది. గతంలో 2019 వరల్డ్‌ కప్‌ సందర్భంగా కొన్ని మ్యాచ్‌లను ఆరెంజ్‌ ప్లస్‌ బ్లూ జెర్సీలో టీమిండియా మ్యాచ్‌లు ఆడింది. అయితే.. ఆ జెర్సీపై క్రికెట్‌ అభిమానులు పెదవి విరిచారు. బ్లూ కలర్‌ జెర్సీ ఎన్నో ఏళ్లుగా టీమిండియాకు బ్రాండ్‌ కలర్‌లా వస్తుంది. టీమిండియాను మెన్‌ ఇన్‌ బ్లూ అని కూడా అంటారు. అయితే.. ఇప్పుడు టీమిండియా మెయిన్‌ జెర్సీ బ్లూ కలర్‌లోనే ఉన్నా.. ప్రాక్టీస్‌ జెర్సీని ఆరెంజ్‌ కలర్‌లో రూపొందించారు.

ఈ ప్రాక్టీస్‌ జెర్సీ కంటే ముందు టీమిండియా లైట్‌ బ్లూ కలర్‌ ప్రాక్టీస్‌ జెర్సీ కలిగి ఉంది. అలాగే బ్లాక్‌ కలర్‌ ట్రావిలింగ్‌ జెర్సీ కలిగి ఉంది. ఇప్పుడు లైట్‌ బ్లూ కలర్‌ స్థానంలో అడిడాస్‌ ఆరెంజ్‌ కలర్‌ జెర్సీని తీసుకొచ్చింది. అయితే.. ఈ జెర్సీపై క్రికెట్‌ అభిమానులు జోకులు పేలుస్తున్నారు. ఇది నెదర్లాండ్స్‌ జెర్సీలా ఉందని, పెట్రోల్‌ బంక్‌లో పనిచేసే పంప్‌ బాయ్స్‌లా ఉన్నారంటూ కొంతమంది సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఈ జెర్సీ కూడా సూపర్‌గా ఉందని, మెయిన్‌ జెర్సీని సైతం ఆరెంజ్‌ కలర్‌లోకి మార్చాలని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్ కప్​లో టీమిండియాను అతడు ఒంటిచేత్తో గెలిపిస్తాడు: రవిశాస్త్రి

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom